January 15, 2013

17 నుంచి 21 వరకు నల్లగొండ జిల్లాలో బాబుయాత్ర



తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా... మీ కోసం పాదయాత్ర 17వ తేదీ ఉదయం నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించి 18,19, 20,21 ఐదురోజుల పాటు పాదయా త్ర కొనసాగుతుందని టీడీపీ నల్లగొండ జిల్లా అ ధ్యక్షుడు బీల్యానాయక్, కోదాడ ఎమ్మె ల్యే వేనేపల్లి చందర్‌రావు తెలిపారు. చందర్‌రావు నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పర్యటన వివరాలను వెల్లడించారు. 16 రాత్రికి ఖమ్మం జిల్లా పై నంపల్లి బ్రిడ్జివద్దకు పాదయాత్ర చేరుకుని పైనంపల్లి వద్ద బస చేస్తారు.

17 ఉదయం ఖమ్మం జిల్లాలోనే 3కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగి 10 గంటల సమయంలో నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించి పాదయాత్ర శాంతినగ ర్ మీదుగా ప్రారంభమవుతుంది. మొ దటిరోజు శాంతినగర్, మొగలాయి కో ట,అనంతగిరి, అనురాగ్ కళాశాల, ఖా నాపురం నుంచి 10కిలోమీటర్ల పాదయాత్రతో కోదాడ సమీపంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకుని రా త్రి అక్కడ బస చేస్తారు.

18వ తేదీ ఉదయం కోదాడకు చే రుకుని మేకల అభినవ్ రోడ్ మీదుగా సబ్‌స్టేషన్ నుంచి ఖమ్మం క్రాస్‌రోడ్‌లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

అదేరోజు ఎన్టీఆర్ వర్ధంతి కావడంతో ఆయన అక్కడే నివాళులర్పి ంచి సంతాపసభ ని ర్వహిస్తారు. అనంతరం పట్టణంలో నాగార్జున సెంటర్ మీదుగా హరిజన వాడ నుంచి వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వరకు చేరుకుని అక్కడి నుంచి బాలాజీనగర్, చిలుకూరు, దూదియాతండా వరకు యాత్ర కొనసాగుతుంది. రాత్రి చిలుకూరు మండలంలోని దూదియాతం డా- సీతల్‌తండాల మధ్య 16 కిలోమీ టర్లు పూర్తి చేసి బస చేస్తారు.

19వ తేదీ ఉదయం సీతారామపురం, నారాయణపురం మీదుగా కో దాడ మండలంలోని భీక్యాతండా, రా మలక్ష్మిపురం, గణపవరం, తొగర్రాయి స్టేజీల మీదుగా గుడిబండకు చేరుకుని అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిం చి వెనుతిరిగి కాపుగల్లు క్రాస్‌రోడ్డు వర కు 16కి.మీ. పూర్తి చేసి బస చేస్తారు.

20వ తేదీ ఉదయం క్రాస్‌రోడ్డు నుంచి కాపుగల్లుకు చేరుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఎన్టీఆర్ సృజల శ్రవంతి రక్షిత మంచినీటి పథ కం, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా రు. అనంతరం రెడ్లకుంట, నల్లబండగూడెం మధ్య 8కిలోమీటర్లు పాదయా త్ర పూర్తి చేసి అక్కడే ఉన్న రిక్విన్ పరిశ్రమ వద్ద బస చేస్తారు.

21వ తేదీ సోమవారం ఉదయం గరికపాడు బ్రిడ్జి వరకు సాగి కృష్ణా జి ల్లాలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది.

చద్రబాబు పాదయాత్ర నల్లగొండ జిల్లా మొ త్తంమీద కోదాడ నియోజకవర్గంలోని రెండు మండలాలకే పరిమితమై కృష్ణా జిల్లాకు చేరుకుంటుంది.

మొత్తం 5రోజుల పర్యటనలో 2 మ ండలాల్లో 22 గ్రామాలతో పాటు మరో 3 శివారు గ్రామాలతో 50కి.మీ. పాదయాత్ర కొనసాగుతుందని బీల్యానాయక్, వేనేపల్లి తెలిపారు. ఈ పర్యటన పూర్తిగా సమాలోచనలు జరిపి పార్టీ రాష్ట్ర నాయకత్వ అనుమతితో ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ రూట్‌మ్యాప్ ను పాదయాత్ర ఆర్గనైజర్, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కమ్మంపాటి రామ్మోహన్‌రావు, మొద్దులూరి వెంకటేశ్వరరా వు  పరిశీలించి ఖరారు చేసిన ట్లు వారు తెలిపారు. సమావేశంలో టీ డీపీ నల్లగొండ జిల్లా నాయకులు ఐలయ్యయాద వ్, పార సీతయ్య, తొండపు భాస్కర్‌రా వు, ఓరుగంటి ప్రభాకర్, బొల్లం మల్లయ్యయాదవ్, అజేయ్‌కుమార్, అచ్చ య్య, ఆదినారాయణ, కృష్ణయ్య, బ్ర హ్మం, సైదానాయక్ పాల్గొన్నారు.



చంద్రబాబు నిర్వహించనున్న వ స్తున్నా....మీకోసం పాదయాత్ర రూట్ ను పాదయాత్ర ఆర్గనైజర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామ్మోహన్‌రావు, మొద్దులూరి వెంకటేశ్వరరా వు, టీడీపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్, ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు లు శనివారం పరిశీలించారు. శాంతినగర్ నుంచి అనంతగిరి, ఖానాపురం, కోదాడ, చిలుకూరు మండలంలోని ఆ యా గ్రామాల రహదారులను వారు ఈ సందర్భంగా పరిశీలించి రూట్‌మ్యాప్‌ను రూపొందించారు.