June 24, 2013

కేసీఆర్ కుటుంబాన్ని ఛీకొట్టే రోజులొచ్చాయి


కేసీఆర్ కుటుంబ సభ్యుల నిజస్వరూపం, అవినీతి విశ్వరూపం బయట పడిందని పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండ హంటర్‌రోడ్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకొని అడ్డదారిలో అక్రమార్జనకు పాల్పడేందుకు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్‌రావులు సాగిస్తు న్న దందాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయన్నారు. 'వీరంతా ఇప్పటికే తెలంగాణ సమాజం ముందు దోషులుగా నిలబడ్డారు.

అక్రమాలు, సాగిస్తున్న దుర్మార్గాలు రాబోయే రోజుల్లో మరి న్ని బయటకు వస్తాయి. వీరిని ఛీకొట్టే రోజులు దగ్గర పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు' అని ప్రకాశ్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ రావాలని ఏ కోశాన లేదని, ఆలోచనంతా సెంటిమెంట్‌తో ఎట్లా లాభం పొందుతామా అని ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 10 పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరుతున్నాడంటేనే అర్థం చేసుకోవ చ్చు.. గంపగుత్తగా అధికారం ఇస్తే చె న్నారెడ్డిలాగా ఆ సీట్లన్ని సోనియాకు తాకట్టెలని చూస్తున్నారమండిపడ్డారు.

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ రెండో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనే తీరిక కేసీఆర్‌కు లేదా? ఆయన అంత అనారోగ్యం తో బాధపడుతున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం ముసుగులో కేటీఆర్ పాల్పడుతున్న భూదందాలు, సెటిల్‌మెంట్ల బాగోతాన్ని సాక్ష్యాలతో ఏబీఎన్ చానెల్, ఆంధ్రజ్యోతి బయట పెడితే...దానికి సమాధానం ఇవ్వాల్సింది పోయి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడమేకాక, బెదిరింపులకు పాల్పడుతుండడం వి డ్డూరంగా ఉందన్నారు.

కాంగ్రెస్‌కు కాపలా కుక్క
ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కేటీఆర్‌కు ఉద్యమ నాయకుడికి ఉండాల్సి న లక్షణాలు, సంస్కారం లేదన్నారు. తప్పులు ఎత్తి చూపినప్పుడు వాటికి తగిన విధంగా వివరణ ఇవ్వాల్సి పో యింది సీమాంధ్ర మీడియా అని విరుకుపడడం విడ్డూరంగా ఉందన్నారు. తప్పులను బయటపెట్టేవారంతా తె లంగాణ ద్రోహులుగా ప్రచారం చే యడం ఆయన నీచ సంస్కృతిని స్పష్టం చేస్తోందన్నారు.

తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ ఇప్పుడు కాం గ్రెస్‌కు కాపలా కుక్కలా మారిపోయారన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు కష్టకాలం వచ్చినప్పుడలా ఏదో గొడవను సృష్టించి సభ జరగకుండా చేయడం ద్వారా ఆ పార్టీని కాపాడుతున్నది టీఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి టీడీపీని వదిలి వెళ్ళినా ఆర్థిక లావాదేవీలను మాత్రం వదులుకోవడం లేదన్నారు. పార్టీకి చెం దిన ఎమ్మెల్యే క్వార్టర్‌లోనే ఇంకా ఎం దుకు నివాసముంటున్నారని ప్రశ్నించా రు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యం వచ్చే ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేయకుండా మరో దళిత సోదరుడికి గెలిపించాలని సవాల్ చేశారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఆయనకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ సమావేశంలో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌చార్జి దొమ్మటి సాంబయ్య, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం, పరకాల నియోజకవర్గం ఇన్‌చార్జి చల్లా ధర్మారెడ్డి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఇన్‌చార్జి కట్టా మనోజ్ రెడ్డి, టీడీఎల్‌పీ కార్యదర్శి కేలిక కిషన్ ప్రసాద్, పుప్పాల సమ్మయ్య, పుల్లూరి ఆశోక్ కుమార్, మార్గం సారంగం, మునిగె వెంకట్రాజం, లొడంగి రాజు, షేఖ్‌బాబా ఖాదర్ అలీ పాల్గొన్నారు.