January 14, 2013

జనమా..బంతిపూల వనమా



ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల ఇలాకా లో టీడీపీ అధినేత చంద్రబాబు నా యుడికి ఘన స్వాగతం లభించింది.. వేలాది మంది కార్యకర్తలు అభిమానులు అడుగడుగునా బాబుకు స్వాగతం పలికారు. ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరా వు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రవెంకట వీ రయ్య, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు కాల్వొడ్డు వద్ద చంద్రబాబు నా యుడుకు ఘనంగా స్వాగతం పలికారు. వేలాదిగా టీడీపీ కార్యకర్తలు అభిమాను లు యా త్రలో పాల్గొన్నారు. యాత్రకు అపూర్వ జన స్పందన రావటంతో ఎమ్మె ల్యే తుమ్మల, మహిళా నేతలు ఫణీశ్వరమ్మ, రా యల లత, కొత్తపల్లి నీరజ తదితర నేత లు ఆనందంతో నృ త్యాలు చే శారు. టీడీ పీ కా ర్యకర్తలు చంద్రబాబు అభిమా ను లు భారీ సం ఖ్యలో తరలి రావటంతో ప ట్టణంలోని నయాబజార్, కాల్వొడ్డు, మ యూరి సెంటర్ తదితర వీధులు కిక్కిరిశాయి.

మయూరి సెంటర్ వంతెన పసు పు జన వార«థిగా మారింది.. అన్ని రోడ్లపై వేలాది మంది తరలిరావటంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. తుమ్మల అభిమానులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బాబుకు మంగళవాద్యాలతో సంప్రదాయ స్వా గతం పలికారు. నయాబజార్, మామిళ్ల గూడెం వంతెన, మయూరి సెంటర్, బస్ డిపోరోడ్, రాపర్తి నగర్ , బైపాస్ రో డ్ , ఎన్టీ ఆర్ సర్కిల్, ఇల్లెందు క్రాస్ రోడ్,వైరా రోడ్, బస్టాండ్ సెంటర్, మునిసిపల్ ఆఫీస్ రోడ్, కమాన్ బజార్, మీదుగా బాబు బస ప్రాంతం సెయింట్ జోసెఫ్ స్కూల్ వరకు యాత్ర జరిగింది. పాండురంగాపురం గ్రామం నుంచి టీడీ పీ నర్రా ఎల్లయ్య ఆధ్వర్యం లో కార్యకర్త లు పెద్ద ఎత్తున కాలినడకన వచ్చి యా త్రలో పాల్గొన్నారు.

భద్రాచలం డివిజన్ టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి తోటకూ ర రవిశంకర్, గుడపాటి శ్రీనివాసరావు, పరుచూరి ప్రేమ్‌చంద్, పలివేల శ్రీధర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

ం ఎన్టీఆర్ మార్గ్ జనసంద్రం జడ్పీసెంటర్: ఖమ్మం నగరంలోని ఎ న్‌టీఆర్ మార్గ్ జనసంద్రంగా మారింది. ఇల్లెందు, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా, మధిర, భద్రాచలంతో పాటుగా పలు ని యోజకవర్గాల నుంచి నాయకులు, కా ర్యకర్తలు, అభిమానులు, ప్రజలు సా యంత్రం నాల్గు గంటలకే ఎన్‌టీఆర్ మార్గ్‌కు చేరుకున్నారు. ప్రజల సమస్య లు తెలుచుకునేందుకు ఓ మాజీ ముఖ్యమంత్రి పాదయాత్రగా రావటంతో పార్టీలకతీతంగా యువకులు, మహిళలు, వృ ద్ధు టలు సైతం చంద్రబాబు కోసం ఎన్‌టీఆర్ మార్గ్‌నకు వచ్చారు. ఇల్లెందు, వైరా, వరంగల్, ఖమ్మం ప్రధాన రహదారులు జనసంద్రంగా మారాయి. ప్రసంగానికి ముందు చంద్రబాబు ఎన్‌టీఆర్ మార్గ్‌లోని ఎన్‌టీఆర్ విగ్రహనికి పూల మాలవేశారు.

పసుపు మయంగా మారిన సభాస్థలి ఖమ్మంలోని ఎన్‌టీఆర్ మార్గ్ బహిరంగ సభ వేదిక ప్రాంగణమంతా పసు పు మయంగా మారింది. ఎటు చూసిన పార్టీ తొరణాలతో చంద్రబాబు నా యు డు చేపట్టిన వివిధ పథకాలను తెలుపు తూ బ్యానర్లు పోస్టర్లు, కౌటట్లు తోరణా లు కనిపించాయి. ఉప్పొంగిన ఉత్సాహం

చంద్రబాబునాయుడు సభాస్థలికి రా వాటానికి కొంత ఆలస్యం కావటంతో నృత్య కళాకారులు ప్రదర్శనలు ఇచ్చి సభకు వచ్చిన ప్రజలను ఉత్తేజపర్చారు. మహిళలు ప్రత్యేక వేషదారణతో కోలాటాలు చేశారు. చంద్రబాబునాయుడు స భకు చేరటంతో కార్యకర్తలు ఒక్కసారిగా ప్రజలు విజయ సంకేతాన్ని చూపుతూ జై చంద్రబాబు.. జై తెలుగుదేశం అం టూ నినాదాలు చేశారు.దీపావళీగా మారిన సంక్రాంతి

చంద్రబాబు సభా స్థలికి వచ్చే సమయంలో ఎన్‌టీఆర్ మార్గ్ బాణ సం చా కాల్చారు. కార్యకర్తలు ఒక్కసారిగా భారీ స్థాయిలో బాణా సంచాలు కాల్చటంతో .. నగరం దద్దరిల్లింది. సంక్రాంతి పండగ ముందుగా దీపావళీని తలపించింది.