January 14, 2013

ఇష్టం ఉంటే బిల్లు కట్టు లేకుంటే పవర్ కట్



 
'రాష్ట్రంలో అవినీతి వేళ్లూనుకుంది. కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారు. వారి తరతరాలకు సరిపడా పోగేస్తున్నారు. వారి అవినీతిని ఎండగట్టండంటూ'' టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యువతకు పిలుపునిచ్చారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర శనివారం ఖమ్మంరూరల్ మండలంలో సాగింది. మండల పరిధిలోని పెద్దతండాలో నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబు మట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రహిత రాష్ట్రంగా మార్చడమే ధ్యేయమని పేర్కొన్నారు. ప్రజాస ంపదను అడవి పందుల్లా తింటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న అవినీతి దొంగలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని అన్నారు. కిరికిరి సీ ఎం కిరణ్‌కు పాలన గురించి ఏమి తెలియదని విమర్శించారు. ప్రపంచంలో ఎ క్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై ప్రభుత్వం రూ.32వేల కోట్ల భారా న్ని మోపిందని ఆరోపించారు.

దీంతో పాటు ఏప్రిల్‌నెలలో మరో రూ.16వేల కోట్లు భారం మోపేందుకు సిద్ధమవుతోందని ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్ని స్తే.. 'ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వం... ఇక్కడ ఇంతే అన్నట్టుగా ఇష్టం ఉంటే బిల్లు క ట్టు, లేకపోతే పవర్ కట్ అంటున్నారని'' ఆరోపించారు. కరెంట్ ఎప్పు డు వస్తుం దో, ఎప్పుడు పోతుందో భగవంతుడికి కూడా తెలియకుండా ఉందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతలక సంబంధించిన పవర్ ప్రాజెక్టులక ప్రభు త్వం స హకరిస్తూ సామాన్య ప్రజలను నిలువు నా ముంచుతోందన్నారు. '9 ఏళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో కరెంట్‌ను చూసి ఇంట్లో ఉన్న గడియారాల్లో సమయాన్ని సరి చేసుకున్నారని'' ఆ యన గుర్తు చేశా రు. వరుస కరువులో కూడా 9గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేశామని గుర్తు చేశారు.

టీడీపీ అధికారంలోకి వస్తే బ్యాంకు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని తెలిపారు. గిరిజనులకు అదుకుంది ఒక్క టీడీపీ ప్రభుత్వమేనని తెలిపారు. ఈకార్యక్రమంలో ఖమ్మం ఎ ంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తు మ్మల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, జిల్లా నాయకురాలు స్వర్ణకుమారి, మండల పార్టీ అ ధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, టెలికం అ డ్వయిజరీ కమిటీ సభ్యుడు ధరావత్ రా మ్మూర్తి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మ న్ మద్ది మల్లారెడ్డి, ఎస్సీ సెల్ నాయకులు కొప్పుల ఆంజనేయులు, ఎస్టీసెల్ నా యకులు తేజావత్ పంతులునాయక్, రె డ్యానాయక్ పాల్గొన్నారు.