January 24, 2013

రైతు సమస్యలు తెలుసుకుంటూ...

పాదయాత్ర పూర్తిగా రైతు సమస్యలపై దృష్టి సారించారు. చిల్లకల్లు నుంచి మక్కపేట వరకూ మార్గ మ«ధ్యంలో పలు చోట్ల రైతులు బాబును పొలాల్లోకి తీసుకుని వెళ్లి పంటల పరిస్థితిని వివరించారు. చిల్లకల్లు, మక్కపేట గ్రామాల మధ్య చుక్క నీరు లేక ఎండిపోయి ఉన్న ఎన్ఎస్సీ కాల్వను గమనించారు. నాయకులు, కార్యకర్తలతో కలసి కాల్వలోపలికి దిగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నాగార్జున సాగర్‌లో నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బందుకలు గురిచేస్తుంన్నారు. చేతగాని సీఎం వల్లే రైతులకు కష్టకాలం వచ్చిందని ఆరోపించారు. పక్కనే ఉన్న పత్తి, మిర్చి పంట పొలాలలోకి వెళ్లి పంటలను పరిశీలించారు. పార పట్టుకుని పంట కాల్వలను చెక్కారు. కొందరు మహిళలు చంద్రబాబు చేతులు పట్టుకుని రోదిస్తూ సమస్యలను ఏకరువు పెట్టారు. పాదయాత్ర సమయంలో కళాశాల విద్యార్థినులతో సమస్యలు తెలుసుకుంటూ వారితో కలసి పాదయాత్ర కొనసాగించారు.

అనంతరం మక్కపేటలో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సారా తయారి, బెల్టుషాపులు, విద్యుత్ సర్‌చార్జీలు, నిత్యావసర ధరలపై ప్రభుత్వాన్ని ఎండగట్టారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ నాయకుల మాయమాటలకు లొంగిపోకుండా కార్యకర్తలు, అభిమానులు సైనికుల వలే పనిచేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా తాను నిలబడతానని హామీ ఇచ్చారు.

సమస్యలపై రైతులు ఏకరువు మొక్కజొన్న, పత్తి, మిర్చి పరిశీలించారు. సాగు వ్యయం పెరిగిందని, గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నామని రైతులు వివరించారు. టీడీపీ ప్రభుత్వ హాయాంలో పది వేల రూపాయలు ఉన్న మిర్చి ధర, ప్రస్తుతం నాలుగు వేలకు పడిపోయిందని, పత్తి, మొక్కజొన్న, ధాన్యం ధరలు కూడా దారుణంగా పడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సాగు కష్టమేనని రైలులు నిట్టూర్చారు.

విద్యుత్ సరఫరా కూడా సకాలంలో అధికారులుఅందించలేక పోతున్నారన్నారు. సమస్యలను శ్రద్ధగా విన్న చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుత పాలకులకు ఏరంగంలోనూ సరైన అవగాహన లేదని విమర్శించారు. అధికారంలోకి రాగానే రైతులను కాపాడేందుకు రుణమాఫీపైనే తొలి సంతకం చేస్తా. నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తానన్నారు. అన్ని రకాల పంటలకూ గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

మక్కపేటలో ఘన స్వాగతం వస్తున్నా- మీకోసం యాత్రలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం మక్కపేట చేరుకున్న చంద్రబాబు ఘన స్వాగతం లభించింది. మహిళలు, యువకులు పెద్దయెత్తున ఎదురేగి గ్రామంలోని తీసుకువచ్చారు. బాణసంచా, డప్పువాయిద్యాల నడుమ బాబు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. రోడ్లన్నీ జన సంద్రంగా మారాయి. అర కిలోమీటరు దూరం నడిచేందుకు సుమారు అరగంట సమయం పట్టింది. బాబును చూసేందుకు మహిళలు, యువకులు భవనాలు, చెట్లపైకి ఎక్కారు. అడుగడుగునా మహిళలు హారతులిచ్చారు.

జనాన్ని చూసి బాబు ఒకింత ఆనందంగా కనిపించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుయువత అధ్యక్షులు మల్లెల శివప్రసాద్, నాయకులు మల్లెల గాంధీ, తొండపు జగన్మోహనరావు, మండల పార్టీ అధ్యక్షులు జొన్నలగడ్డ రాధాకృష్ణమూర్తి, జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్లమూడి రాంబాబు, నీటి సంఘం అధ్యక్షులు పెద్ది రామారావు, ఆవుల రామారావు, పెంట్యాల శ్రీనివాసరావు, కట్టా కోటయ్య, సత్తి బేతవోలు పాల్గొన్నారు.

మల్లెల గాంధీ, మల్లెల శివలకు కితాబు... చంద్రబాబుకు అపూర్వ స్వాగతం లభించడంతో గ్రామ పార్టీ నాయకులు మల్లెల గాంధీ, మల్లెల శివలను ఆయన అభినందించారు. గ్రామాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకుని అభవృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఏడు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైన తెలుగుదేశం నాయకులు మారెళ్ల సీతారామిరెడ్డి భార్య లలిత, కుటుంబ సభ్యులు చంద్రబాబును కలిసి పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానన్నారు.

తారాజువ్వ పడి వరిగడ్డివాము దగ్థం.. మీ కోసం వస్తున్నా చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా మక్కపేట లో భారీస్థాయిలో బాణసంచా కాల్చా రు. తారాజువ్వా ఒకటి మల్లెబోయిన సత్యనారాయణ వరిగడ్డివాముపై పడి కొంతవరకు దగ్ధమైంది. కార్యకర్తలు వెంటనే మంటలను అదుపు చేశారు.