September 6, 2013

ముసలి వాళ్లు కూర్చుని రాష్ట్రాన్ని విభజిస్తారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో చలపతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సంభాషించారు. నా డు చదువుకొంటే ఉద్యోగం వస్తుందన్న భరోసా ఉండేది. నేడు రాష్ట్ర విభజన జ రిగితే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించా రు. చంద్రబాబు, విద్యార్థుల మధ్య కొ నసాగిన సంభాషణ వారి మాటల్లోనే ఇస్తున్నాం.
లోకేష్: నల్లధనం తరలిపోతోంది. యువతరం చితికిపోతోంది. చదువుకొ న్న విద్యార్థులు వేరే దేశాల వైపు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. మీరొస్తే మళ్లీ మాకు మంచి రోజులు వస్తాయని న మ్ముతున్నాం. సీడబ్ల్యూసీలో తెలుగువాళ్లు లేకుండా ముసలివాళ్లు కూర్చుని రాష్ట్ర విభజన నిర్ణయం ఎలా తీసుకొంటారు?
చంద్రబాబు: చూడు లోకేష్. మన దే శంలోని సంపదనంతా కాంగ్రెస్ దొంగ లు దోచేశారు. వాళ్ల స్విస్ బ్యాంకు అకౌంట్లలో నుంచి డబ్బు దేశానికి రప్పి స్తే మనపై ఎలాంటి అప్పులు ఉండవు. రాజకీయ లబ్ధి కోసం సీడబ్ల్యూసీ నిర్ణ యం చేసి చిచ్చుపెట్టారు. తెలుగుజాతికి అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోను. మీకు న్యాయం జరిగేంత వరకు ధర్మ యుద్ధం చేస్తా.
స్రవంతి: హైటెక్ సిటీని హైదరాబాద్‌లోనే ఎందుకు అభివృద్ధి చేశారు. రేపు రాష్ట్ర విభజన జరిగితే మా భవిష్యత్తు ఏమిటి?
చంద్రబాబు: హైదరాబాద్ ఒకప్పు డు చిన్న నగరం. విదేశాల నుంచి ఎవ రు ఇక్కడికి రావాలన్నా ముందు ముం బై వెళ్లి అక్కడి నుంచి వచ్చేవారు. దాం తో తొలుత రాజధానిని అభివృద్ధి చే యాలని నేను ముందుకెళ్ళాను. హైటెక్ సిటీని నిర్మించి ఉపాధి కల్పించాం. వైజాగ్‌లో హెచ్ఎస్‌బీసీ ఏర్పాటు చే యించాం. రాజధాని అందరి కోసం నిర్మించింది. దాని ఆదాయం మొత్తం ర్రాష్టానికి చెందాలి.
ప్రియాంక: ఇదివరకు చదువుకొంటే ఉద్యోగం వస్తుందని ఎంతో ఆత్మవిశ్వాసం ఉండేది. నేడు మా
కు ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయి?
చంద్రబాబు: ఒక నిర్ణయం చేసే స మయంలో అన్ని ఆలోచన చేసి చేయా లి. కాని సీడబ్ల్యూసీ వాళ్లు అలా చేయలేదు. దేశాన్ని, ఏపీని కాపాడుకొనే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉన్నది. ఎన్నికల్లో గెలవగానే ఆరు నెలల వ్యవధిలో స మస్య పరిష్కరిస్తా.
కళాశాల ప్రిన్సిపాల్ రవికాంత్ మా ట్లాడుతూ తొలి సంతకం రుణమాఫీపై చేసినా రెండో సంతకం మాత్రం సాంకేతిక విద్యపై చేయాలని తాను విద్యార్థుల తరుపున కోరుతున్నానన్నారు.