April 23, 2013

బాబు బస ఓ జాతర

విశాఖపట్నం

తర్వాత పిలుపు రాగానే వారంతా బాబును కలుస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ సందడి ఉన్నప్పటికీ ప్రస్తుతం పాదయాత్ర చివరి రోజుకు రావడంతో క్యాంప్ వద్ద మరింత సందడి ఎక్కువయ్యింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వచ్చి బాబును కలిసేందుకు బారులు తీరుతున్నారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితులను తెలియజేయడం, లేదా ఇన్‌చార్జిల నియామకం, ఇతరతరా సమస్యలు బాబుకు ఏకరువు పెడుతున్నారు. కొన్నింటిపై ఆయనే వారి నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.

ప్రతి రోజు ఉదయం 10, 11 గంటలకు ప్రారంభమవుతున్న నాయకుల హడావిడి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతున్నది. అనంతరం ఒకటి, రెండు నియోజకవర్గాల సమీక్షలు వుంటున్నాయి. ఇదిలా వుండగా క్యాంప్ నిర్వహించేచోట స్థానికంగా వున్న కొందరు బాబును కలిసి సంఘీభావం తెలిపేందుకు పోటీ పడుతూ, ఫొటోలు దిగేందుకు సరదా పడుతున్నారు. కొందరు ముఖ్య నాయకులు కుటుంబ సభ్యులతో వచ్చి బాబును కలిసి యోగక్షేమాలు అడుతున్నారు. ఆయన కూడా వారితో ఓపికగా వారు ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు.
: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వస్తున్నా.. మీ కోసం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఏడు నెలల నుంచి పాదయాత్ర చేసిన చంద్రబాబు అదే జోరు కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి సమీక్షలు.. సమావేశాలు.. సాయంత్రం పాదయాత్ర ఇలా ఆయన రోజువారి కార్యక్రమం కొనసాగుతోంది. బాబు బస చేసే బస్సు వద్ద ఓ జాతరే. ఉదయం పూట వచ్చీపోయే జనం, వారి వాహనాలు, పోలీస్ బందోబస్తు, మీడియా హడావుడి. సాయంత్రం బాబు పాదయాత్ర ప్రారంభంతో వచ్చీ పోయే నాయకులతో కోలాహలంగా మారుతోంది. వచ్చిన నాయకులకు క్యాంప్ నిర్వాహకులు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకుల కోసం ప్రత్యేకంగా టెంట్‌లు వేసి లోపల ఎయిర్ కూలర్లు పెట్టారు. సీనియర్లంతా అక్కడ కొద్దిసేపు వేచి వుంటున్నారు.