May 7, 2013

పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్ మీరాకుమార్

తరలి వచ్చిన అన్న కుటుంబం

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహావిష్కరణ పార్లమెంటులో జరిగింది. మంగళవారం ఉదయం స్పీకర్ మీరాకుమార్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, దగ్గుపాటి పురంధేశ్వరి దంపతులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఇంకా ప్రధాని మన్మోహన్ సింగ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, చిరంజీవి, పల్లంరాజు, కిల్లి కృపారాణి, జైరాంరమేష్, జైపాల్‌రెడ్డి, జ్యోతిరాదిత్య సింధియా, ఫరూక్ అబ్దుల్లా, బీజేపీ నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్, రవిశంకర్‌ప్రసాద్, మురళీమనోహర్‌జోషి, అరుణ్‌జైట్లీ, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు, రాపోలు ఆనందభాస్కర్, సురేష్ షెట్కర్, జయప్రద, కనుమూరి బాపిరాజు, సర్వే సత్యనారాయణ, మంద జగన్నాథం, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌యాదవ్,సినీ నటుడు మోహన్‌బాబు, టిడిపి ఎంపీలు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఇన్నాళ్ళకు ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ జరగడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.