September 2, 2013

బాబుకు పల్నాడు..నీరా'జనం'

 తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర ఆరంభం అదిరింది. యాత్రను అడ్డుకోవాలని వైసీపీ పిలుపును పల్నాడు ప్రజానీకం తోసి పుచ్చింది. గురజాల నియోజకవర్గం నుంచి వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలే కాకుండా వేల సంఖ్యలో ప్రజలు ఎదురెళ్లి చంద్రబాబుకు నీరాజనాలు పట్టారు. మండుటెండను లెక్క చేయకుండా ఘనస్వాగతం పలికారు. ప్రజలు ఇచ్చిన ఉత్సాహం చూసి చంద్రబాబు తన ప్రసంగాల్లో వైసీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్‌లపై విరుచుకుపడ్డారు.
చంద్రబాబు ఆదివారం మధ్యా హ్నం రెండు గంటలకు పొందుగల వారధి మీదగా పల్నాడులో అడుగు పెట్టారు. అప్పటికే ఆయన రాక కోసం అక్కడ వేచి చూస్తున్న టీడీపీ జిల్లా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యరపతినేని శ్రీనివాసరావు, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, జీ వీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రు లు ఆలపాటి రాజేంద్రప్రసాద్, డాక్టర్ శనక్కాయల అరుణ, మెట్ల సత్య నారాయణ, లాల్ వజీర్ ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ పొందుగల గ్రామానికి చేరుకొని చంద్రబాబు ఉద్రేకంగా ప్రసంగించారు. దుష్టనాగమ్మ పోలికగా సోనియమ్మను మాటల బాకులతో చంద్రబాబు బాలచంద్రుడిలా దునుమాడారు.తెలుగుజాతి జోలికి వస్తే పిల్ల, తల్లి కాంగ్రెస్‌లను శంకరగిరిమాన్యాలు పట్టిస్తానంటూ ప్రతిజ్ఞబూని బ్రహ్మనాయుడుని మరిపించారు.
1984లో అన్న ఎన్టీఆర్‌తో పెట్టుకొని ఇందిరాగాంధీ అడ్రసు లేకుండా పోయారని, ఇప్పుడు తెలుగుదేశాన్ని సాధించేందుకు కుట్రలు చేస్తు న్న సోనియాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అదే గతి పడుతుందని చంద్రబాబు అన్నప్పుడు తెలుగు తమ్ముళ్లు కేరింతలు కొట్టారు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తాను ఎంతో కష్టపడితే ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి అవినీతిలో రికార్డు సృష్టించారన్న బాబు మాటలకు ప్రజల నుండి విపరీతమైన స్పందన లభించింది. ఒక పక్క విభజనవాదం, మరో పక్క సమైక్య నినాదం వినపడుతున్న వేళ చంద్రబాబు ప్రసం గం వివాదాలకు దూరంగా సాగింది. కాంగ్రెస్ పెద్దలు ఏది చేయాలనుకున్నా ఇరుప్రాంతాలకు చెందిన ఉద్యమకారులను (ప్రస్తుతంఉద్యమిస్తున్న ఉద్యోగ, విద్యార్థి, ప్రజాసంఘాల)కూర్చోపెట్టి మాట్లాడి సమస్యలు పరిష్కారించాలని బాబు డిమాండ్ చేయటంతో యువత ఉత్సాహంగా చప్పట్లు చరిచారు.ఉద్యోగం వస్తుందన్న ఆశతో చదువుకుని హైదరాబాదు వెళ్లిన యువతీయువకులను ప్రస్తుత పరిస్థితులు తీవ్ర ఆందోళనలో పడవేస్తున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో కాంగ్రెస్, వైఎస్ఆర్ సీపీ, టీఆర్ ఎస్ కుట్ర దాగి ఉందని సభికుల కు వివరంగా తెలియజెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అ త్యధిక స్థానాలను గెలుచుకున్న తర్వా త తమ అడ్రసు గల్లంతువుందన్న ఆందోళనతోనే తెలుగుజాతి మధ్య ఇరుపార్టీలు కలిసి చిచ్చుపెట్టాయని అన్నారు.ఈ కుట్రలో ఇరుపార్టీలకు భాగస్వామ్యం లేకపోతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవటానికి కొద్దిరోజుల ముందే సమైక్య నినాదంతో వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు ఎలా చేశారని ఆయన ప్రశ్నించారు.జగన్ పార్టీకి బెయిల్, కేసులు మాఫీ తప్ప ప్రజాప్రయోజనం పట్టదని బాబు అంటున్నప్పుడు అన్నివర్గాల నుండి విశేష స్పందన లభించింది. పొందుగల సభ తర్వాత దాచేపల్లి బయలుదేరిన బాబును మార్గమధ్యలో రోడ్లపైకి పెద్దసంఖ్యలో వచ్చిన మహిళలు, యువకులు నిలువరించి హారతులిచ్చారు. జనాభిమానానికి ముగ్ధుడైన చంద్రబాబు సెక్యూరిటీ ఆంక్షలను ప్రక్కన పెట్టి బస్సుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.దాచేపల్లిలో ప్రసంగాన్ని ప్రారంభించిన బాబు ఇది దాచేపల్లి కాదు తెలుగువారి అభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని దోచేపల్లి అంటూ మొదలుపెట్టడంతో ప్రజలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.అక్కడి సభలో కూడా తల్లి, పిల్లకాంగ్రెస్‌లపై చంద్రబాబు మాటల బాణాలను సంధించారు.
మారిన చంద్రబాబు ప్రసంగశైలి !
ఆత్మగౌరవయాత్రలో చంద్రబాబు ప్రసంగ శైలిలో పూర్తిమార్పు కన్పించింది.గతంలో చెప్పదలుచుకున్న విషయా న్ని స్పష్టంగా చెబుతూ ముందుకు వెళ్లే బాబు ఇప్పుడు హావభావాలు ప్రదర్శి స్తూ, ప్రజాస్పందనను గమనిస్తూ మా ట్లాడటం కన్పించింది.ఏం తమ్ము ళ్లూ నిజమేనా అంటూ ఆయన పదే పదే ప్ర జలను ప్రశ్నించి స్పందన చవిచూశారు. మాటల్లో కూడా భావోద్వేగాన్ని కల్గించే ఘాటు కన్పించింది.ముఖ్యంగా నాడు ఎన్టీఆర్‌తో పెట్టుకొని ఇందిరాగాంధీ అభాసుపాలైనట్లే .. నేడు సోనియాగాంధీ తెలుగుదేశంతో పెట్టుకొని శంకరగిరిమాన్యాలు పడతారంటూ ఆ యన అన్నమాటలు ఎక్కువగా ఆకర్షించాయి. సోనియాకు డబ్బు పిచ్చి.. దే శంలో ఉన్న డబ్బంతా ఆమె కు కావాలనప్పుడు, వైఎస్ రాష్ట్రంలో అవినీతికి పాల్పడి ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టారం టూ ప్రసంగం వాడీవేడిని పెం చారు. మొద్దబ్బాయి కోసం రాష్ట్రాన్ని ఏదో చే యాలని చూస్తున్నారంటూ అన్న మా టలకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది.మాట్లాడేటప్పుడు అన్నివైపులా తిరిగి అందర్ని గమని స్తూ, అందర్ని ఉత్తేజపరుస్తూ చంద్రబాబు మాట్లాడటం ప్రజలను కట్టిపడేసింది.
మంత్ర ముగ్దుడైన బాబు
అసలు ఆత్మగౌరవయాత్రకు ఇది తగిన సమయంకాదని తెదేపా సీనియర్ నేతలు సైతం హెచ్చరించిన సందర్భంలో పొందుగలలో ప్రారంభమైన యాత్ర చంద్రబాబును మంత్రముగ్దుడ్ని చేసింది.వాళ్లు వీళ్లూ వచ్చి యాత్రకు ఆటంకం కల్గిస్తారని ప్రచారం ముమ్మరంగా జరిగిన పరిస్థితుల్లో ప్రజలు బాబు కోసం పరుగులు తీయ టం తెదేపా అధినేతను ఆశ్చర్యానికి గురిచేసింది.గతంలో పలుమార్లు చంద్రబాబు పల్నాడుకు వచ్చినప్పటికీ రాని స్పందన ఆత్మగౌరవయాత్రలో కన్పించింది.పొందుగల బ్రిడ్జి, గ్రామ పరిసర ప్రాంతాలు అశేషజనవాహినితో నిండిపోవటంతో తెదేపా శ్రేణులు ఆ నందంలో మునిగిపోయాయి.ముఖ్యం గా మహిళలు, యువకులు చంద్రబాబు ఆత్మగౌరవయాత్రకు ఎక్కువగా తరలిరావటం కన్పించింది.ఇటు దారిపొడవునా అదేస్థాయిలో జనం కన్పించటం నాయకుల్లో నూతనోత్సాహానికి కారణమైంది.దాచేపల్లి నాగులేరు సాక్షిగా జరిగిన సభకు ఇసుకేస్తేరాలనంత జనం రావటం చూసి తెదేపా అధినేత కాంగ్రెస్, వై ఎస్ ఆర్ సీపీ అవినీతి అక్రమాలపై మరింత వాడివేడి మాటలతో దాడిచేశారు.ఆత్మగౌరవయాత్ర అనుకున్న అతితక్కువ సమయంలో పల్నాడులో ముఖ్యంగా జగన్ సామాజిక వర్గం చెప్పుకోదగ్గ స్థా యిలో ఉన్న ఈ ప్రాంతంలో బాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం నూతన రాజకీయ విశ్లేషణలకు తెరతీసింది.
యరపతినేనిదే హవా
ప్రతికూల పరిస్థితుల్లో సైతం పల్నాడులో తెదేపాకు వెన్నుదన్నుగా నిలిచిన
గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆత్మగౌరవయాత్రలో ఆద్యంతం తన హవాను చూపించారు.ఉద్యమ వేళ ఆత్మగౌరవయాత్రను తన నియోజకవర్గంలో ఏర్పాటు చేయమని, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవ్వకుండా తాను చూసుకుంటానని అధినేతకు చెప్పి ఒప్పించి కార్యక్రమాన్ని పెట్టించిన ఆయన ప్రారంభాన్ని విజయవంతంగా నిర్వహించారు.యాత్ర ప్రారంభానికి ముం దు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడిన యరపతినేని పల్నాడులో తెలుగుదేశం శ్రేణులను, కార్యక్రమాలను అడ్డుకునే దమ్ము ధైర్యం ఎవరికి లేవని స్పష్టం చేశారు.అంచనాలకు మించి జనాన్ని స మీకరించటంలోనూ యరపతినేని సఫలీకృతులయ్యారు.