January 15, 2013

విద్యుత్ చార్జీల పెంపుపై టీడీపీ వినూత్న నిరసన కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సబ్ స్టేషన్ వద్ద భోగి మంట





రాష్ట్రప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ హనుమాన్ జంక్షన్ విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద భోగిమంటలు వేసి టీడీపీ నేతలు వినూత్న నిరసన తెలియజేశారు.కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు హనుమాన్ జంక్షన్ విద్యుత్‌సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని, సర్‌చార్జీ పూర్తిగా ఎత్తివేయాలని నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ నేత లు భోగి మంటలు వేసి అందులో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను పడేసి దహనం చేశారు. భోగిమంటల్లో విద్యుత్ మంటలు చెలరేగుతున్నాయని, విద్యుత్ చార్జీల విషయంలో దిగిరాకపోతే ప్రభుత్వ పతనం తప్పదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ మహిళా కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనటం విశేషం.కృష్ణా జిల్లా తెలుగురైతు నేత చలసాని మాట్లాడు తూ 13 వేల కోట్ల భారాన్ని సామాన్య ప్రజలపై మోపాలని చూస్తున్న రాష్ట్రప్రభుత్వం ఆ భారాన్ని తానే మోయాలని డిమాండ్ చేశారు.పేదవర్గాల పై పెనుభారం మోపే పరిస్థితి కల్పించటం ప్రభుత్వానికి తగదని చలసాని అన్నారు. కరెంటు బిల్లులు కట్టకుండా ప్రభుత్వం పై పోరాడాలని చలసాని పిలుపు నిచ్చారు. టీడీపీ నేతలు కలపా ల జగన్‌మోహన్‌రావు, శివయ్య, చల్లపల్లి జగదీష్, చొదిమెళ్ళ ఏసుపాదం, మజ్జిగ నాగరాజు, కొతనం చిన్ని, నిమ్మకూరి మేరిమ్మ తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్ జంక్షన్ : రాష్ట్రప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ హనుమాన్ జంక్షన్ విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద భోగిమంటలు వేసి టీడీపీ నేతలు వినూత్న నిరసన తెలియజేశారు. జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు హనుమాన్ జంక్షన్ విద్యుత్‌సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని, సర్‌చార్జీ పూర్తిగా ఎత్తివేయాలని నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ నేత లు భోగి మంటలు వేసి అందులో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను పడేసి దహనం చేశారు. భోగిమంటల్లో విద్యుత్ మంటలు చెలరేగుతున్నాయని, విద్యుత్ చార్జీల విషయంలో దిగిరాకపోతే ప్రభుత్వ పతనం తప్పదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ మహిళా కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనటం విశేషం. కృష్ణా జిల్లా తెలుగురైతు నేత చలసాని మాట్లాడు తూ 13 వేల కోట్ల భారాన్ని సామాన్య ప్రజలపై మోపాలని చూస్తున్న రాష్ట్రప్రభుత్వం ఆ భారాన్ని తానే మోయాలని డిమాండ్ చేశారు.పేదవర్గాల పై పెనుభారం మోపే పరిస్థితి కల్పించటం ప్రభుత్వానికి తగదని చలసాని అన్నారు. కరెంటు బిల్లులు కట్టకుండా ప్రభుత్వం పై పోరాడాలని చలసాని పిలుపు నిచ్చారు. టీడీపీ నేతలు కలపా ల జగన్‌మోహన్‌రావు, శివయ్య, చల్లపల్లి జగదీష్, చొదిమెళ్ళ ఏసుపాదం, మజ్జిగ నాగరాజు, కొతనం చిన్ని, నిమ్మకూరి మేరిమ్మ తదితరులు పాల్గొన్నారు.