May 10, 2013

ఓటింగ్‌లో ఐరిష్ పద్ధతిని పెట్టాలి : చంద్రబాబు

ఎన్నికల్లో సంస్కరణలు అవసరం
దేశంలో అవినీతి, నల్లధనం పెరిగిపోయింది

న్యూఢిల్లీ

శుక్రవారం ఉదయం రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం జరిగింది. భేటీ ముగిసిన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలను ట్యాపరింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతి ఓటరుకి తన ఓటును ఎవరికి వేస్తున్నానో తెలియాలన్నారు. పోలింగ్ బూత్‌లలో వెబ్ కెమెరాలు పెట్టిలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈవీఎంలకు అదనపు ప్రింటర్లను జత పర్చాలని గతంలో ఈసీకి చెప్పినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఈసీ ఈ ప్రతిపాదనను తీసుకువచ్చిందన్నారు. ఈసీ నిర్ణయానికి ఒకటి,రెండు పార్టీలు మినహా అన్ని పార్టీలు అంగీకారం తెలిపినట్లు బాబు చెప్పారు. ఈవీఎంలకు ప్రింటర్లు అమర్చే నిర్ణయాన్ని ఈసీ వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమలు జరిగితేనే తనకు సంతృప్తి అని బాబు పేర్కొన్నారు.

అలాగే ఎన్నికలు జరిగే అన్ని కేంద్రాల్లో వెబ్‌కెమెరాలు ఏర్పాటు చేయాలని ఈసీకి తెలిపామని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల సమయంలో పెయిడ్ వార్తలు, మద్యం పంపిణీ నియంత్రించాలన్నారు. రౌడీలకు ఎన్నికల్లో అనుమతివ్వకుండా ఈసి తగుచర్యలు తీసుకోవాలన్నారు. వీటిపై పార్టీలతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని ఈసీని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవినీతిని ప్రజలు వ్యతిరేకించారన్నారు. దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింద న్నారు. సుప్రీం కోర్టు కుంభకోణాలను వెలికి తీసున్నాయని, ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవ ట్లేదని చంద్రబాబు మండిపడ్డారు.

ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత పారదర్శకత కోసం ఓటింగులో ఐరిష్ పద్ధతిని ప్రవేశపెట్టాలని చంద్రబాబు అన్నారు. అయితే, ఎన్నికల్లో ధనప్రవాహాన్ని నియంత్రించలేకపోతున్నారని ఆయన అన్నారు. ఓటర్లను కొంటున్నారని, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని అన్నారు. మద్యం ఏరులై పారుతోందని చంద్రబాబు విమర్శించారు. నేరగాళ్లు రాజకీయాల్లోకి వస్తున్నారని, నేరగాళ్లు రాజకీయాల్లోకి రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రజలు అవినీతిపరులను తిరస్కరించే స్థితికి వచ్చారని చంద్రబాబు అన్నారు. నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడతామని తాము గత ఎన్నికల్లో ప్రకటించామని, నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంటోందని, దాన్ని ఎలా అమలు చేయాలనే అంశంపై కేంద్రం అందరి అభిప్రాయాలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు.
: ఎన్నికల్లో సంస్కరణలు అవసరమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. దేశంలో అవినీతి. నల్లధనం బాగా పెరిగిపోయాయన్నారు. నల్లధనాన్ని, అవినీతిని నిర్మూలిస్తే దేశంలో పేదరికాన్ని అంతం చేయవచ్చునని ఆయన అన్నారు. వేయి రూపాయల నోట్లు వచ్చిన తర్వాత కోటి రూపాయలు కూడా జేబుల్లో పెట్టుకుని వెళ్లడానికి వీలవుతుందని, ఈ పద్ధతి మారాలని, లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరగాలని చంద్రబాబు అన్నారు.