December 13, 2012

ఏం కొనేటట్లు లేదు... ఏం తినేటట్లు లేదు

ఆదిలాబాద్ : కాంగ్రెస్ సర్కార్ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటడం తో పేదలు ఏమి కొనేటట్టు లేదనీ, ఏమీ తినేటట్టు లేదనీ, కాంగ్రెస్ సర్కార్‌ను బంగాళాఖాతంలో కలపాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని ని ర్మల్ నియోజక వర్గంలోని కొత్త వెల్మ ల్, వెల్మల్ బొప్పారం, పీచర, ధర్మా రం, మల్లాపూర్, లక్ష్మణచాంద, తెరిపెల్లి, గాంధీచౌక్ వరకు బుధవారం 14.9 కిలో మీటర్లు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడుతూ ఉప్పు, పప్పు, చింతపండు, చక్కెరలాంటి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయనీ, దాం తో ప్రజలు అర్ధాకలితో అలమటించిపోతున్నారని ఆయన అన్నారు.

నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యావసర సరుకుల ధరలను అదుపులోకి తెస్తామన్నారు. టీడీపీ పాలనలో తులం రూ. 5 వేలు ఉన్న బంగారం ఇప్పుడు రూ. 35 వేలు దాటిందని, ఆడ బిడ్డ పెళ్లికి బంగారు మంగళ సూత్రం కూడా చేయించలేని పరిస్థితి ఏర్పడిందనీ, కాంగ్రెస్ నాయకులు మాత్రం రాష్ట్రాన్ని దోచుకుని బంగారం కంచం, మంచం, కుర్చీలు ఏర్పాటు చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.

గతంలో ఎన్టీ రామారావు, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాను ఆదర్శ జిల్లాగా ప్రకటించి ప్రత్యేక శ్రద్ధ చూపి విద్య, వైద్య, రోడ్లు తదితర అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పలు సంక్షేమ పథకాలను అమలు చేశామని ఆయన తెలిపారు. గిరిజన విద్యార్థుల కోసం అనేక పాఠశాలలు, కళాశాలలు, ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయించి విద్యనందించామన్నారు. జిల్లాలో పర్యాటక కేంద్రం ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాననీ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ పర్యాటక కేంద్రాలన్నీ వెలవెలబోతున్నాయని ఆ యన అన్నారు.

జిల్లాలోని వందిలాది గ్రామాల ప్రజానీకం తాగునీటి కోసం తల్లాడిల్లిపోతుందని, ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు అన్ని గ్రామాలకు గోదావరి జలాలను అందిస్తానన్నారు. పాదయాత్రలో అనేక గ్రామాలను సందర్శించినప్పుడు ఆయా గ్రామాల ప్రజలు తాగునీటి కోసం ఎదుర్కొంటున్న కష్టాలను చూశానని, గ్రామీణ ప్రజలందరికి గోదావరి జలాలను అందించి తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. జిల్లాలోని రైతు లు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తానన్నారు. జిల్లాలో విద్యుత్ కోత అధికంగా ఉండడం వల్ల పంటల దిగుబడులు తగ్గిపోయాయన్నారు. విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైన ప్రభుత్వం సర్‌చార్జీల పేరిట అధిక బిల్లులు వేస్తోందనీ, రెండు బుగ్గలు ఉన్న ఇంటికి రూ. 500 బిల్లు వేస్తుందని ఆయన విమర్శించారు.

విద్యుత్ సరఫరా చేయలేని ప్రభుత్వం అధిక బిల్లులు మాత్రం వసూలు చేస్తోందనీ, తాను గతంలో చెప్పినట్లుగానే విద్యుత్ తీగలపై బట్టలు ఆరవేసుకునే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నా రు. జిల్లాలోని రైతాంగం వేసిన పంటలకు పెట్టుబడి అధికమై, దిగుబడి తగ్గి కనీస మద్దతు ధర లభించక పోవడం తో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల ధరలను తగ్గించడం తో పాటు పంటలకు గిట్టుధర చెల్లిస్తామని, రైతులు తీసుకున్న అన్నిరుణాలను మాఫీ చేస్తామని ఆయన చెప్పా రు. జిల్లాలో లక్షలాది మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారని, వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ, గల్ఫ్ బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక మం త్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తానని ఆయ న చెప్పారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కిం ద భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి ఇప్పటి వరకు నష్టపరిహారం, ఉద్యోగా లు రాలేదనీ, వారికి నష్టపరిహారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. టీఆర్ఎస్ తిరకాసు పార్టీ అని, ఆ పార్టీ అధినేత ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఆరు నెలలు ఫాం హౌజ్‌లో పడుకొని తరువాత మభ్యపెట్టే ప్రకటనలు చేస్తూ పబ్బం గడుపుకుంటాడనీ, అలాంటి వ్యక్తి చెప్పే మాటలు నమ్మవద్దని కోరారు. బాబ్లీ ప్రాజెక్టు కట్టినా తెలంగాణలో కరువుతో ప్రజలు అల్లాడుతున్నా ఏరోజు వారి సమస్యలపై ఆయన పోరాడలేదనీ, ప్రజల సమస్యలపై టీడీపీ నిత్యం పో రాటాలు చేస్తూ వారికి అండగా నిలుస్తోందన్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు, మాయమాటలకు లొంగిపోవద్దనీ, పేద ప్రజల పార్టీ అయిన టీడీపీని ఆదరించాలని, టీడీపీని గెలిపిస్తే పేదల కష్టాలు తొలగిపోతాయన్నారు.

సామాజిక తెలంగాణ పేరుతో పార్టీ పెట్టిన చిరంజీవి మంత్రి పదవి కోసం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాడనీ, పిల్ల కాంగ్రెస్ అయిన వైఎస్సార్ సీపీ తల్లి కాంగ్రెస్ అయిన కాంగ్రెస్ పార్టీలో కలవడం ఖాయమన్నారు. తెలంగాణకు టీడీపీ గతంలో, ప్రస్తుతం, భవిష్యత్‌లో వ్యతిరేకం కాదన్నారు. ఈ సమావేశాల్లో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యు లు, ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ ఎమ్మెల్యే నగేష్, టీడీపీ సీనియర్ నాయకులు పా యల శంకర్, లోలం శ్యామ్ సుందర్, బాబర్, యూనిస్ అక్బానీ, నారాయణరెడ్డి, జుట్టు అశోక్, రమాదేవి, ఆదిలాబాద్ నియోజక వర్గం నాయకుడు గణే ష్‌రెడ్డి, గిమ్మ సంతోష్, అల్లూరి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాబుకు ఘనస్వాగతం: చంద్రబాబునాయుడుకు బుధవారం ఘన స్వాగతం లభించింది. పాదయాత్రలో భాగంగా నిర్మల్ ని యోజక వర్గంలోని కొత్త వెల్మల్, వెల్మ ల్ బొప్పారం, పీచర, ధర్మారం, మల్లాపూర్, లక్ష్మణచాంద, తెరిపెల్లి, గాంధీచౌక్ వరకు బుధవారం 14.9 కిలో మీ టర్లు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల ప్రజలు డప్పు చప్పుళ్లతో, మేళ వాయిద్యాలతో, మంగళ హారతులతో ఘనంగా స్వాగ తం పలికారు. ప్రజలు చంద్రబాబునాయుడికి పూలమాలలు వేసి సమస్యలను విన్నవించారు. కాంగ్రెస్ పాలన లో అభివృద్ధి జరుగకపోగా, పాత పనులకు కూడా మరమ్మత్తులు చేయడం లేదని బాబుకు విన్నవించారు.