May 7, 2013

టీడీపీని ఆపేశక్తి ఎవరికీ లేదు..


సుభాష్‌నగర్: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా రానున్న ఎన్నిక ల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చూపి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. పదవుల కోసం పార్టీని వీడాల్సిన అవసరం లే దని, కష్టపడి పనిచేసే వారికి తగిన గు ర్తింపు ఉంటుందని హామి ఇచ్చారు. పా ర్టీని వీడిన వారు వారంలోగా తిరిగి వ స్తే సముచిత స్థానం లభిస్తుందని అవకాశం ఇచ్చారు. సోమవారం కరీంనగర్‌లోని కెమిస్ట్ భవన్‌లో కరీంనగర్ అసెం బ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కా ర్యకర్తల సమావేశం జరిగింది. ఈ స మావేశానికి జిల్లా అద్యక్షుడు విజయరమణారావు, ఎమ్మెల్యేలు ఎల్. రమణ, సుద్దాల దేవయ్య, మాజీ మంత్రి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి సహా పలువురు నేతలు హాజరై కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు..

పెద్దిరెడ్డి మా ట్లాడుతూ నిజమైన టీడీపీ కార్యకర్తలు మాత్రం పార్టీలోనే ఉన్నారని తెలిపారు. ఇటీవల తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన గంగుల కమలాకర్ వెంట ఒక్కఎంపీటీసీ తప్ప ఎవరూ వెళ్లలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 12 సంవత్సరాలైనా సరైన నాయకులు లేరని, అందుకే టీడీపీ నాయకులను ఆ హ్వానిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజ లు పార్టీ వెంట ఉంటే ఎవరినైనా గెలిపిస్తారని తెలిపారు. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో 63 సంవత్సరాల వయసులో దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ వారు రెండు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అన్నారు.

టీఆర్ఎస్ నాయకులు మైండ్‌గేమ్ ఆడుతున్నారని,ఎవరెన్ని చెప్పినా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దానిని ఆపే శక్తి ఎవరికి లేదన్నారు. పార్టీ వీడిన వారికి వారం రోజులు సమయమిస్తున్నామని వారు తిరిగి పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ పార్టీ కొరకు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తుంటే ఎమ్మెల్యే కమలాకర్ పార్టీకి తీరని ద్రో హం చేశారని, వెన్నుపోటు పొడిచారన్నారు. రాబోయే సంస్థాగత, మున్సిపల్, మండల పరిషత్ ఎన్నికల్లో పార్టీ నాయకులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. సంతకాల సేకరణ కార్యక్రమా న్ని కూడా కొనసాగించాలన్నారు. జగిత్యా ల ఎమ్మెల్యే రమణ మాట్లాడుతూ కష్టపడే వారిని పార్టీ గుర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఆవిర్భావించిన నాటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కో సం పనిచేస్తున్న మల్కాపూర్ గ్రామాని కి చెంది తెలుగుదేశం కార్యకర్త పురమాండ్ల నారాయణకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనాల రాజేశం టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని బహుకరించారు..

ఈ సందర్భంగా పలువురు యు వకులు టీడీపీలో చేరారు. ఈ సమావేశంలో మంథని ఇన్‌చార్జి కర్రు నాగ య్య, హుస్నాబాద్ ఇన్‌చార్జీ రవీందర్‌రావు, హుజురాబాద్ ఇన్‌చార్జీ ఎం క శ్య ప్ రెడ్డి, వేముల వాడ ఇన్‌చార్జీ గండ్ర న ళిని, రాష్ట్ర కార్యదర్శులు బోనాల రా జేశం, పోలాస నరేందర్, ఎండి తాజోద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసాల రమేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాడపు ఆగయ్య, జిల్లా అధికార ప్రతినిధి దామెర సత్యం, నగర అధ్యక్షుడు డిండిగాల మహేశ్, జిల్లా తెలుగు యువ అధ్యక్షుడు సుద్దాల గౌతంక్రిష్ణ, జిల్లా రైతు అధ్యక్షుడు వెల్ముల రాంరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిరుపతి, తెలుగు యువత నగర అధ్యక్షుడు గాజ రమేశ్, భాగ్యనగర్ రాజేందర్, అమీనాబేగ ం, మహిళా అధ్యక్షురాలు తీట్ల ఈశ్వరి, అహ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.