December 13, 2012

కేసీఆర్ ఫాంహైజ్‌లో నిద్రపోతున్నారు

(నిర్మల్/మామడ/నిర్మల్అర్బన్/సారంగపూర్/ఖానాపూర్/కడెం): టీ ఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఫాంహౌస్‌లో కుంభ కరుణుడిలా నిద్రపోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం పాదయాత్రలో భాగంగా మామడ మండలం కోర్టికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రైతుల బాధలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని, వారి స మస్యలను పరిష్కారించడానికి పసుపు బోర్డ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. టీఆర్ఎస్, వైఎస్సాఆర్‌సీపీలు అవినీతి సొమ్ముతో టీవీ ఛానల్‌లు, దినపత్రిక లు స్థాపించి ప్రజలను మభ్యపెడుతూ తమ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.

గల్ఫ్ బాధితుల సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. వీరి సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రుణా మాఫీని ఎలా మాఫీ చేస్తారని యువకుడు ప్రశ్నించగా. అమెరికా తరహాలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని, అమెరికాలో 40సంవత్సరాల పై బడ్డ వారికి ప్రభుత్వమే పింఛన్ సౌకర్యం కల్పించి అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు.

ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చరర్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యం ఇచ్చి, గ్యాస్ కనెక్షన్ పేరుతో రూ.100 తీసుకుంటుందన్నారు. తెలంగాణ కోసం తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. రైతులకు సబ్సిడీ పై రుణాలు ఇచ్చి యువతకు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నా రు. అవినీతిని అంతమొందించనప్పు డే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో మొండిఎద్దు పరిపాలన కొనసాగుతుందని, కిరణ్‌కుమార్‌రెడ్డి కిరికిరి ముఖ్యమంత్రి అని చంద్రబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ రాథోడ్‌రమేష్, పార్టీ జిల్లా అధ్యక్షుడు గెడం నగేష్, జిల్లా ప్రధాన కార్యదర్శు లు లోలం శ్యాంసుందర్, అబ్దుల్‌క లాం, నిర్మల్ నియోజక వర్గ ఇన్‌చార్జి బాబర్, తెలుగు రాష్ట్ర కార్యదర్శి భూషణ్‌రెడ్డి, నాయకులు కిషన్, రమేష్, కోర్టికల్ గంగారెడ్డి పాల్గొన్నారు.

గ్రామస్థుల బ్రహ్మరథం: పాదయాత్రలో భాగంగా కోర్టికల్ గ్రామానికి వచ్చిన టీడీపీ అధినేత చం ద్రబాబు నాయుడికి గ్రామస్థులు బ్రహ్మరథం పట్టారు. ఊరి పొలిమేర నుంచి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలకడంతో పాటు బంతిపూలు చల్లి రోడ్డు పై నడిపించారు.