March 3, 2013

పేదరికంపై పోరాడతా............తెలుగుదేశం పార్టీకి పేద ప్రజలే దేవుళ్ళు...


వారు అభివద్ధికి దూరంగా ఉన్నారు... పేదరికం పోయేంతవరకు పేదలకు అండగా ఉంటానని వస్తున్నా మీ కోసం పాదయాత్రలో చంద్రబాబు మహిళలకు భరోసా ఇచ్చారు. జిల్లాలో మలివిడత చంద్రబాబు ప్రారంభించిన యాత్ర శనివారం కూచిపూడిలో ప్రారంభమైంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు బయలుదేరిన ఆయన దారి పొడవునా ప్రజలను, మహిళా కూలీలను, చిన్నారులను పలకరిస్తూ... సమస్యలను ఆలకిస్తూ ముందుకు సాగారు...

కూచిపూడి: తెలుగుదేశం పార్టీకి పేదవారే దేవుళ్ళు... వారు అభివృద్ధికి దూరంగా ఉన్నారు... పేదరికం పోయేంతవరకు పేదలకు అండగా ఉంటానని వస్తున్నా మీ కోసం పాదయాత్రలో చంద్రబాబు మహిళలకు భరోసా ఇచ్చారు. జిల్లాలో మలివిడత చంద్రబాబు ప్రారంభించిన యాత్ర శనివారం కూచిపూడిలో ప్రారంభమైంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు బయలుదేరిన ఆయన ప్రజలను, మహిళా కూలీలను, చిన్నారులను పలకరించడంతో ఆ పలకరింపులతో ప్రజలు పులకించారు.

భట్లపెనుమర్రులో భారీగా ప్రజలు తరలిరావటంతో ప్రజానికాన్ని చూసిన బాబు ఉల్లాసంగా, ఉత్తేజంగా ప్రసంగించడంతోపాటు, అవినీతి, జలయజ్ఞంపై కడిగి ఉతికి ఆరేశారు. మాదిగలను ఎత్తిభుజానవేసుకున్నారు. రుణమాఫీ చేస్తానంటూ రైతులను ఆకట్టుకున్నారు. బెల్టుషాపులు రద్దుచేసి మహిళల కష్టాలు తీరుస్తానన్నారు. దారిపొడవునా పలుచోట్ల పొలాలలో పనిచేస్తున్న రైతు కూలీలు పరుగుపరుగున రావటంచూసి వారితో మాట్లాడుతూ, వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల మహిళలు వివిధ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. గ్రామాలాభివృద్ధి కుంటుపడిపోయిందని, కాంగ్రెస్ నాయకులకు డబ్బుపై ఆశ పెరిగిందేకానీ, ప్రజా సమస్యలు పట్టించుకునే తీరికలేదని గ్రామీణులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పుకొచ్చారు. ఇక తల్లీ, పిల్లా కాంగ్రెస్‌లు ఆడుతున్న కపట నాటకాలకు తెరదించాల్సిన సమయం ఆసన్నమైందని, మీ కష్టాలను తీర్చేందుకు నేను వచ్చాను. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండని భరోసాయిచ్చారు. ఐనంపూడి సమీపంలోకి అడుగుపెట్టిన బాబుకు ఆదిలోనే ఓ ముదుసలి బాబు ఆసుపత్రులలో మందులులేవు, డాక్టర్లు చూడటంలేదని చెప్పడంతో అమ్మా...మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీని పటిష్టంచేస్తాను, జ్వరం నుంచి అన్ని రోగాలను ఆ పరిధిలోకి తెచ్చి మీకు యిబ్బందులు లేకుండా చేస్తాననడంతో ఆ ముదుసలి రెండు చేతులతో ప్రతి నమస్కారం చేసింది. మరో మహిళా గ్రామాలలో మధ్యాన్ని సమృద్ధిగా అందిస్తున్నారేగాని, మంచినీళ్ళను అందించటంలేదని ఫిర్యాదుయిచ్చింది.

చిన్నారులు బాబునుచూసేందుకు పరుగులేడుతుంటే ఆగిన ఆయన పరిగెడుతున్న పిల్లల రుణం తీర్చుకుంటానంటూ, ఆయన చూసేందుకు వచ్చిన మహిళలతో మాట్లాడుతూ, మీ చిన్నారులకు అన్నింటా సాయంచేయడంతోపాటు, ఉచిత విద్య, ఉద్యోగం వచ్చేంతవరకూ భృతి కల్పిస్తానని, పేదలకు నివేశనాస్థలాలు, గృహనిర్మాణాలు చేయించి మీ పిల్లలకు బంగారు భవిష్యత్‌ను అందిస్తాననటంతో మహిళలు బాబుకి జై అనటం కనిపించింది. ఆయా సభలలో పలుసార్లు చంద్రబాబు తన ప్రసంగంలో తెలుగుదేశంపార్టీకి పేదవారే దేవుళ్ళని, వారు అభివృద్ధికి దూరంగా ఉన్నారంటూ, పేదరికం పోయేంతవరకు పేదలకు అండగా ఉంటానని, అందరం కలసి అవినీతిపై పోరాడదామంటూ ప్రసంగిస్తుండగా జయ జయధ్వానాలు మారు మోగ్రాయి.