December 13, 2012

ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..: చంద్రబాబు

ఆదిలాబాద్ : టీడీ పీని ఆదరించి, ఆశీర్వదించాలనీ, అధి కారంలోకి వచ్చిన తరువాత జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతానని ఆ పార్టీ అధ్యక్షుడు చం ద్రబాబు నాయుడు అన్నారు. 'వస్తు న్నా మీ కోసం' పాదయాత్రలో భాగం గా గురువారం కొరిటికల్ క్రాస్ రోడ్, కొరిటికల్, మామడ, పోనికల్ క్రాస్ రోడ్, డాంబర్ ప్లాంట్, దిమ్మదుర్తి వరకు 14.3 కిలో మీటర్లు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు. టీడీపీ హ యాంలోనే జిల్లాను అభివృద్ధిచేశా మని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు. తమ హయాంలో జ రిగిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ సర్కార్ కనీసం మరమ్మతులు కూడా చేయించలేదని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వం సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో జిల్లాలోని వేలాది హెక్టార్లలోని పసుపు, పత్తి, వరి పంటలు ఎండిపోయాయనీ, లక్షలాది ఎకరాల్లో దిగుబడి తగ్గిపోయిందన్నా రు. కరెంట్ సక్రమంగా సరఫరా చేయకపోవడంతో నీళ్లు లేక పంట దిగుబడి తగ్గిపోయిందని, పెట్టుబడులు పెరిగిపోయాయని, దాంతో జిల్లా రైతాంగం అప్పుల ఊబి లో కురుకపోయిందన్నారు. అప్పుల బాధ భరించలేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దనీ, టీడీపీ అధికారంలోకి రాగానే రైతులు తీ సుకున్న అన్ని రుణాలను మాఫీ చేస్తాననీ, పత్తి, వరి, పసుపుతోపాటు ఇతర పంటలకు గిట్టుబాటు ధర చెల్లిస్తానని ఆయన పేర్కొన్నారు. ఎరువుల ధరలను తగ్గించి వ్యవసాయాన్ని లాభసా టి మారుస్తానన్నారు.

ఎరువుల కోసం రైతులు పోలీస్‌స్టేషన్ల వద్ద రోజుల తరబడి క్యూలో ని ల్చున్నప్పటికీ ఒక్క ఎరువుల బస్తా దొరకలేదనీ, ఐదు లాఠీ దెబ్బలు తిం టేనే ఒక యూరియా బస్తా ఇచ్చారని ఆయన చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలతో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయనీ, ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యుత్ సక్రమంగా సరఫరా చేయని అధికారులు, బిల్లులు మాత్రం అధికంగా వేస్తున్నారని ఆయ న విమర్శించారు.

రాని కరెంట్‌కు బిల్లుల మోత మోగడంతో గుండె ఆగిపోయేలా ఉందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ కాలి పోతే చేతులు తడపందే కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఇవ్వడం లేదన్నారు. జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పత్తి, ప సుపు పంటలను సాగు చేస్తున్నారనీ, వీరి కోసం పొగాకు బోర్డు మాదిరిగా పసుపు, పత్తి పంటలకు అభివృద్ధి బో ర్డును ఏర్పాటు చేయిస్తానని ఆయన అ న్నారు. జిల్లాలోని పత్తి, పసుపు తదితర వ్యవసాయ ఉత్పత్తుల కోసం జిన్నింగ్, స్పిన్నింగ్ తదితర పరిశ్రమలను ఏర్పాటు చేసి జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో సాగునీరు. డ్రైనేజీ , పాఠశాల, ఆసుపత్రుల భవనాలను నిర్మించి, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతానన్నారు. ఆదర్శ రైతులు ఒక్కసారి కూడా పొలాలకు వెళ్లి వ్యవసాయ సలహాలు ఇవ్వకుండా, బెల్లు షాపులు పెట్టి మద్యాన్ని విచ్చల విడిగా విక్రయిస్తున్నారని విమర్శించారు.

పిల్లలకు ఉచిత విద్యను అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి చెల్లిస్తానని ఆయన చెప్పారు. జిల్లాలో లక్షలాది మంది బిడీ కార్మికులు ఉన్నారని, బీడీ కార్మికులకు ఎక్కువ పని ది నాలు కల్పించి, వెయ్యి బీడీ రూ. 150 చెల్లించి, బీడీ కార్మికులందరికి లక్షన్నర రూపాయల వ్యయంతో ఉచితంగా ఇళ్లు కట్టిస్తామన్నారు. జిల్లాకు చెందిన లక్షలాది మంది ఉపాధి కోసం గల్ఫ్ దే శాలకు వెళ్లారని, అక్కడి కొంత మంది చనిపోతే వారి శవాలను తీసుక రావడానికి ప్రభుత్వం తన వద్ద డబ్బులు లేవని చేతులు ఎత్తేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ బాధితు ల కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తాను తెలంగాణకు గతంలో, ప్రస్తుతం, భవిష్యత్‌లో వ్యతిరేకం కాదని ప్రజలను మనోభావాలను గౌరవిస్తానన్నారు.

ముస్లింల సంక్షేమం కోసం మరో రూ. 2500 కోట్లతో ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేయించి వడ్డీలేని రుణాలు అందిస్తానని హామీ ఇచ్చారు. సమావేశాల్లో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్, నిజాబాబాద్ రూరల్ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర్‌రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ ఎమ్మెల్యే నగేష్, టీడీపీ సీనియర్ నాయకులు పాయల శంకర్, లోలం శ్యామ్ సుం దర్, బాబర్, యూనిస్ అక్బానీ, రాష్ట్ర పరిశీలకుడు అర్షపల్లి విద్యాసాగర్‌రావు, రాష్ట్ర నాయకులు శ్రీశైలం, కోటేశ్వర్‌రావు, అందుగుల శ్రీనివాస్, జైపూర్ మాజీ జడ్పీటీసీ పెద్దపల్లి తిరుపతి, నారాయణరెడ్డి, జుట్టు అశోక్, ఆ దిలాబాద్ నియోజక వర్గం నాయకుడు గణేష్‌రెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు.

బాబుకు నీరాజనం: నార చంద్రబాబునాయుడుకు గు రువారం ప్రజలు నీరాజనం పలికారు. కొరిటికల్ క్రాస్ రోడ్, కొరిటికల్, మామడ, పోనికల్ క్రాస్ రోడ్, డాంబర్ ప్లాంట్, దిమ్మదుర్తి వరకు పాదయాత్ర నిర్వహించిన చంద్రబాబునాయుడుకు ప్రజలు పూలమాలలతో, మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికి, తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను విన్నవించారు.

కొరిటికల్ నుంచి దిమ్మదుర్తి వరకు ఉన్న గ్రామాల్లోని ప్రజలను, పొలాల్లో పని చేస్తున్న రైతులను, కల్లుగీత కార్మికులను, బీడీ కార్మికులను పలుకరిచారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేపట్టాననీ, ఓపిగ్గా వారు చెప్పే సమస్యలు విని ఆ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపడితే పేదలు బాగుపడుతా రో.. చెప్పాలని కోరారు. ఈత, తాటి వ నం పెంచుకునేందుకు భూములు ఇప్పించాలని కొరిటికల్‌లో కల్లుగీత కా ర్మికుడు గంగాధర్‌గౌడ్ కోరగా చర్యలు తీసుకుంటానన్నారు. వెనకబడిన కూ లాలకు చెందిన తాము కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నామనీ,భూమి ఇప్పించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు భూములు కొనుగోలు చేసి ఇచ్చేలా చర్యలు చేపడుతానని చంద్రబాబు పేర్కొన్నారు.