January 15, 2013

టీడీపీ హయాంలోనే ముస్లింల అభివృద్ధి



'ముస్ల్లింల సంక్షేమం, వికాసం కోసం పాటుపడిం ది ఒక్క టీడీపీనే. మతసామరస్యాన్ని కాపాడింది చంద్రబాబే. ముస్లింలకు అండగా నిలిచింది తెలుగుదేశమే' అ ని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. అ లాంటి పార్టీకి ముస్లింలందరూ అండ గా నిలవాలని వారు కోరారు. కాంగ్రె స్ పార్టీ ఓటుబ్యాంకు రాజకీయాలతో లబ్ధిపొంది మైనార్టీలను దగా చేసిందన్నారు. వైఎస్సార్ అధికారంలో ఉన్నపుడు మైనార్టీలను అణగదొక్కారన్నా రు.

ఒక ముఖ్యమంత్రిని దించేందుకు రాజధానిలో మతకలహాలు లేపి ము స్లింలను ఊచకోత కోయించిన ఘన వైఎస్‌దేనని మండిపడ్డారు. గతంలో ముస్లింల సంక్షేమంకోసం తెలుగుదేశం చేసిన అభివృద్ధి, రాబోయే కాలంలో చేసే అభివృద్ధి గురించి వారు వివరించారు. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలోని లలితకళాపరిషత్‌లో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హిందూపురం ఎమ్మెల్యే అ బ్దుల్‌ఘని అధ్యక్షత వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశ సభ లో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాల్‌జాన్‌బాషా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ముస్లింల కోసం ఎంతో పాటుపడిందన్నారు.

30 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఓటుబ్యాంకుగా ఉపయోగించుకుని నట్టేట ముంచిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్ల్లిం వర్గాల ఆర్థికాభివృద్ధి కోసం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించి ఆదుకుందన్నారు. వివిధ పథకాలు ప్ర వేశపెట్టి రుణాలు మంజూరు చేయడంతోపాటు విద్య, వైద్య సౌకర్యాలనూ క ల్పించిందన్నారు. భవిష్యత్తులో కూ డా మరిన్ని కార్యక్రమాలు చేపడతామ న్నారు. ఇందుకోసం ముస్లిం ఎంపవర్‌మెంట్ పాలసీని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టారన్నారు. దీని ద్వారా ముస్లింలను ఆర్థికంగా, వి ద్య పరంగా, రాజకీయంగా, మతపరంగా ఇలా అన్ని రంగాల్లోనూ ఆదుకోడానికి తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోందన్నారు.