March 9, 2013

అడుగడుగునా తనిఖీలు

ఏలూర్రుకైం : టీడీపీ రాష్ట్ర అధ్యక్షు డు నారా చంద్రబాబునాయుడు జిల్లా పాదయాత్ర సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.రమేష్ ఆదేశాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం జిల్లాలోకి అడుగు పెట్టిన చంద్రబాబునాయుడుకు అడుగడుగు నా భద్రత వలయాన్ని ఏర్పాటు చేశా రు. ప్రత్యేక కాన్వాయ్‌ను ఏర్పాటు చే సి ఇన్‌ఛార్జిగా ఒక డీఎస్పీని నియమించారు.ఆ కాన్వాయ్‌లో ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్ఐలు, మరికొంత మంది పోలీసు సిబ్బందిని నియమించారు. మరో వైపు బాంబ్ స్క్వాడ్, పోలీసు జాగిలాలు రంగంలోకి దించి ఆయన పాదయాత్రకు ముందుగానే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వస్తువులను పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉండే పోలీసు సిబ్బందితో పాటు నరసాపురం సబ్ డివిజన్‌లో ఉండే పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

గతంలో తణుకు రూ రల్ మండలం పైడిపర్రులో టెక్ మ ధు నివాసంలో మావోయిస్టుల డంప్ లభించడం వంటి సంఘటనలను దృ ష్టిలో పెట్టుకుని పోలీసు ఉన్నతాధికారులు ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టారు.ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా అనేక విభాగాల పోలీసులను మఫ్టీలో నియమించి జాగ్రత్తలు తీసుకున్నారు.ఇద్దరు డీఎస్పీలతో పా టు 300 మంది పోలీస్ సిబ్బందిని ఈ పాదయాత్ర బందోబస్తు కోసం వినియోగించినట్టు సమాచారం.