April 23, 2013

రాష్ట్రాన్ని చక్కదిద్దగలిగేది చంద్రబాబే


జంగారెడ్డిగూడెం: రాష్ట్రాన్ని చక్కదిద్దగలిగే సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబునాయుడని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు అన్నా రు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సోమవారం ఆయన స్థానిక నాయకుడు నందిన హరిశ్చంద్రరావు నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాగంటి బాబు మాట్లాడుతూ రాష్ట్రానికి దశ దిశ నిర్ధేశం చేసే ఏకైక వ్యక్తి చంద్రబాబునాయుడే అని కాంగ్రెస్ అవినీతి పాలనతో ప్రజలకు అర్థమైందన్నారు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి అవినీతి ప్రభుత్వానికి, కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థ ప్రభుత్వానికి ప్రజలలో రోజురోజుకు తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనమైపోయాయని వాటన్నింటిని చక్కదిద్దడానికి సమర్థవంతమైన నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమన్నారు. అటువంటి సమర్థమవంతమైన నాయకుడే చంద్రబాబు అన్నారు.

కాంగ్రెస్ వైఫల్యాలు వైయస్ కుటుంబం అవినీతి ప్రజలకు వివరిస్తూ చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్రకు అనూహ్య స్పందన లభించిందన్నా రు. బాబు పాదయాత్ర ప్రజల్లో చైతన్యం కలిగించిందన్నారు. రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధిస్తుందన్నారు. క్రమశిక్షణ కు, నిజాయితీకి మారుపేరైన టీడీపీకి ప్రజలు పట్టం కట్టడం తథ్యమన్నారు. పార్టీలో చిన్న చిన్న విబేధాలుంటే సర్దుబాటు చేసుకుని ప్రజల్లోకి వెళతామన్నారు. డబ్బు కోసం ఏనాడు తాను ఆశించలేదని తరతరాలుగా తమ వంశం నీతిగానే రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేసిందన్నారు. ఈనెల 27వ తేదీతో చంద్రబాబు నాయుడి వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగుస్తుందని ఈ సందర్భం గా విశాఖలో ఏర్పాటు చేసిన సభకు కార్యకర్తలు తమ సొంత ఖర్చులతో వెళ్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ కో ఆర్డినేటర్ మండవ లక్ష్మణరావు, పోలవరం నియోజకవర్గ నాయకులు మొడియం శ్రీనివాసరావు, జయవరపు శ్రీరామమూర్తి, టీడీపీ జిల్లా అధికార ప్రతిని«ధి బొబ్బర రాజ్‌పాల్‌కుమార్, జంగారెడ్డిగూడెం పట్టణ, మండల అధ్యక్షులు షేక్ ముస్తఫా, దల్లికృష్ణారెడ్డి, బుట్టాయగూడెం, కా మవరపుకోట, మండల టీడీపీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, కోనేరు వెంకట సుబ్బారావు, మందలపు కృష్ణారావు, పరిమి రాంబాబు, మద్దిపాటి నాగేశ్వరరావు, నంబూరి రామచంద్రరాజు, పెసరగంటి జయరాజు, తూటికుంట దుర్గారావు, వందనపు హరికృష్ణ, పాతూరి అంబేద్కర్, ధూళిపాళ ప్రభాకరరావు, యర్రమళ్ళ సుబ్బారావు, ఆరుగొల్లు బజారు, మిడతా పెంటయ్య, ముళ్ళపూడి శ్రీనివాసరావు, గంధం అప్పాజీ, పిన్నమనేని మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు.