March 9, 2013

వస్తున్నా..'మీ కోసం'

తొలిరోజు పర్యటన ఇదీ,  : దుంపగడప అడ్డరోడ్డు, దుంపగడప, జూనియర్ కాలేజీ గ్రౌండ్ మీదుగా ఆకివీడు రైల్వేస్టేషన్ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి సిఎం మిషనరీ స్కూల్ మీదుగా అర్జమూరుగరువుకు రాత్రి చేరుకుని అక్కడే బసచేస్తారు.
ఏలూరు:తెలుగుదేశం అధినేత చంద్రబాబు 'వస్తున్నా.. మీకోసం' అంటూ పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం సాయంత్రం అడుగిడబోతున్నారు. ఇప్పటికే ఆయన గడిచిన 157 రోజులుగా ర్రాష్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల మీదుగా పాదయాత్ర చేస్తున్నారు. బీద, బిక్కి జనాలను అక్కున చేర్చుకుంటున్నారు. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. నేనున్నానంటూ వేలాది మందికి అండగా నిలుస్తూ.. ఆరోగ్యం సహకరించకపోయినా మండుటెండల్లోనే పాదయాత్ర కొనసాగిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నాటితో కృష్ణా జిల్లాలోపాదయాత్ర ముగించుకుని ఆ తర్వాత ఉప్పుటేరు మీదుగా పశ్చిమలో కాలిడనున్నారు.

చంద్రబాబుకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఆయన వెంట దండులా తరలివెళ్లేందుకు వేలాది మంది సన్నద్ధమవుతున్నారు. బాబుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఇప్పటికే వివిధ మండలాల నుంచి వందలాది మంది కార్యకర్తలు శుక్రవారం రాత్రే ఆకివీడుకు బయలుదేరారు. తమ ప్రియతమ నేత అడుగులో అడుగేసి నడిచేందుకు పార్టీలో యువతరం ఉత్సాహం వ్యక్తం చే స్తోంది. వీరి ఉత్సాహానికి తగ్గట్టుగానే పార్టీ సీనియర్లు, నియోజకవర్గాల నేత లు కూడా వీరినే అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు. శనివారం సాయం తం ఆకివీడు మండలం దుంపగడప అడ్డరోడ్డు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సుమారు 6.7 కిలోమీటర్ల మేర తొలిరోజు చంద్రబాబు ప్రయాణించనున్నారు. మార్గమధ్యలో దుంపగడప, ఆకివీడులలో ఆయన ప్రజలను పలకరించనున్నారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా ఇప్పటికే సాగుతున్న 'వస్తున్నా.. మీ కోసం' యాత్రం పశ్చిమలో కూడా ఆసాంతం విజయవంతమయ్యేలా, ప్రశాంతంగా ముగిసేలా సకల ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు రాక కోసం ఉండి నియోజకవర్గంలో ఆయన ప్రయాణించే మార్గాలన్నింటిలోనూ పసుపుదనాన్ని నింపుతూ స్వాగతానికి సన్నాహాలు చేశారు. ఇప్పటికే పగటి ఎండలు పెరిగాయి. మధ్యాహ్నం నాటికి దీనికి ఉక్కపోత తోడవుతోంది. అయినా ఖా తరు చేయకుండా ఉదయం వేళల్లో పా ర్టీ సమీక్షలు నిర్వహించడం, మధ్యా హ్నం 2 గంటల తర్వాత నుంచి నిర్దేశించిన మార్గంలో పాదయాత్రకు చం ద్రబాబు సంసిద్ధమయ్యారు.

ఒకవైపు ర్రాష్టంలో కీలక రాజకీయ పరిణామాలు జరుగుతున్న నేపధ్యంలో ఆయన క్షణం తీరిక లేకుండానే పార్టీ వ్యవహారాలను సమీక్షిస్తూనే ఇంకోవైపు సాధారణ ప్రజలను, కార్యకర్తలను కలుసుకోవడానికి ఎండను, తన ఆరోగ్యాన్ని కూడా ఖాతరు చేయకుండా ముందుకు సాగుతుండటంతో ఆయనకు చేదోడుగా నిలిచేందుకు పార్టీ యంత్రాంగం యావత్తు సిద్ధమైంది.

పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే శివరామరాజు, సీనియర్ నేత మాగంటి బాబు, పార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్, పార్టీ ముఖ్యులు గాదిరాజు బాబు వంటి వారు కూడా ఇప్పటికే ఏర్పాట్లలో మునిగి తేలారు. చంద్రబాబు పాదయాత్ర జిల్లాలో ఏకబిగిన ఏడురోజుల పాటు తణుకు వరకు సాగనుంది. వాస్తవానికి తణుకు నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ఏ వైపు నుంచే చేరుకోవాలనేదానిపై ర్రాష్ట పార్టీ నుంచి ఇంకా గ్రీన్‌సిగ్నల్ రాలేదు. అందుకనే ఇప్పటిదాకా ఆకివీడు నుంచి తణుకు వరకు 82.7 కిలోమీటర్ల నిడివిన ఆయన పాదయాత్రకు రంగం సిద్ధమైంది. ఆకివీడు, ఉండి, కాళ్ల, భీమవరం రూరల్, భీమవరం టౌన్, పాలకోడేరు, వీరవాసరం, పాలకొల్లు, పోడూరు, పెనుమంట్ర, పెనుగొండ, ఇరగవరం, తణుకు మండలాల పరిధిలోని నిర్దేశించిన ప్రాం తాల్లో చంద్రబాబు పాదయాత్ర సాగనుంది.

ఒక్క ఉండి నియోజకవర్గం మినహాయిస్తే ఆయన పర్యటించే ప్రాంతాలన్నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోనే ఎక్కువ భాగం ఉంది. దీనిని సవాల్‌గా తీసుకుని మరీ పార్టీ యంత్రాంగం అన్ని గ్రామాల్లో క్యాడర్‌ను ఇప్పటికే ఉత్తేజపరిచింది. శనివారం రాత్రి ఆయన అర్జమూరు వద్ద బసచేస్తారు. ఆదివారం శివరాత్రి కావడంతో ఉదయం పూట ఎలాంటి సమీక్షలు ఉండవు. ఆయన ర్రాష్ట పార్టీ వ్యవహారాలపైనే ఉదయం నుంచి మ ధ్యాహ్నం వరకు దృష్టి పెట్టనున్నారు.

ఆ తర్వాత యధావిధిగా శివరాత్రి అయినప్పటికీ మధ్యాహ్నం చెరుకువాడ నుంచి పాదయాత్రకు సంసిద్ధమవుతున్నారు.

ఈ నెల 13వ తేదీ నుంచి రోజుకు రెండు నియోజకవర్గాలు చొప్పున ఉదయం పూట పార్టీ సమీక్షకు చంద్రబాబు ఓకే చేశారు. నియోజకవర్గాల వారీగా ఆయన పార్టీ పనితీరును సమీక్షించనున్నారు. తొలిరోజు పశ్చిమలో కాలిడనున్న చంద్రబాబు ఆకివీడులోజరిగే బహిరంగసభలో తొలి ప్రసంగం చేయనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.