December 13, 2012

మీ కష్టాలు తీర్చేందుకే పాదయాత్ర

(నిర్మల్/ మామడ/ కడెం/ సారంగాపూర్): మీ కష్టాలు కడతర్చేందుకే వస్తున్నా మీ కోసం పాదయాత్ర చేపట్టానని, స్వయంగా మీ బాధలు తెలుసుకునేందుకే వచ్చానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. లక్ష్మణచాంద మండలం తిర్పెల్లి నుంచి మామడ మండలం కోర్టికల్ వరకు దాదాపు 4 కి.మీటర్ల పాదయాత్ర చేయగా మధ్య లో పలువురు రైతులు, మహిళలు కలిసి తమ గోడును చెప్పుకున్నారు. లక్ష్మణచాంద గ్రామానికి చెందిన బు చ్చవ్వ అనే వృద్ధురాలు మాట్లాడుతూ పొట్టగడవడం కష్టంగా ఉందని వాపోయింది. కొడుకులు ఉన్నారా.. సరిగ్గా చూసుకుంటున్నారా అని బాబు ప్ర శ్నించగా వృద్ధురాలు మాట్లాడుతూ కొడుకులు పట్టించుకోవడం లేదని, రూ.200 పింఛన్ వస్తుందని, చాలా కష్టంగా ఉందని ఆవేదనతో తెలిపింది.

స్పందించిన బాబు అధికారంలోకి రా గానే రూ. 600 పింఛన్ ఇస్తామని చె ప్పారు. అనంతరం రూ.2వేల నగదును బుచ్చవ్వకు అందించారు. మరో రైతు సాయన్న ఆయన మాట్లాడుతూ గి ట్టుబాటు ధరలు రావడం లేదని, పంట పండించాలంటే కష్టంగా ఉంద ని వాపోయారు. మీ కష్టాలు గట్టెక్కేంచించేందుకు వచ్చానని, పంట రుణాల ను మాఫీ చేస్తామని బాబు చెప్పారు. రాచాపూర్‌కు చెందిన నడి పి పోసాలు (మాజీ సర్పంచ్) మాట్లాడుతూ మీ కోసం నేను ఇక్కడ వేచి ఉన్నానని, గతంలో ఉపాధ్యాయులు మోసం చేశారని, అందు వల్లనే ఒడిపోయామని,ఈ సారి మాత్రం టీచర్లను నమ్మవద్దని పోలింగ్ బూత్‌లో నిరుద్యోగులను నియమించాలని సూచించారు.

సరే అలాగే చేద్దామని చంద్రబా బు అన్నారు. లక్ష్మణచాందకు చెందిన భార్యభర్తలు రాజేశ్వర్, విజయలక్ష్మీలను బాబు పలుకరించారు. ఏ పంట వేశారా... దిగుబడి వస్తుందా... కరెంట్ వస్తుందా.. అప్పు ఎంత ఉంది అని అ డిగారు. సరైన దిగుబడి రాలేదని, మూడు గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చారని, మక్కపంట ఎండిపోయిందని, రూ.లక్ష50వేలు అప్పు ఉందని, ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారని చెప్పగా, అప్పులు మాఫీ చేయిస్తాం. పిల్లలను చదివిస్తాం. కాంగ్రెస్ ప్రభు త్వం వల్లనే ఈ కష్టాలు వచ్చాయని చంద్రబాబు అన్నారు. కోర్టికల్‌కు చెందిన గంగవ్వను పలుకరించగా, ఒక బల్బుకే రూ.600 వచ్చిందని, నాయకులు దోచుక తింటున్నారని, మీ వెంట ఉన్నా నాయకులే మోసం చేస్తున్నారని ఆవేశంతో అనగా, నిజాయితీ పరులు ముందుకు వచ్చి పార్టీలో కొనసాగాలని గంగవ్వనుకు చెప్పారు.

ఈ సందర్భంగా గాళ్ల గంగవ్వ తన భర్త గాళ్ల రాజారెడ్డిని చంద్రబాబు నాయుడికి పరిచయం చేయించారు. తొలుత గంగవ్వ బాబు దగ్గరికి వచ్చి తన మాటలతో ఆకట్టుకుంది. దీంతో నీవు ఏ పని చేస్తావు. నీ భర్త ఏం చేస్తా రు.. ఇలా చురుకుగా ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, అవినీతిని నిలదీయాలని అన్నారు. గంగవ్వ భర్త పొలాల్లో ఎడ్లు మేపుతుండగా బాబు పిలిపించారు. భార్యభర్త భూజాల పై బాబు చేతులు వేసి ఆవులను పెంచేందుకు లోన్ ఇప్పిస్తాం. ఆదాయం వస్తుంది చేసుకోవాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.