December 15, 2012

వస్తున్నా..మీ కోసం...

వస్తున్నా మీ కోసం...' పాదయాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ అ ధినేత నారా చంద్రబాబునాయుడు శుక్రవారం రాత్రి బాదనకుర్తి వంతెన మీదుగా ఆదిలాబాద్ నుంచి జిల్లాలో ప్రవేశించారు. ఓబులాపూర్ గ్రామం లో చంద్రబాబునాయుడుకు జిల్లా నేతలు ఘనంగా స్వాగతం పలికారు. 2011 డిసెంబర్ 27న రైతు పోరుబాటలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన చంద్రబాబునాయుడు సరిగ్గా ఏడాది తర్వాత మళ్ళీ జిల్లాకు వచ్చారు. గత సంవత్సరం డిసెంబర్‌లో చిగురుమామిడి నుంచి తిమ్మాపూర్ మండలం వరకు రైతన్నలకు మద్దతుగా పాదయాత్ర చేసిన చంద్రబాబు ఇప్పుడు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోని 96 గ్రామాల్లో 157 కిలోమీటర ్ల పాదయాత్ర నిర్వహించనున్నారు. పాదయాత్రలో భాగంగా జిల్లాలో పత్తిరైతులకు మద్దతుగా ఒకరోజు దీక్షను చేపట్టనున్నారు.

ఈ నెల 28న కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే స మక్షంలో జరగనున్న అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ అనుసరించనున్న విధానాన్ని ఖరారు చేసేందు కు ఈ నెల 23న బాబు బస చేసిన చోటనే పొలిట్‌బ్యూరో సమావేశం కూడా జరగనున్నది. శనివారం ఉద యం మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామం నుంచి పాదయాత్ర ప్రా రంభం కానున్నది. సంగెం శ్రీరాంపూర్ మీదుగా కొత్త దామ్‌రాజ్ పల్లె గ్రామానికి చేరుకొని గోదావరి నది ఒడ్డున ఉన్న ఆలయంలో నిర్వహిస్తున్న చండీ హవనంలో సతీమణి భువనేశ్వరి, కు మారుడు లోకేష్‌తో కలిసి పాల్గొంటా రు. మధ్యాహ్నం భోజన అనంతరం అక్కడ నుంచి పాతదామరాజ్‌పల్లి, మ ల్లాపూర్, గొర్రెపల్లి వరకు 16 కి.మీ. పాదయాత్ర కొనసాగిస్తారు.

మల్లాపూ ర్ మండల కేంద్రంలో బహిరంగ సభ లో చంద్రబాబునాయుడు ప్రసంగిస్తా రు. చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ వరకు 12 రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తారు. 15 నుంచి 18వ తేదీ వరకు చంద్రబాబునాయుడు పా దయాత్ర కార్యక్ర మ రూట్‌మ్యాప్‌ను ప్రకటించారు. పొలిట్‌బ్యూరో సమావేశం, రైతులకు మద్దతుగా దీక్ష ఏ తేదీ ల్లో ఎక్కడ నిర్వహించేది ఖరారైన తర్వాత మిగతా షెడ్యూల్‌ను ప్రకటిస్తారు.

జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా చంద్రబాబు పాదయాత్ర నిర్వహించేందుకు వీలుగా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. కోరుట్ల నియోజకవర్గంలో అడుగుపెట్టి జగిత్యాల, పెద్దపల్లి, చొప్పదండి, కరీంనగర్, హుజురాబాద్ సెగ్మెంట్ల మీదు గా పాదయాత్ర సాగనున్నది. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లో పాదయాత్రను విజయవంతం చేసేందుకు స్థాని క ఎమ్మెల్యేలు ఎల్. రమణ, విజయరమణారావు, సుద్దాల దేవయ్య, గం గుల కమలాకర్, కోరుట్లలో మాజీ ఎమ్మెల్యే శికారి విశ్వనాథం, హుజురాబాద్‌లో ముద్దసాని కశ్యప్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు.

సాఫీగా సాగేనా...?చంద్రబాబు పాదయాత్రను అడ్డుకోవాలని టీఆర్ఎస్ నేత హరీష్‌రావు పిలుపునివ్వడం, వర్గీకరణకు అనుకూలంగా టీడీపీ నిర్ణయాన్ని నిరసిస్తూ మాలమహానాడు పలుచోట్ల చంద్రబాబును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర సాఫీగా సాగేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఈ నెల 28న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుండటంతో టీడీపీ నిర్ణయం కీ లకం గా మారింది. దీంతో టీడీపీపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణవాదుల నుం చి పాదయాత్రకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. మరోవైపు నిరసనలు ఎదురైతే దీటుగా అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో చంద్రబాబు పాదయా త్ర నిర్వహణపై జిల్లాలో ఉత్కంఠ నెలకొన్నది.

భారీ బందోబస్తు ...చంద్రబాబునాయుడు పాదయా త్ర నేపథ్యంలో జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేపట్టారు. పాదయాత్రలో చంద్రబాబు వెంట బందోబస్తు బాధ్యతలను అదనపు ఎస్‌పీ జనార్ధన్‌రెడ్డికి అప్పగించారు. జగిత్యాల సబ్ డి విజన్ మీదుగా సాగే పాదయాత్ర సం దర్భంగా ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు జగిత్యాల ఎఎస్‌పీ రమారాజేశ్వరి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరి భద్రత క ల్పించింది. దీనితో పాటు జిల్లా పోలీ సు యంత్రాంగం నాలుగు అంచెల భద్రతను కల్పిస్తోంది.

ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులచే యాత్ర దారి పొడవునా బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. పాదయాత్ర వెంట ఎప్పుడూ నాలుగు రోప్ పార్టీ లు, మూడు రోడ్ ఓపెనింగ్ పార్టీలు, చంద్రబాబు రాత్రి బస వద్ద రెండు గార్డ్స్, దారి వెంట బాంబు డిస్పోజల్, డాగ్ స్వ్కాడ్ బృందాలను నియమించారు. సుమారు 500 మంది పోలీసులను చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు.