December 13, 2012

గ్రామ స్థాయిలో పాదయాత్రలు నిర్వహించండి

(నిర్మల్/ఖానాపూర్/మామడ): గ్రామ స్థాయిలో పాదయాత్రలు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారం కో సం కృషి చేయాలని, పార్టీని మరింత పటిష్టపర్చే విధంగా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మా మడ మండల తిర్పెల్లి వద్ద చెన్నూర్ నియోజక వర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పలు విషయాలను ఆయన దృషి ్టకి తీసుకెళ్లారు. నియోజక వర్గ ఇన్‌చార్జిల నియమించాలని పలువురు సీనియర్ నేతలు కోరగా బస్సులో కర్చీప్ వేసినంత సులభంగా కాదని, తగిన సమయం వచ్చినప్పుడే నియమించడం జరుగుతుందని పేర్కొన్నారు. సింగరే ణి లాభాల్లో నడవడానికి తెలుగుదేశం పార్టీ చేసిన కృషేనని ఈ విషయాన్ని నాయకులు ప్రజల్లో తీసుకెళ్లి వివరించాలని సూచించారు.

అందులో 15శాతం లాభాల వాటా ఇవ్వడం కార్మికులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నా రు. సంజయ్‌కుమార్ నాయకుడు మా ట్లాడుతూ పని చేసే నాయకులకు పదవులు ఇచ్చి గుర్తించాలని కోరగా, త్వర లో మంచి నిర్ణయం తీసుకుంటామని, కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత ఉం టుందన్నారు. బి. నర్సింగ్‌రావు మాట్లాడుతూ చెన్నూర్ నియోజక వర్గంలో అండర్ గ్రౌండ్ మైన్స్ అభివృద్ధికి పా టుపడాలని, సింగరేణిలో పని చేసిన వారికి వారసత్వపు ఉద్యోగాలు కల్పించాలని కోరగా, సింగరేణి అభివృద్ధి కృషి తెలుగుదేశం పార్టే కారణమని పు నర్ఘటించారు.

జగదల్‌పూర్ హైవే లైన్ పూర్తి చేస్తే నాలుగు వందల కిలో మీటర్ల దూరభారం తగ్గుతుందని చెప్ప గా, ఈ విషయం పరిశీలిస్తామని హా మీ ఇచ్చారు. ఎండి అబ్బస్ మాట్లాడు తూ మందమర్రి పట్టణంలో నాలుగు సంవత్సరాలుగా పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్నామని, అయినా తమకు ఎ లాంటి గుర్తింపు లేదని చెప్పగా, ఈ విషయమై జిల్లా అధ్యక్షుడు నగేష్, ఎంపీ రాథోడ్ రమేశ్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో చెన్నూ ర్ నియోజక వర్గ నాయకులు చీర్ల రాజేశ్వర్‌రెడ్డి, శ్యాందాస్, పెద్దపెల్లి తిరుపతి, నర్సింగ్‌రావు, శ్రీనివాస్, సురేష్, నాయిని మధునయ్య పాల్గొన్నారు.