March 3, 2013

రాష్ట్రంలో టీడీపీ విజయానికి నాంది

రాష్ట్రంలో తెలుగుదేశం విజయానికి సహకార ఎన్నికలు నాంది పలికాయని జిల్లా టీడీపీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. తెనాలిలోని జిల్లా సహకార కేం ద్ర బ్యాంకులో చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక శనివారం జరిగింది. అనంతరం జరిగిన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో పుల్లారావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ డీసీసీబీ, డీసీఎంఎస్‌లను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేందుకు సొసైటీ అధ్యక్షులు నీతి, నిజాయితీలకు మారుపేరుగా ని లబడ్డారని చెప్పారు. వారిని ప్రలోభపెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించినా లొంగలేదన్నారు. జిల్లాలో చంద్రబాబు పాద యాత్ర కూడా సహకార ఎన్నికల్లో విజయం సాధించేందుకు దోహద పడిందని చెప్పారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ జిల్లా నాయకులంతా ఐక్యంగా కృషి చేసి విజయం సాధించారన్నారు.

పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేం ద్రకుమార్ మాట్లాడుతూ రెండు పాలకవర్గాలు రైతులకు వి స్తృ తంగా సేవలు అందించాలని సూచించారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ సహకార ఎన్నికలలో విజయానికి మాజీమం త్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎంతగానో కృషి చేశారని అన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ సహకార ఎన్నికల స్ఫూర్తిని స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా చూపించాలని కోరారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలిచే సొసైటీలకు స్టే ఇచ్చినా కూడా కాం గ్రెస్ నాయకులు కుయుక్తులు ఫలించ లేదన్నారు.

వినుకొండ ఎమ్మెల్యే జివివి ఆంజనేయులు మాట్లాడుతూ రైతు కష్టాలు తెలిసిన వారే పదవులకు ఎన్నికయ్యారని రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. డీసీఎంఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు మాట్లాడుతూ సహకార రంగానికి పురిటిగడ్డగా పేరున్న తెనాలి ప్రాంతంలో తెలుగుదేశం విజయంతో పూర్వ వైభవం రానుందన్నారు. డీసీసీబీ చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రా ష్ట్రంలో మంచి పాలన అందించాలని తెలుగుదేశం అధినేత చం ద్రబాబు 63 ఏళ్ల వయస్సులో కూడా ఎంతో కష్ట పడుతున్నారని, 69 ఏళ్ల వయస్సులో తనకు వచ్చిన ఈ పదవికి తగిన న్యాయం చేకూరుస్తానని పేర్కొన్నారు. ఈ పదవిని యువకులకు ఇవ్వాలని చంద్రబాబుకు సూచించారని కానీ, ఎంతో నమ్మకంతో తనకు అప్పచెప్పిన బాధ్యతను తీరుస్తానని, ప్రతి నియోజకవర్గంలో పర్యటించి రైతులందరిని కలిసి సమస్యలు ఆలకిస్తామన్నారు.

పలుమార్లు ఎన్టీఆర్‌కు కార్యకర్తలచేత జోహార్లు చెప్పిస్తూ ఉత్సాహంగా ప్ర సంగించారు. ఈ సందర్భంగా ముమ్మనేని, ఝాన్సీరాణి దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో సీఈవో బి విశ్వనా«థం, మాజీఅధ్యక్షుడు మారౌతు సీతారామయ్య, వైస్‌చైర్మన్ కె సుబ్బారెడ్డి, ప్రత్తిపాడు ఇన్‌చార్జి కందుకూరి వీరయ్య, నిమ్మకాయల రాజనారాయణ, పాటిబండ్ల నాగేశ్వరరావు, గుదేటి బ్రహ్మారెడ్డి, పలువురు డైరెక్టర్లు, బి గ్రూప్‌లో గెలిచిన డీజీఎం పిన్నక శేషభానూరావు ప్రసంగించారు. ఎన్న డూ గెలవని సొసైటీలను గెలుచుకున్న పాతమల్లాయపాలెం, నిడుబ్రోలు, వేమూరు సొసైటీ అధ్యక్షులను ప్రత్తిపాటి పుల్లారావు అభినందించారు. సభలో నూతన పాలకవర్గం చేత అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. పాలకవర్గంలోని డైరెక్టర్లందరినీ సత్కరించారు.