March 9, 2013

బాబ్లీపై 'దేశం' మహాధర్నా సక్సెస్...


 ఆదిలాబాద్:బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో  చేపట్టిన మహాధర్నా కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ఆ పార్టీ నాయకులు, శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమానికి ముందుగా స్థానిక బైల్ బజార్ నుంచి కార్యక్రమ వేధిక అయిన ఆర్ అండ్‌బీ అతిథి గృ హం వరకు పార్టీ కార్యకర్తలు, రైతులు ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించా రు. స్థానిక ఆర్ అండ్‌బి అతిథి గృహం ముందు ధర్నా వేదిక ఏర్పాటు చేశా రు.

కార్యక్రమానికి పార్టీ అగ్ర నాయకు లు హాజరు కావాల్సి ఉండగా వారెవ రూ కూడా హాజరు కాలేదు. ఎంపి ర మేశ్ రాథోడ్, పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు ,బోథ్ ఎమ్మెల్యే నగేశ్, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్‌లు లోలం శ్యాంసుందర్, జుట్టు అశోక్‌లతోపాటు సీనియర్ నాయకులు భూషణ్‌రెడ్డి, రమదేవిలతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, నిర్మల్, ఖా నాపూర్, కడెం, ముథోల్ ప్రాంతాలకు చెందిన రైతులు హాజరయ్యారు. ధర్నానుద్దేశించి నేతలతో పాటు కార్యకర్తలు, రైతులు ఆవేశపూరితంగా చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా నే తలు బాబ్లీపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని, న్యాయపరమైన ఆధారాలను సమర్పించాలని డిమాండ్ చేశారు. అలాగే బా బ్లీ ప్రాజెక్టుతోపాటు మహారాష్ట్రలో గో దావరినదిపై అక్రమంగా నిర్మాణం చే పడుతున్న మరో 12 ప్రాజెక్టులను కూ డా అడ్డుకునేందుకుగాను అన్నీ పార్టీలతో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పా టు చేసి ప్రధాని మన్మోహన్‌సింగ్ ను క లిసి విన్నవించనున్నట్లు పేర్కొన్నారు. ధర్నా అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఆర్డీవో కార్యాలయం లో వినతి పత్రాన్ని సమర్పించారు.

జలదోపిడీని అడ్డుకుందాం

టీడీపీ ఎంపీ రాథోడ్ రమేష్


నిర్మల్: ఉత్తర తెలంగాణను ఎడారి గా మార్చే బాబ్లీ ప్రాజెక్టు సహా 14 అ క్రమ ప్రాజెక్టులను ఆపి మహారాష్ట్ర జ లదోపిడీని అడ్డుకుందామని ఎంపీ రా థోడ్ రమేష్, టీడీపీ నిజామాబాద్ జి ల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌ డ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నగేష్ రైతులకు పిలుపునిచ్చారు. బాబ్లీపై మ హారాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీ రు రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం నిర్మల్ పట్టణంలోని విశ్రాం తి భవనం ఎదుట జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో «ధర్నా నిర్వహించారు.

అనంతరం ఆర్డీవో కార్యాలయం ముట్టడించి వినతి పత్రాన్ని అందించారు. దీనికి ముందు రైతు బజార్ నుంచి ఆర్డీవో కా ర్యాలయం వరకు ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మా ట్లాడుతూ బాబ్లీకి పునాదులు వేసినప్పుడే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి దృష్టికి సమస్యను తీసుకవెళ్లినా పట్టించుకోలేదన్నారు. నిర్ధిష్టమైన వ్యూ హ ప్రణాళిక లేకుండా అప్పటి ప్రభు త్వం గుడ్డిగా వ్యవహరించిందని విమర్శించారు.

అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్, రాష్ట్ర మంత్రులుగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు బాబ్లీ నిర్మాణాన్ని అడ్డుకు నే కనీస ప్రయత్నం చేయలేదని విమర్శించారు. బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకో ర్టు ఎదుట మనరాష్ట్ర ప్రభుత్వం సరైన సాక్ష్యాలు చూపకపోవడం, వాదనలు వినిపించకపోవడం వల్లే సుప్రీంతీర్పు మహారాష్ట్రకు అనుకూలంగ వచ్చిందన్నారు. ఒక ప్రాజెక్టు గర్భంలో మరో ప్రాజెక్టును నిర్మించడం చరిత్రలో ఎక్క డా చూడలేదని విమర్శించారు.

ముంబాయి ప్రధాన కేంద్రంగా బాబ్లీపై ఏ ర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ వల్ల న్యా యం జరుగుతుందన్న విశ్వాసం తమ కు లేదన్నారు. టీడీపీ రైతుల కోసం చే స్తున్న ఒంటరి పోరును ప్రజలు గమనించాలన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రుణమాఫీ అమలుచేసి తీరుతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజ క వర్గ ఇన్‌చార్జి బాబర్, ముథోల్ ని యోజక వర్గ ఇన్‌చార్జి నారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, జిల్లా ప్ర ధాన కార్యదర్శి లోలం శ్యామ్‌సుందర్, మాఐ జడ్పీ చైర్మన్ జుట్టు అశోక్, జిల్లా అధికార ప్రతినిధి ఆకోజి కిషన్, రాష్ట్ర రైతు కార్యదర్శి భూషణ్‌రెడ్డి, పట్టణ అ ధ్యక్షుడు గండ్రత్ రమేష్, ఆయా మం డల పార్టీ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్‌లు తదితరులు పాల్గొన్నారు.