March 9, 2013

తొలిరోజు అదుర్స్

ఏలూరు: పశ్చిమలో బాబు తొలిరోజు పాదయాత్ర అద్భుతంగా సాగింది. ఆయన రాక కోసం మధ్యాహ్నం నుంచే ఓ పిగ్గా ఎదురుచూసిన వారంతా యాత్ర ముగిసేంత వరకు ఆయన వెంటే అడుగులో అడుగులు వేశారు. ఆయన పాదయాత్ర సాగిన వీధులన్నీ జనంతో కిక్కిరిసి కన్పించాయి. ఉప్పుటేరు వం తెన నుంచి దుంపగడప వరకు రెండు కిలోమీటర్లు నడిచేందుకు సుమారు గంటన్నరకు పైగానే పట్టింది. అలాగే అక్కడి నుంచి ఆకివీడు చేరుకోవడాని కి మరో గంటన్నర పైగానే సమయం పట్టింది. మార్గమధ్యలో ఆయనను ద గ్గరగా వెళ్లి చూసేందుకు మహిళలు, యువకులు విఫలయత్నం చేశారు. దా నిని గుర్తించిన చంద్రబాబు అనేక మ ందిని భుజం తడుతూ చేతులు జో డించి నమస్కరిస్తూ నెమ్మదిగా ముం దుకు సాగారు.

కృష్ణాజిల్లా ఆలపాడు లో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఐ దు గంటల వరకు విరామం లేకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు జిల్లాలో రాత్రి ఏడున్నరకు పాదం మోపారు. ఒక్క దుంపగడప లో మాత్రమే ఆయన రెండుసార్లు స్వ ల్ప విరామం తీసుకున్నారు. రైల్వే క్రా సింగ్ వద్ద గేటు పడటంతో ఆయన పా దయాత్రను కొంతసేపు నిలిపివేసి ఆ తర్వాత తిరిగి కొనసాగించారు. పాదయాత్ర సాగుతున్నంత సేపు తెలుగుదేశం ముఖ్య కార్యకర్తలు, పోలీసులు, ప్రత్యేక కమెండోలు ఆయనకు రక్షణ బాధ్యతల్లో అప్రమత్తంగా కన్పించా రు. చంద్రబాబు అక్కడక్కడ మాట్లాడుతున్నప్పుడు 'బాబు బాగా అలసిపోయినట్లున్నారు. పాపం ఈ వయసు లో ఇంతెలా నడుస్తున్నారో' అని మ హిళలు ఆయన పట్ల సానుభూతి ప్రకటించారు.

పాదయాత్ర ఆలస్యమవుతు ందని ముందుగానే గమనించిన పార్టీ నాయకులు మాత్రం అందరినీ ఉత్సాహపరుస్తూ, వారితో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. తొలిరోజు ఆయన పాదయాత్రలో మహిళలు, యువకుల సంఖ్య అత్యధికంగా కన్పించింది. ఇ ళ్లల్లో పనులు వదిలేసిన మహిళలు కూ డా ఆయనను చూసేందుకు వీధుల్లోకొచ్చి నిలబడ్డారు. యువకులైతే కేరింతలు కొట్టడం సహజంగానే కేడర్‌లో ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసింది.