February 13, 2013

మైనార్టీలకు మేలు చే సింది టీడీపీనే..


 రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు మేలు చేసింది తెలుగుదేశం పార్టీనేనని చంద్రబాబు అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మంగళవారం పాదయాత్ర నిర్వహించిన చంద్రబాబు తన హయాంలో హజ్‌హౌస్, రెండో భాషగా ఉర్దూ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు, ప్రత్యేక డీఎస్‌సీ ద్వారా 1200 మంది ఉర్దూ టీచర్ల నియామకం, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల ఏర్పాటు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానన్నారు.

నేడు నాలుగు శాతం రిజర్వేషన్లు వచ్చాయంటే అది కూడా తమ చలవేనన్నారు. అయితే అది న్యాయ చిక్కులో పడిందన్నారు. తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు చట్ట సభల్లో ఎనిమిది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కేంద్రం పరిధిలో ఉంటే పోరాడి సాధిస్తామని చెప్పారు. అలానే రూ. 2,500 కోట్ల మైనార్టీల సంక్షేమానికి చర్యలు చేపడతామన్నారు. అసెంబ్లీలో 15 సీట్లు మైనార్టీలకు ఇస్తామన్నారు. ఇనాంలు, మతవలీలకు రూ. ఐదు వేల చొప్పున భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

గుంటూరు - విజయవాడకు మెట్రో రైలు తీసుకొస్తా..

గుంటూరు, విజయవాడ నగరాలను కలిపేసి ఒక మహానగరంగా తీర్చిదిద్దుతాని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఇక్కడే ఐటీహబ్, వ్యవసాయాదారిత పరిశ్రమలు, ఆటోమొబైల్ కేంద్రం నెలకొల్పి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామి ఇచ్చారు. గుంటూరు - విజయవాడ మధ్య ప్రయాణాన్ని అరగంటకు తగ్గించేందుకు అవసరమైన మెట్రో రైలును ఏర్పాటు చేస్తానని చెప్పారు.

నా పోరాటం ఆర్థిక స్వాత్రంత్యం కోసం

నేను చేసేది ధర్మ పోరాటం. అవినీతికి వ్యతిరేక పోరాటం. నీతిని కాపాడే పోరాటమని చంద్రబాబు పాదయాత్రలో పలుచోట్ల అన్నారు. దేశంలో ఏ ఒక్కడు అవినీతికి పాల్పడకపోతే ఆ దేశంలో పేదరికం ఉండదు. నా పోరాటం ఆర్థిక స్వాత్రంత్యం కోసం. నాడు గాంధీజీ బ్రిటీష్ వారి పై పోరాడి మనకు రాజకీయ స్వాత్రంత్యం తెచ్చి పెట్టారు. నేను పేదవాళ్లు, రైతుల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాను.

పదేళ్లుగా వేధిస్తున్నారు..

బాబుకు చంద్రబాబు కాలనీ మహిళ వినతి


'అయ్యా నగర శి వారులో గుడిసెలు వేసుకున్నాం.. దానికి చంద్రబాబు కాలనీ అని పేరు పెట్టుకున్నాం... పదేళ్లు గా ఇళ్ల స్థలాల పట్టాల కోసం తిరుగుతున్నాం... పట్టాలు అడిగితే కేసులు పెట్టి వేధిస్తున్నారు... మీరే కాపాడాలి.. అని వస్తున్నా మీ కోసం పాదయాత్రలో చంద్రబాబు కాలనీ మహిళలు వారి గోడు వెళ్ల బోసుకున్నారు. బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు ప్రజల ను ఉద్ధేశించి కొంత సేపు ప్రసంగించారు.

ఈ సమయంలో పలువురిని వారి సమస్యలు చెప్పాలని చంద్రబాబు కోరారు. దీంతో చంద్రబాబు కాలనీకి చెందిన పలువురు మహిళలు మాట్లాడా రు. ' నగర శివారులో పొన్నూరు రోడ్డులో ఇళ్లు కట్టుకుని ఓ కాలనీ ఏర్పాటు చేసుకున్నాం. దానికి చంద్రబాబు కాలనీ అన్న పేరు పెట్టాం. పదేళ్ళుగా ఆ ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అడిగిన ప్రతిసారీ కేసు పెట్టి వేధిస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డు మాత్రమే ఉంది. ఆ తరువాత ఎలాంటి లబ్ధీపొందలేదు. మీరు అధికారంలోకి రావాలి. మా కష్టాలు తీర్చాలి.' అని వారు గోడు వెళ్లబోసుకున్నారు. దీనికి స్పందించిన చంద్రబాబు అవినీతి కాం గ్రెస్ పార్టీ దోచుకున్న డబ్బుతో కోటి మందికి లక్ష రూపాయలతో పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వవచ్చన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇళ్ల స్థలాల కు పట్టాలు ఇవ్వడంతో పాటు అర్హులైన పేదలకు రూ.లక్షతో ఇళ్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు.

సమస్యలు పరిష్కరించండి

- ఆర్టీసి ఉద్యోగులు

ఆర్టీసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సంస్థ ఉద్యోగులు కొందరు వస్తున్నా మీ కోసం పాదయాత్రలో చంద్రబాబును కలసి కోరారు. మంగళవారం పాదయాత్ర బస్టాండ్ సమీపంలో నుండి వెళ్లే సమయంలో డిపో వద్ద కొందరు కార్మికులు చంద్రబాబును కలిసారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. దీనికి స్పందించిన చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వం రూ. 400 కోట్లకు ఆర్టీసీ స్థలాలను బ్యాంకులకు తాకట్టు పెట్టిందన్నారు. దీనికి నెలకు రూ. కోటికిపైగా వడ్డీ కడుతుందన్నారు. పెరిగిన డీజిల్ ధరల కారణంగా ఆర్టీసీపై మరో రూ. 700 కోట్ల భారం పడుతుందన్నారు. ఇంకో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా వేస్తున్న పన్నులు ఆర్టీసీకి భారంగా పరిణమించాయన్నా రు ఆర్టీసీని ్రపైవేటు పరం చేయాలన్న దురుద్ధేశం తో ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుందన్నారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువస్తానన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పాలసీ రూపొందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

టీడీపీ వల్లే గుంటూరు అభివృద్ది

 కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్నా చెప్పుకోదగి న అభివృద్ది కార్యక్రమాలు ఏమీ చేయలేదని చం ద్రబాబు నాయడు ఆరోపించారు. మంగళవారం పాదయాత్రలో ఎన్టీ ఆర్ బస్టాండ్ వద్ద ఆయన మాట్లాడుతూ టీడీపీ వల్లే గుంటూరు ఇంతగా అభివృద్ది చెందిందని ఆయన గుర్తుచేశారు. పలు అవస్థాపనా సౌకర్యాలు, బృందావన్‌గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియం, మణిపురం బ్రిడ్జి, మా నససరోవరం పార్క్, ఎన్టీఆర్ స్టేడియం, మైనారిటీ షాదిఖానాలు, మాయబజార్‌లో షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెడ్ ట్యాంక్ ద్వారా తాగునీటి సదుపాయాలు, రైతు బజార్లు లాంటి అనేక అభివృద్ది కార్యక్రమాలు తెలుగుదేశం హయాంలోనే అభివృద్ది చేశామని చంద్రబాబు చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే గుంటూరులోని శిధిలావస్థలో ఉన్న జిన్నాటవర్‌ను అభివృద్ది పరచి దాని ప్రాభవం నిలబడే విధంగా కృషి చేస్తామన్నారు.

లయన్స్ క్లబ్ సేవలు విస్తరించండి
దేశంలో పేద, ధనికుల మధ్య అంతరాలను తగ్గించేందుకు లయన్స్ క్లబ్‌లు విశేషంగా కృషి చేస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ నూతలపాటి వీర ప్రకాశరావు ఆధ్వర్యం లో లయన్స్ క్లబ్, మెల్విన్ జోన్స్, గుంటూరు గ్రేటర్, కె ఎస్ ఆర్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవా రం సంగడిగుంటలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్ర పంచంలో అతిపెద్ద సేవా సంస్థ అయిన ల యన్స్ క్లబ్‌లో మన రాష్ట్రం నుంచి చిగురుపాటి వరప్రసాద్ ఇంటర్నెషనల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్‌గా పది దేశాల్లో కోట్లాది రూపాయలతో సేవా కార్యక్రమాలు అందించారని ప్రశంసించారు. చంద్రబాబును కలిసిన వారిలో క్లబ్ అధ్యక్షులు ఈశ్వరరావు, కృష్ణమూర్తి, నాగేశ్వరరావు, సుబ్బయ్య, ఆదిశేషయ్య, కళ్యాణ్, నవీన్‌చంద్ ఉన్నారు.

బాబును కలిసిన మాజీ ఎంపిీ వైవీరావు

 'వస్తున్నా...మీకోసం' చంద్రబాబు చేస్తున్న పాదయాత్రలో చంద్రబాబును మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయన బస చేసిన ప్రాంతంలో మాజీ ఎంపి వైవిరావు కలిశారు. పేదలు, రైతుల సంక్షేమం కోసం ముందుకు సాగుతున్న చంద్రబాబును అభినందించారు. అనంతరం వైవిరావు విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ రాజకీయాలలో మొదటి సారిగా ఎన్టీఆర్ 36వేల కిలోమీటర్లు దూరాన్ని చైతన్య ర«థంలో ప్రయాణించి కాంగ్రెస్‌ను మట్టి కరిపించారన్నారు. అదే స్పూర్తితో వస్తున్నా మీ కోసం ద్వారా చంద్రబాబు 2వేల కిలోమీటర్లు దాటి అలుపెరుగని యోధుడిలా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారన్నారు.

ఆకర్షణగా నిలిచిన కవిత, నన్నపనేని

చంద్రబాబు పా దయాత్రలో మంగళవారం తెలగు దేశం పార్టీ మహిళా నాయకురాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, సినీ న టి కవిత పాదయాత్రకు ముందు వెళ్తూ మహిళలతో ముచ్చటించారు. మీ సమస్యలు తెలుసుకునేందుకు చంద్రబాబు వస్తున్నారు.. మాట్లాడండి అంటూ వారిలో ఉత్సాహం నింపారు.

ఏర్పాట్ల పర్యవేక్షణలో మన్నవ..

చంద్రబాబు పాదయాత్ర ఏర్పాట్లును ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పాదయాత్ర తా జా సమాచారం తెలుసుకుని జిల్లా నాయకులకు, అటు రాష్ట్ర నాయకులకు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. పాదయాత్ర రూట్‌మ్యాప్ ఏర్పా ట్లు, వసతి వంటి వాటి గురించి అందరితో చర్చించి నిర్ణయాలు జరిగేలా చూస్తున్నారు.

బాబు చేతుల మీదుగా

బాలికకు అన్నప్రాసన


వస్తున్నా మీ కోసం యాత్రలో చంద్రబాబు దామోదర సంజీవయ్యనగర్‌లో ఓ బాలికకు అన్నప్రాసన నిర్వహించారు. డీఎస్‌నగర్‌కు చెం దిన బొల్లా సురేష్ కుమార్, అనూషలు తమ సం తానమైన దేదీప్యకు మంగళవారం నాడు చంద్రబాబు చేతుల మీదుగా ఆన్నప్రాసన చేయించా రు. దేదీప్య నోటిని తేనెతో తీపి చేసి చంద్రబాబు అన్నప్రాసన తంతు పూర్తి చేశారు. తమ అభిమా న నేత చేతుల మీదుగా కుమార్తెకు అన్నప్రాసన చేయించడం ఆనందంగా ఉందని ఈ సందర్భం గా సురేష్, అనూషలు పేర్కొన్నారు.

నగర నేతల్లో

ఉప్పొంగిన ఉత్సాహం


చంద్రబాబు పా దయాత్ర నగరంలో విజయవంతం కావడంతో తెలుగుదేశం పార్టీ నగర శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. చంద్రబాబు పాదయాత్ర శనివారం ఎన్‌టీఆర్ నగర్‌లో అడుగు పెట్టినప్ప టి నుంచి మంగళవారం సాయంత్రం మానససరోవరం వద్ద నగరం దాటేంత వరకు వీధులన్ని జనంతో నిండిపోయాయి. సోమవారం సిద్ధార్థ గార్డెన్స్ నుంచి బృందావన్‌గార్డెన్స్, దేవాపురం, అశోక్‌నగర్, బ్రాడీపేట, ఏటీ అగ్రహారం, శ్రీనివాసరావుతో ట, నల్లచెరువు, ఏటుకూరు రోడ్డు ప్రాంతాలు చం ద్రబాబు పాదయాత్రతో జనసంద్రంగా మారా యి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోనూ చంద్రబాబు యాత్రకు అదే స్పందన లభించడం తో నగర నేతలు మంచి జోష్‌తో ఉన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఇన్‌చార్జ్‌లు యాగంటి దుర్గారావు, ఎస్ ఎం జియావుద్దీన్ తమ నాయకులు, కార్యకర్తల ను సమన్వయం చేసుకొన్న తీరు జిల్లా నేతలను ఆకర్షించింది. పాదయాత్ర పొడవునా నగర నాయకులు వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్, ముత్తినేని రాజేష్, మ్యానీ, ఎలుకా వీరాంజనేయులు, సుకవాసి శ్రీనివాసరావు, ముప్పాళ్ల మురళీకృష్ణ, శివప్రసాద్, నాగేశ్వరరావు, ఎలుకా వీరాంజనేయులు, గోళ్ళ ప్రభాకర్, చిట్టిబాబు, కొంపల్లి మాలకొండయ్య, జాగర్లమూడి శ్రీనివాసరావు, వజ్జా రామకృష్ణ, విజయలక్ష్మి, పానకాల వెంకటమహాలక్ష్మి, ములకా సత్యవాణి, ఉమాదేవి కార్యకర్తలను సమన్వయం చేసుకొంటూ చంద్రబాబుకు సమస్యలు వివరి స్తూ నడిచారు. ఈ సందర్భంగా బోనబోయిన మాట్లాడుతూ నగరంలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చి తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు మేయర్ పీఠాన్ని గెలుపొందడమే తమ లక్ష్యమన్నారు.