March 9, 2013

సమస్యలు వింటూ ముందుకు

భీమవరం / ఆకివీడు రూరల్ / ఆకివీడు:మాకు ఇళ్ళు లేవు, స్థలాలు లేవు, అద్ధెళ్ళల్లో ఉంటున్నాం అంటూ మారదాని ఎల్లమ్మ అనే పెద్దావిడ వాపోయింది. ఆకివీడు రైల్వే గేటు దాటిన తర్వాత కొంతమంది మహిళలు చంద్రబాబును ఆపి ఇళ్ల స్థలాల సమస్యను వివరించారు. ప్రతీ ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

విద్యుత్ లేక ఇబ్బందంటూ పదో తరగతి విద్యార్ధిని ఆవేదన..

పదో తరగతి పరీక్షలు వస్తున్నాయి. కరెంట్ కోత వల్ల చదవలేకపోతున్నామని టి కుమారి అనే విద్యార్థిని చంద్రబాబు వద్ద వాపోయింది. ఆ బాలిక చెప్పే సమస్యను చంద్రబా బు ఆలకించి విద్యుత్ సమస్యను లే కుండా చూస్తానని, కాంగ్రెస్ ప్ర భు త్వం విద్యుత్ కోతతో అందరికీ ఇ బ్బ ంది పెడుతున్నారని విమర్శించారు.

చిన్న మసీదు వద్ద హారతులు..

రైల్వే స్టేషన్ సమీపంలోని చిన్న మసీదు ప్రాంతంలో మహిళలు హారతులు పట్టారు. చింతలపాటి సూర్యకుమారి, శృతి ఇచ్చిన హారతిని నవ్వుతూ స్వీకరిస్తూ అభివాదం చేశారు.

చంద్రబాబుతో మాట్లాడేందుకు మహిళలు ఉత్సాహం..

ఆకివీడు రైల్వే స్టేషన్ రోడ్డులో చంద్రబాబు వద్ద మహిళలు అడుగడుగునా స్పందించారు. తమ సమస్యలను ఏకరువు పెట్టారు. చిన్న మసీదు నుంచి రైల్వే స్టేషన్ సెంటర్ నుంచి సిద్ధాపురం రోడ్డు వరకు పలు చోట్ల మహిళలు ప్రస్తావించారు. రైల్వే స్టేష న్ సెంటర్‌లో నీలం లక్ష్మీ, కె పద్మ, షేక్ బీర్భమ్‌బేబీ, షేక్ షాన్‌బేబీ అనే మహిళలు ఇళ్ళ స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. విద్యుత్ కోతల వల్ల అష్టకష్టాలు పడుతున్నామన్నారు. మహిళలు గుంపులుగా వచ్చి తామంతా కష్టాలు పడుతున్నామంటూ చెప్పుకొచ్చారు.

తనకు ఇద్దరు పిల్లలని అదే ప్రాంతానికి చెందిన డోల పార్వతి అనే మహిళ చెప్పింది. ఇద్దరికీ మాటలు రావని, ఆపరేషన్ చేయించినా మెరుగు పడలేదని, తన పిల్లలకు ఏదైనా పింఛను ఇప్పిస్తే తమకు కొం త బాధలు తప్పుతాయంటూ వాపోయింది. మీకు న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

మరికొంత దూరం వచ్చే సరికి పలువురు ముస్లిం మహిళలు చంద్రబాబు వద్ధకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ ముస్లింలకు తన హ యాంలో ఎన్నో సౌకర్యాలను కల్పించానని, ఇప్పుడు ప్రత్యేక రిజర్వేషన్ వల్ల మరింత న్యాయం జరుగుతుందని చెప్పారు.