December 15, 2012

నీరా 'జనం'..............

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 'వస్తున్నా మీ కోసం...' పాదయాత్రకు జిల్లాలో ప్రజల నుంచి సానుకూల స్పందన లభించింది. బలీయంగా ఉన్న తెలంగాణవాదం, ఎస్‌సీల వర్గీకరణ అంశాలు పాదయాత్రలో బాబుకు ప్రతిబంధకంగా మారే అవకాశం లేకపోలేదనే అంచనాలు తలకిందులయ్యాయి. భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కదలిరాగా గ్రామీణ ప్రాం తాల మహిళలు చంద్రబాబుకు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు. దారిపొడవునా ఆయనతో కలిసి నడుస్తూ తొలి రోజు పాదయాత్రను విజయవంతం చేశా రు. బాదనకుర్తి వంతెన మీదుగా అదిలాబాద్ నుంచి కరీంనగర్ జిల్లాలో ప్రవేశించి న చంద్రబాబునాయుడు ఓబులాపూర్ గ్రామం నుంచి తన పాదయాత్రను శనివా రం ఉదయం ప్రారంభించారు.

తొలిరోజు ఓబులాపూర్, సంగెం శ్రీరాంపూర్, కొత్తదామరాజుపల్లి, పాతదామరాజుపల్లి, మ ల్లాపూర్, గొర్రెపల్లి గ్రామాలలో యాత్రను కొనసాగించి గొర్రెపల్లి, రేగుంట గ్రామాల మధ్య బస చేశారు. 16 కి.మీ. పొడవునా చంద్రబాబు పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. ఓగులాపూర్‌లో మహిళల స్వాగతాన్ని అందుకున్న చంద్రబాబునాయుడు వారిని ఉద్దేశించి ప్రసంగించి ముందుకు సాగగా ... సంగెం శ్రీరాంపూర్ గ్రామం త ర్వాత వికలాంగులను కలుసుకున్నారు. దారి పక్కన చెట్ల కింద కూర్చుని ఉన్న వికలాంగుల వద్దకు వెళ్ళి వారి సమస్యలు తె లుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే 18 అంశాలతో కూడిన వికలాంగుల పాలసీని అమలు చేస్తామని, వికలాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతామని హామి ఇచ్చారు. వికలాంగుల సమస్యలు తీరేంత వరకు టీడీపీ వారికి అండగా ఉండి పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.

తాను ప్రసంగించిన అన్ని గ్రామాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు గుండెధైర్యం నింపేందు కు ప్రయత్నించారు. తెలంగాణ ప్రాం తంలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో తె లుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృ ద్ధి జరిగిందని, తన హయాంలో ఈ ప్రాం తంలో చేసిన పనులను ఏకరువు పెట్టారు. పసుపు, చెరకు అధికంగా సాగు చేసే ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబునాయుడు ఆ రైతుల సమస్యలను తెలుసుకొని పసుపుకు 15 వేల రూపాయలు, చెరకుకు 3,500 రూపాయల ధర చెల్లించాల ని, పసుపు బోర్డును ఏర్పాటు చేసి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే వీటన్నింటినీ నెరవేర్చడంతో పాటు రైతులు తీసుకున్న అప్పులను రద్దు చేస్తామని, ఆ ఫైల్‌పైనే తొలి సంతకం చేస్తానని ప్రకటించి రైతుల మద్దతును కూడగట్టుకు నే ప్రయత్నం చేశారు.

జిల్లాలో ప్రధానమై న పత్తికి కనీస మద్దతు ధర లభించకపోవడంపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చే శారు. పత్తికి మద్దతు ధర లభించేలా చూ డాలని ప్రభుత్వానికి వారం రోజుల గ డువు ఇచ్చిన చంద్రబాబు లేని పక్షంలో జ మ్మికుంటలో ధర్నా చేసి ప్రభుత్వం అంతుతేలుస్తామని హెచ్చరించారు. పత్తికి ధర లభించకపోవడంపై చంద్రబాబు అంతకు ముందే జిల్లా నేతలతో చర్చించారు. ఇప్పటికే పత్తి రైతుల కోసం దీక్ష చేయాలని నిర్ణయించుకున్న చంద్రబాబు వారంలోగా ప్రభుత్వంలో చలనం లేకపోతే కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలోనే దీక్షకు పూనుకోవాలని నిర్ణయించారు. అలాగే మెట్‌పల్లి ప్రాంత భూములను సస్యశ్యామలం చేసే గంగనాల ప్రాజెక్టును నిర్మించేందుకు చ ర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.

ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. పావలా వడ్డీకే రుణాలు అని చెబుతున్న ఆచరణ లో మాత్రం ఐదు రూపాయల వరకు వసూలు చేస్తున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఇచ్చిన రుణాల్లోనూ లక్ష రూపాయల వరకు డిపాజిట్ చేసుకుంటున్నారని, టీడీపీ అధికారంలోకి వస్తేనే త మకు మేలు జరుగుతుందని మహిళలు చె ప్పగా చంద్రబాబు స్పందించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మహిళా సంఘా లు ఆర్థికంగా బలోపేతమయ్యాయని గు ర్తు చేశారు. అధికారంలోకి రాగానే మహిళలకు మరింత ప్రాధాన్యత కల్పిస్తామని హామి ఇచ్చి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే అదే ప్రాంతానికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చంద్రబాబును కలి సి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం వల్లే తనకు ఉ ద్యోగం లభించిందని, పూణేలో ఉద్యోగం చేస్తున్న తాను చంద్రబాబును కలిసేందు కే ఇక్కడకు వచ్చానని చెప్పగా పలువురు అతడిని అభినందించారు.

కొనసాగిన తెలం'గానం'...తెలంగాణ ప్రాంతంలో పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి చంద్రబాబు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ నెల 28న అఖిలపక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు మరోమారు తెలంగాణకు వ్యతిరేకం కాదని విస్పష్టంగా చెప్పారు. కేవలం తెలుగుదేశం పార్టీని బలహీనపరచడం కోసమే కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కు తంత్రాలు పన్నుతుందంటూ విరుచుకుపడిన చంద్రబాబు మరోవైపు టీఆర్ఎస్‌పై కూడా ధ్వజమెత్తారు. కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. ఖమ్మం జిల్లా బయ్యారం గనులను వైఎస్ తన అల్లుడికి అప్పగించేందుకు కుట్ర చేస్తే టీడీపీ అడ్డుకోగా ఆ సమయంలో కేసీఆర్ నోరు మెదపలేదంటూ విమర్శించారు. బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తాము ఉద్యమం నిర్వహిస్తే కేసీఆర్ కనీసం స్పందించకపోగా ఎ గతాళిగా మాట్లాడారని చంద్రబాబు మండిపడ్డారు. బీడీ కార్మికులకు కేంద్ర మంత్రిగా సాయం చేయాల్సి ఉండగా బీడీ కట్టలపై పుర్రె గుర్తును ముద్రించేలా చేశారంటూ కార్మికులను ఆకర్షించే ప్ర యత్నం చేశారు.

టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహంజిల్లాలో చంద్రబాబు తొలిరోజు పాదయాత్రకు అన్ని చోట్ల మంచి స్పందన ల భించింది. చంద్రబాబు ప్రసంగాలకు ప్ర జలు సానుకూలంగా స్పందించారు. రైతు లు, మహిళలు, వికలాంగుల సమస్యలను ప్రస్తావించిన చంద్రబాబు టీడీపీ అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. విద్యుత్ సమస్యను కూ డా చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించారు. సంస్కరణల ద్వారా విద్యుత్ సరఫరాను తాము మెరుగుపరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే వ్యవసాయ రంగానికి తొ మ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేస్తామంటూ రైతుల్లో భ రోసా నింపే ప్రయత్నం చేశారు.

16 కి. మీ. పాటు తొలిరోజు సాగిన పాదయాత్ర విజయవంతం కావడం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. ఏడాది తర్వాత చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తుండటంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టినా తెలంగాణవాదం నేపథ్యంలో ఏం జరుగుతుందోనని ఒకింత ఆందోళనతోనే ఉన్నా రు. అయితే ఊహించిన దాని కంటే అధికంగా చంద్రబాబు పాదయాత్రకు స్పం దన రావడంతో మిగిలిన రోజుల్లో యా త్రను మరింత విజయవంతం చేసేందుకు జిల్లా నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.