December 15, 2012

ఆదివాసీల అభివృద్ధికి కృషి,తండాలను పంచాయతీలుగా ఏర్పా టు

 ఆదివాసీల జిల్లా అయినా ఆదిలాబాద్‌ను అ న్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని టీడీపీ ఆధినేత నారాచంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జిల్లాలోని ఎక్బాల్‌పూ ర్, ఖానాపూర్ క్రాస్ రోడ్, ఖానాపూర్, సుల్జాపూర్, బాదనకుర్తి వరకు 15.7 కి. మీటర్లు శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ జిల్లాలో గోండు, కో లాం, ప్రధాన్, లంబాడ, నాయక్‌పోడ్ తదితర గిరిజనులు 20శాతం ఉన్నారని, వీరి అభివృద్ధికి చర్యలు చేపడుతామన్నారు. జిల్లాను యూనిట్‌గా తీసుకొని కార్యక్రమాలు చేపడుతామని చంద్రబాబు పేర్కొన్నారు. గిరిజనుల కు ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో 20శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా చర్యలు చేపడుతానన్నారు. 5వందల మంది గిరిజనులు ఉన్న గూడాలు, తండాలను పంచాయతీలుగా ఏర్పా టు చేస్తామని ఆయన చెప్పారు. గిరిజ న విద్యార్థులకు కేజీ, పీజీ వరకు ఉచిత విద్యతో పాటు రూ.లక్ష50వేలతో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.

భూమి లేని ఆదివాసీలకు రెండు ఎకరాల భూమి ఇస్తానని, గిరిజనుల ఆడ పిల్ల పెళ్లికి రూ.50వేలు ఇస్తామన్నారు. జనాభా ప్రతిపాదికన నామినేటెడ్ పదవులను ఇవ్వడంతో పాటు గిరిజనులకు ప్రత్యేక యూనివర్సిటీని ఏర్పాటు చేయిస్తానన్నారు. గిరిజన ఆలయాల్లో పూజలు చేసే పూజారులకు రూ. 5వేల వేతనాన్ని ఇప్పిస్తామన్నారు. అడవులను నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీలకు అటవీ సంపద పై హక్కు కలిపించేలా కృషి చేస్తానన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూముల కు పట్టాలు ఇప్పిస్తానని చెప్పారు. మైదాన ప్రాంతంలోని గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఐటీడీఏ ఏర్పాటు చేసి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

జిల్లాలోని గూడాలు, తండాల్లో నివసిస్తున్న గిరిజనులకు గోదావరి జలాల ను అందిస్తామన్నారు. కొమురంభీం పుట్టిన ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు. టీడీపీ పాలనలో గిరిజనుల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చే పట్టామన్నారు. అన్ని గ్రామాలకు కరెంట్ సౌకర్యంతో పాటు మండల కేం ద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ను ఏర్పాటు చేయించామని ఆయన చె ప్పారు. ప్ర«ధానంగా, విద్య, వైద్య, రోడ్లు ఇలాంటి సౌకర్యాలు కల్పించామన్నారు. టీడీపీ హయాంలోనే ఐటీడీఏలను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.ఆదిలాబాద్ జిల్లా వైశాల్యంలో పెద్దదని అందువల్ల మంచిర్యాలను జి ల్లా కేంద్రంగా ఏర్పాటు చేయిస్తానన్నా రు. జిల్లాలోని వ్యవసాయ ఆధార పరిశ్రమలను ఏర్పాటు చేసి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.

ఆదిలాబా ద్- అర్మూర్ రైల్వే లైన్ నిర్మాణానికి కృ షి చేస్తానన్నారు. నిర్మల్‌లో బీడీ కార్మికుల కోసం ఫీఎస్ కార్యాలయాన్ని, ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. 9 రోజుల పా దయాత్రలో జిల్లాలో తనకు ప్రజలు అపూర్వస్వాగతం పలికారని అన్నారు. తన పాదయాత్రకు వచ్చిన జనాన్ని చూస్తే తనకు ఎంతో సంతోషం కలిగిందని, ఆదిలాబాద్ జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉంది అనడంలో ఎలాంటి సం దేహం లేదన్నారు. టీడీపీని ఆదరించాలని, అధికారంలోకి వచ్చాక ప్రజల కష్టాలను తీరుస్తానన్నారు. సమావేశా ల్లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్, టీడీ పీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి నగేష్, టీడీపీ నాయకులు పాయల శంకర్, రితీష్‌రాథోడ్, యూనిస్ అక్బానీ, గిమ్మ సంతోష్, లోలం శ్యాంసుందర్, బాబ ర్, రాష్ట్ర పరిశీలకుడు అర్షపల్లిత వి ద్యాసాగర్, శ్రీశైలం, కోటేశ్వర్‌రావు, గణే ష్‌రెడ్డి, రాజిరెడ్డిలు, కడెం మాజీ ఎం పీపీ రాజేశ్వర్‌గౌడ్ పాల్గొన్నార

బహిరంగ సభకుతరలివచ్చిన జనం..ఖానాపూర్‌లో నిర్వహించిన చంద్రబాబు బహిరంగ సభకు వేలాది మంది తరలివచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ రా థోడ్ రమేశ్, ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్, రితీష్ రాథోడ్‌లు భారీ జన సమీకరణ చేశారు. ఖానాపూర్ క్రాస్ రోడ్డు నుంచి ఖానాపూర్ వరకు రోడ్డంత జనంతో కిక్కిరిసి పోయింది. చంద్రబాబు నా యకుడుకు గుస్సాడీ, లంబాడా నృ త్యాలతో, బణా సంచా పేల్చి ఘనంగా స్వాగతం పలికారు. సభకు పెద్ద ఎత్తున జనం రావడంతో ఖానాపూర్‌లోని ప్ర ధాన కూడళ్ల కిక్కిరిసిపోయాయి.

ం ముగిసిన పాదయాత్ర..ఆదిలాబాద్ జిల్లాలో 6నప్రారంభమైన చంద్రబాబు పాదయాత్ర శుక్రవా రం రాత్రి ముగిసింది. ఈ నెల 5న రా త్రి నిజామాబాద్ జిల్లా నుంచి చంద్రబాబు పాదయాత్ర బాసరకు చేరుకుం ది. జిల్లాలోని ముథోల్, నిర్మల్, ఖానాపూర్ నియోజక వర్గాల మీదుగా వందలాది గ్రామాల మీదుగా 9రోజుల పా టు పాదయాత్ర సాగింది.

9 రోజుల పా టు పాదయాత్ర చేపట్టిన చంద్రబాబు నాయుడుకు ఆదిలాబాద్ ఎంపీ రమేశ్ రాథోడ్, బోథ్ ఎమ్మెల్యే నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్‌ల ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలు ఘ నంగా స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు జిల్లాలో 146.5 కి లో మీటర్లు పాదయాత్ర నిర్వహించి క రీంనగర్ జిల్లా ఓబులాపురానికి శుక్రవారం రాత్రి చేరుకున్నారు. శనివారం నుంచి కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర నిర్వహించనున్నారు.