September 6, 2013

పార్లమెంటు అంటే రాతిగోడలేనా : ఎన్.శివప్రసాద్



పార్లమెంటులో ప్రజల గోడు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని, పార్లమెంటు అంటే రాతి గోడలేనన్న అబిప్రాయం కలుగుతోందని చిత్తూరు ఎమ్.పి డాక్టర్ ఎన్.శివప్రసాద్ వ్యాఖ్యానించారు. రాతిగోడల మాదిరే పార్లమెంటులో కూర్చున్న పెద్దలు కూడా రాతి మాదిరే వ్యవహరిస్తున్నారని, ప్రజల ఆందోళనలను పట్టించుకోలేదని అన్నారు. పార్లమెంటు కన్నా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పనిచేయదలిచామని శివప్రసాద్ అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరగాంధీల కంటే ఇప్పుడు ఉన్నవారు గొప్పవారు కారని, వీరి మెడలు వంచేలా పనిచేస్తామని అన్నారు. కాగా మరో ఎమ్.పి నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ తాము చేయగలిగిందంతా తాము చేశామని , ఇక ప్రజలలో పనిచేస్తామని అన్నారు.వచ్చే పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ బిల్లు పెడితే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చని నరసరావుపేట ఎమ్.పి మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు.