March 9, 2013

'అవిశ్వాసం'పై టీడీపీ నేతల తర్జనభర్జన

కొనేవారితో కలవాలా?
మన ఎమ్మెల్యేలకు గేలంవేసే వైసీపీకి మద్దతా?

  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం వ్యవహారంలో ఎటువంటి వ్యూహంతో వెళ్లాలన్న అం శంపై తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో ఒక నిర్ణయానికి రాలేకపోయింది. శనివారం కృష్ణా జిల్లాలో జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో నేతల మ« ద్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో తదుపరి పరిస్థితులను బట్టి పార్టీ వ్యూహాన్ని నిర్ణయించుకోవాలని నిశ్చయించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబా బు పాదయాత్రలో ఉండటంతో ఆయన ఉన్నచోటనే పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించారు.

అవిశ్వాసం వ్యవహారంపై ఈ సమావేశంలో రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 'అవకాశం దొరికిన ప్రతిసారీ వైసీపీ డబ్బు విరజిమ్మి మన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోంది. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ మనను బలహీనపర్చడానికి ప్రయత్నం చేస్తోంది. అలాంటప్పుడు ఆ పార్టీ అడగ్గానే మనం ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాలి? ఆ పార్టీ పెడితే మనం ఎందుకు బలపర్చాలి? శాసనసభ స్పీకర్, డిఫ్యూటీ స్పీకర్ పోస్టులకు మనం పోటీ పడగా, వైసీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. మనమూ మనకు లాభం ఉందనుకొన్నప్పుడు ప్రజల కోణంలో అవిశ్వాసం గురించి ఆలోచిద్దాం'' అని కొందరు నేతలు వాదించారు.

సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి వంటి నేతలు దీనిని ప్రతిపాదించగా, మరికొందరు నేతలు భిన్నమైన వాదన వినిపించారు. "ప్రధాన ప్రతిపక్షంగా మనం ఉండగా వైసీపీ అవిశ్వాసం ప్రతిపాదించి దానిని మనం బలపర్చాల్సి వస్తే బాగుండదు. అలాగని దూరంగా ఉన్నా రాజకీయంగా నష్టపో తాం. దాని బదులు మనమే అవిశ్వాసం ప్రతిపాదిద్దాం' అని అభిప్రాయపడ్డారు. కడియం శ్రీహరి వంటివారు ఈ వాదన వినిపించారు.

ప్రభుత్వం పడిపోయి మ« ద్యంతర ఎన్నికలు వచ్చినా ఫర్వాలేదని, అటూ ఇటూ కాకుండా ఉప ఎన్నికలు వస్తేనే చికాకని పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. ఈ అభిప్రాయాలన్నీ తాను పరిగణనలోకి తీసుకొంటానని, పరిణామాలను బట్టి మరోసారి అందరితో చర్చిస్తానని చంద్రబాబు చెప్పారు. ఏడాదిలో సాధారణ ఎన్నికలు రాబోతుండగా ఇప్పు డు ఉప ఎన్నికల వ్యవహారం పెట్టుకోవడం సరికాదనిపిస్తోందని పేర్కొన్నారు.