January 14, 2013

కరెంట్ కోతలతో నష్టపోతున్నాం



గ్రానైట్ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా గ్రానైట్ అసోసియేషన్ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు విన్నవించింది. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా అదివారం రాత్రి వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద గ్రానైట్ అసోషియేషన్ బాధ్యులు చంద్రబాబును కలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రానైట్ అసోషియేషన్ రాష్ట్ర అ ధ్యక్షుడు రాయల నాగేశ్వరరావు మా ట్లాడుతూ ప్రభుత్వం విధిస్తున్న అంక్షలు, విద్యుత్ కొరత గ్రానైట్ పరిశ్రమలో సంక్షోభానికి కారణమవుతోందన్నారు. 5 హెక్టార్ల లోపు గ్రానైట్ క్వారీలకు జిల్లా అధికారులే అనుమతులు ఇచ్చే అవకాశం లేకపోవటంతో పరిశ్రమల యజమానులు ఇబ్బందులకు గురుతున్నారన్నారు. అనుమతుల కోసం హైదరాబాద్, ఢిల్లీ వెళ్లాల్సి వస్తోందని, దీని వల్ల వ్యయప్రయాసలకు గురవుతున్నామన్నారు. దీంతో పాటు పర్యావరణ శాఖ అనుమతులు తప్పనిసరని అధికారులు వేధిస్తుండటం పరిశ్రమను మరింత సంక్షోభంలోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

5హెక్టార్ల లోపు క్వారీలకు పర్యావరణ అనుమతులను సడలించాలన్నారు. దీంతో పాటు పరిశ్రమ మనుగడకు విద్యుత్ కోతలు ప్రధాన అవరోధంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు నెలకు 12రోజులు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని, ఇదీ చాలదన్నట్టు అనాధికారిక కోతల వల్ల నష్టాల ఊబిలో చిక్కుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 450 స్లాబ్‌తో పాటు మరో 250 టైల్స్ పరిశ్రమలు ఉన్నాయన్నారు. దీని పరిధిలో వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారని పేర్కొన్నారు.

కాబోయో ముఖ్యమంత్రి మీరే.... మా సమస్యలను పరిష్కరించాలి 'ప్రతి పక్షనేతగా మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి. ఎడాపెడా కోతలతో నష్టపోతున్నాం.

కాబో యో ముఖ్యమంత్రి మీరే. అప్పుడే మా సమస్యలు పరిష్కారమవుతాయని'' గ్రా నైట్ పరిశ్రమ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు యనమద్ది శ్రీనివాసరావు అన్నారు. రాజస్థాన్ తరహా లో రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమలకు కూడా వెసులుబాటు కల్పించాలన్నారు. గ్రానెట్ పరిశ్రమ నుంచి పర్యావరణ హానీ ఏమీ ఉండబోదన్నారు. గ్రానైట్ సంక్షోభ నివారణకు మీరు కృషి చేస్తారన్న నమ్మకం మాకు ఉందని'' ఆయ న పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో టైల్స్ అసోషియేషన్ నాయకులు బా ల నాగేశ్వరరావు, సాధు రమేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.