January 15, 2013

రానున్న కాలం టీడీపీదే-పుత్తా


రానున్న కాలం తేదేపానేని నాయకులు, కార్యకర్తలు కలిసి పని చేయాలని అపార్టీ కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుత్తా నరసింహారెడ్డి అన్నారు. స్థానిక తేదేపా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక గ్రామమే కాకుండా నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజ లు కలిసి పని చేయాలన్నారు. ఎమ్మెల్యేగా లేకున్నా పంచాయితీ స్థాయి నుంచి అభివృద్ధి పనులకు కృషి చేస్తున్నాని అన్నారు. 98 పంచాయితీలకు నియోజకవర్గానికి రూ.5లక్షల చొప్పున రోడ్ల కోసం ఖర్చు చేశామన్నారు. పాదయాత్ర సందర్బంగా పలు గ్రామాలలో ప్రజలు వీధి లైట్లను తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. అన్ని గ్రామాలకు వీధి లైట్లను త్వరలో ఏర్పాటు చేయిస్తున్నానని తెలిపారు. అవసరమున్న చోట రోడ్లు వేయకుండా కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే పనులను చేపడుతున్నారన్నారు. నిత్య రద్దీగా ఉన్న కడప, కమలాపురం రోడ్డును నాలుగులైన్ల రోడ్డుగా విస్తారించాలని అధికారులకు తెలిపామన్నారు.

పట్టణంలో రైల్వే ప్లైఓవర్ బ్రిడ్జ్‌కి సంబంధించి కూడా అధికారులపై ఒత్తిడి తెస్తున్నానన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే డ్వాక్రా రుణాలు, రైతుల పంట రుణాలన్నీంటినీ మాఫి చేస్తారని తెలిపారురు. మార్చి తరువాత ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చున్నారు. అందుకు అందరూ సిద్ధం కావాలన్నారు.సంక్రాంతి శుభాకాంక్షలు : నియోజకవర్గ ప్రజలకు పుత్తా సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు. ప్రజలు ఎన్నో కష్టాలకోర్చి పండించిన పంట చేతికి వచ్చిన తరువాత జరుపుకునే పండుగ సంక్రాంతి అన్నారు. అందురూ సుఖసంతోషాలతో జరుపుకోవాలన్నారు.

వైకాపా, కాంగ్రెస్ శ్రేణులు తేదేపాలోకి చేరిక కమలాపురం : నియోజకవ్గరంలోని వల్లూరు మండలానికి చెందిన వైకాపా,కాంగ్రెస్ శ్రేణులు తేదేపాలోకి ఆదివారం పుత్తా సమక్షంలో చేరారు. వల్లూరు మండలంలోని కొప్పోలి, గొల్లఓబాయపల్లె, బోరెడ్డిపల్లె, పుత్తాచిన్నాయపల్లె, దళితవాడలకు చెందిన సుమారు రెండు వందల కుటుంబాలు తేదేపా తీర్థం పుచ్చుకున్నాయి. వీరికి నియోజకవర్గ ఇన్‌చార్జ్ స్వయంగా పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విభేదాలను పక్కనపెట్టి పార్టీ ఉన్నతికి కృషి చేయాలన్నారు. కార్యకర్తలకు ఏసమస్య వచ్చినా అండగా ఉంటానన్నారు. వైకాపా వల్లూరు మండల నాయకుడు పి.సుబ్బారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు జె.సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో పుత్తాకు తమ సంపుర్ణ మద్దతు నిస్తామన్నారు.

పార్టీలో చేరిన వారిలో శేఖర్ రెడ్డి, కొప్పోలు మాజీ సర్పంచ్ నరసయ్య, కె.ఓబుల్‌రెడ్డి, పుల్లారెడ్డి, నందకిషోర్‌రెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, జయరామిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈకార్యక్రమంలో తేదేపా నాయకులు దివాకర్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, వాసుదేవరెడ్డి, గండి నారాయణ, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.