January 14, 2013

బాబు యాత్ర విజయవంతం



 
చంద్రబాబు పాదయాత్ర ఖమ్మం నగరంలో విజయంతమైంది.. నగరంలో కి అడుగు పెట్టింది మొదలు చివరి వర కూ జనం 'నారా'' జనాలు పలికారు. ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు చేసిన కృషి, ముందస్తు ప్రణాళిక ఫలితంగా బాబు యాత్ర జయప్రదం అ య్యింది.. యాత్రకు ముందుగానే పక్కా ప్రణాళికతో వ్యవహరించిన తుమ్మల పార్టీ శ్రేణులను తదనుగుణంగా సమాయత్త పరిచారు. ఎప్పటికప్పుడు ఇతర నేతలతో చర్చిస్తూ బాబు యాత్రకు అన్ని విధాలా ఏర్పాట్లు చేశారు. తన పాదయాత్రకు అత్యధిక స్పందన వచ్చిన ప్రాంతాల్లో ఖమ్మం ఒకటని చంద్రబాబు నాయుడు స్వయంగా ఇతర జిల్లాల నేతలకు చెప్పటం గమనార్హం...  ఖమ్మం నగరానికి వచ్చిన బాబు ప్రకాష్ నగర్ మీ దుగా నగర పరిధి దాటారు..వేలాది మంది టీడీపీ కార్యకర్తలు అభిమానులు వీధుల్లోకి రావడంతో నగరం పసుపువర్ణంగా మారింది.. రోడ్లుకిక్కిరిసి పోవటంతోపాటు బస చేసిన సెయింట్ జోసెఫ్ పాఠశాలకు సైతం వేలాది మం ది తరలి రావటం విశేషం.

వేల సంఖ్య లో నాయకులు కార్యకర్తలు జై ఎన్టీఆర్, జై తుమ్మల అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబును చూసేందుకు ప్రధాన రహదారిపైన డివైడర్లపైనా జనం కిక్కిరిసి పోవటంతో పలు చోట్ల తొక్కిసలాట జరిగింది. వేలాది మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి చంద్రబాబు వెంట నడిచారు. పాదయాత్రలో ఖ మ్మం ఎంపీ నామ నాగేశ్వరరావుతో పా టు టీడీపీ నేతలు సండ్రవెంకట వీర య్య పోట్ల నాగేశ్వరరావు, బాలసాని ల క్ష్మీనారాయణ, కొండబాల కోటేశ్వరరా వు, తోటకూర రవిశంకర్, పునుకొల్లు రాంబ్రహ్మం, మ ందడపు రామకృష్ణ, చి ంతనిప్పు కృష్ణచైత న్య, చావా నా రాయణరావు సహా ప లువురు పాల్గొన్నారు. ఊ హించిన దానికన్నా అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావటంతో ఎ మ్మెల్యే తుమ్మలతో సహా నే తల్లో ఆనం దం వెల్లువెత్తింది.