January 14, 2013

రాష్ట్రం బాగుంటేనే యువతకు భవిత




వివేకానంద..యువతలో స్ఫూర్తి రగిలించిన వ్యక్తి. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్ర పంచానికి చాటిన మహానుభావుడు. ఆయన జయంతి రోజున ఖమ్మం పట్టణంలో అడు గుపెట్టాను. దానికి తగినట్టే దారిపొడవునా యువత ఉరకలెత్తింది. వాళ్ల ఉత్సాహమే నాకు కొండంత బలం. నా యాత్రా మార్గానికి ముందూవెనక బైకు ర్యాలీలతో కుర్రాళ్లు హోరె త్తించారు. వారి భవిష్యత్తును తీర్చిదిద్దగలనన్న భరోసాతో నాకు అండగా నిలుస్తున్నారు.

వరంగల్ క్రాస్, పెద తండా వద్ద ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులు కలిశారు. వారిలో కోర్సులు చదువుతున్నవారు కొందరైతే, పూర్తిచేసి ఉద్యోగాలు లేక బతుకుపై విరక్తి పెంచు కుంటున్న తమ్ముళ్లూ చెల్లెళ్లు మరికొందరు. "సార్ నేను ఇంజినీరింగ్ పూర్తిచేశాను. ఏ కంపెనీ మెట్లెక్కినా ఉద్యోగం దొరికే పరిస్థితి లేద''ని ఒక తమ్ముడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఎంబీఏ అయిపోయి ఏడాదవుతున్నా ఖాళీగానే ఉండాల్సి వస్తున్నదని మరో చెల్లెలు వాపోయింది. బీఈడీ పూర్తి చేసిన తనకు ఎస్జీటీకి అవకాశం కల్పించాలని ఇంకొందరు వేడుకున్నారు. ప్రత్యేక బీఎడ్ నిర్వహించి మిగతావారిలాగే ఎస్జీటీకి అర్హులను చేస్తానన్న నా హామీని వారికి గుర్తుచేసి ఓదార్చాను.

గుజరాత్ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని, ఎక్కడెక్కడి పెట్టుబడులూ అక్కడికే వెళుతున్నాయని పత్రికల్లో కథనాలు చూసినప్పుడు ఈర్ష్య కలిగింది. పరిస్థితులు, పాలకులు బాగుంటే ఆ స్థాయిలో వెలగాల్సింది మన రాష్ట్రమే. నా తొమ్మిదేళ్ల పాలన అటువంటి ఆశను చిగురింపజేయగా తరు వాత వచ్చిన వాళ్లంతా దాన్ని చిదిమేశారు.

ఇప్పుడు చూస్తే.. మనకు రావాల్సిన లక్షల కోట్ల పెట్టుబడులు అటే పోతున్నాయి. మనకు రావాల్సిన ఉద్యోగాలూ ఆ వైపే తరలి పోతున్నాయి. మనకు మాత్రం మాఫియా, అవినీతి మిగిలాయి. ఈ పరిస్థితుల్లో ఒక్కో యువకుడు ఒక్కో వివేకానందుడై పోరాడినప్పుడే రాష్ట్రానికి పూర్వ వైభవం సాధ్యం!