March 18, 2013

వ్యవసాయంపై మళ్లీ చిన్న చూపే

"ప్రభుత్వం ఈసారి ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ రైతులని ఊరించి మరీ ఉసూరుమనిపించింది. కొత్తగా కేటాయింపులు ఏమీ రాలేదు. వ్య వసాయం, దాని అనుబంధ రంగాలకు కలిపి గత ఏడాది కేటాయింపులు రూ. 5700 కోట్లు ఉండగా, ఈసారి కేవలం రూ. 6129 కోట్లు ఇచ్చారు. వ్యయసాయ బడ్జెట్ మొత్తం కేటాయింపుల్లో ప్రణాళిక వ్యయం, జలయజ్ఞం నిధులను తీసేస్తే నికరంగా మిగిలేది రూ. 4200 కోట్లు. ఏడు లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కనీసం ఒక్క శాతం నిధులను కూడా వ్యవసాయానికి కేటాయించడం లేదు.

టీడీపీ ప్రభుత్వం తన చివరి బడ్జెట్ 2003-04లో వ్యవసాయానికి రూ. 1,166 కోట్లు కేటాయించింది. దాదాపు ఐదు శాతాన్ని వ్యయసాయంపై ఖర్చు చేసింది. దీని ప్రకారం చూస్తే ప్రస్తుత కే టాయింపులు కనీసం ఏడు వేల కోట్లన్నా ఉండాలి. కానీ సగం కూడా దక్కలేదు. దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం''
-టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడు విజయ్‌కుమార్