June 9, 2013

టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన

అక్రమాల్లో కూరుకుపోయిన ఆంద్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కవిూషన్ వ్యవహారాల్లో అక్రమాలపై చర్చించేందుకు అనుమతినివ్వాలని టిడిపి ప్రయత్నంచేయగా సిఎంకార్యాలయం నిరాకరించడంతో ఈరోజు పెద్దఎత్తున ముట్ట డించాలని నిర్ణయించారు. దీంతో ప్రశాంతంగానే టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యాంప్ కార్యాల యంకు చేరుకున్నారు. సిఎంఅపాయింట్ మెంట్ లేకపోవడంతో గేటుబయటే నిలువరించారు పోలీసులు. ఈ వ్యవహారాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గేటు వద్ద భైఠాయించారు. అక్రమాలకు పాల్పడుతున్న సభ్యులు ప్రధానంగా సీతారామరాజుపై క్రిమినల్ కేసులు నమోదుచేసి సభ్యత్వాన్ని రద్దుచేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తోపులాటలు జరిగాయి. అరెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలుతీసుకోకుండా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వంతపాడుతోందని టిడిపి ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఈరోజు అనుమతివ్వకుండా తప్పించుకున్నా అసెంబ్లీలో ప్రబుత్వ దమననీతిని ఎండగడుతామని ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు. ఈసందర్బంగా అనంతపూర్‌కు చెందిన పరిటాల సునీత విూడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఎమ్మెల్యేలేక ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వకుండా దౌర్బాగ్యంగా వ్యవహరిస్తూ నియంతలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ ఎమ్మెల్యే అడిగినా కూడా టక్కున అపాయింట్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని, ఇది ప్రజాస్వామ్యంలో అసలైన నిర్వచనమన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి కనీస జ్ఞానం లేని వారు చేసేదే ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడమన్నారు. ఎపిపిఎస్సీ సమస్యతోపాటు అనంతపూర్ జిల్లాలోని పలు సమస్యలపై చర్చిద్దామనుకున్నా కూడా సిఎం లోపలికి కూడా రానీయకుండా గేటు బయటే నిలిపివేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేక నియంతృత్వ పాలనలో కొనసాగుతున్నామా అని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.