December 13, 2012

మీ పెద్ద బిడ్డగా ఆశీర్వదించండి:చంద్రబాబు

నిర్మల్/నిర్మల్ అర్బన్/సారంగాపూర్/మామడ/లక్ష్మణచాంద/ఖానాపూర్: మీకోసం.. మీ కష్టాలు తీర్చేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నానని, ఇంటి పెద్ద బిడ్డగా ఆశీర్వదిస్తే కష్టాలు తీరుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. లక్ష్మణచాంద మండలం న్యూవెల్మల్‌లో పాదయాత్ర సందర్భంగా ప్రజలతో మాటా మంతి నిర్వహించారు.

వృద్ధురాలు: అన్ని ధరలు పెరిగా యి. లిసలెండర్ ధర కూడా పెంచారు. చక్కెర కేజీకి రూ. 42, పప్పు కేజీకి రూ. 75, ఉప్పు రూ.10, నూనె రూ. 100కు పెంచారు. మేమెట్ల బతికేది.

చంద్రబాబు: కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎంతో నష్టపోయారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత నాపై ఉందని, తులం బంగారం రూ. 5 వేలు ఉంటే అప్పుడు, ఇప్పుడు రూ. 40 వేలు చేశారని, నాకు అవకాశం ఇస్తే పూర్వ వైభవం తీసుకవస్తా.

వృద్ధురాలు: ఒక బల్బుకు రూ. 400 బిల్లు వస్తుంది సారు..

చంద్రబాబు: కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అని చెప్పి నాటకాలు ఆడుతుంది. 18 గంటల కరెంటు ఇస్తామని మోసం చేశారు. వేరే రాష్ట్రాలకు మిగులు విద్యుత్‌ను అమ్ముకుంటున్నా రు. ఇప్పటికైనా మీకు న్యాయం చేసేందుకు కృషి చేస్తా. నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయిస్తా.

విద్యార్థి: మాకోసం పాదయ్రాత చేస్తున్నందుకు ధన్యవాదాలు.. మా పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాం. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. పక్కనే గోదావరి నీరు ఉన్నా ఉపయోగించుకోలేక పోతున్నాం. అన్ని కష్టాలే ఉన్నా యి. మా బాధలను తీర్చండి.

చంద్రబాబు: పాఠశాలకు ఎంపీ ఫండ్ కింద మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయిస్తా, గో దావరి నీరు అందరికీ అందే విధంగా లిఫ్ట్ పెట్టించి తాగునీటి సమస్య తీర్చు తా. భవిష్యత్తులో విద్యార్థులకు ఎలాం టి నష్టం జరుగకుండా ఉచితంగా పూ ర్తిస్థాయిలో చదివించి ఉద్యోగం ఇప్పి స్తా. ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృ తి అందజేయిస్తా. గతంలో విద్యార్థుల సౌకర్యం కోసం సైకిళ్లు ఇచ్చాం. ఇప్పు డు కూడా మళ్లీ అందజేస్తాం.

విద్యార్థి: తెలంగాణకు మద్దతు తెలపాలి.

చంద్రబాబు: తెలంగాణ విషయంలో స్పష్టంగా తెలియజేశాను. కాంగ్రెస్, టీఆర్ఎస్, పీఆర్పీ కుట్రలు పన్ని మోసంతో అధికారంలోకి వచ్చా రు. లేకపోతే ఎప్పుడో తెలంగాణ వచ్చేదన్నారు.