March 18, 2013

టీడీపీ హయంలోనే గ్రామాల్లో అభివృద్ధి


వర్గల్: టీడీపీ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం వర్గల్ మండలంలోని మల్లారెడ్డిపల్లి, గుంటిపల్లి గ్రామాల్లో టీడీపీ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. స్వర్గీయ ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించిన తర్వాతే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సమాన హోదా లభించిందన్నారు. అదేవిధంగా చంద్రబాబు హయాంలో గ్రామాల్లో రోడ్లు, మురుగు కాలువలు, పాఠశాల భవనాలు నిర్మించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. టీడీపీ తొమ్మిదేళ్ల పాలనలో రైతులకు 9 గంటలపాటు కరెంట్, ఎరువులు అందజేశామని చెప్పారు.

దీపం పథకం ద్వారా లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశామన్నారు. నియోజక వర్గంలో కాంగ్రెస్ నాయకులు గుండాలుగా వ్వవహరిస్తున్నారని ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. వారు ప్రభుత్వ భూములను కాజేస్తున్నారని, వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు.

అనంతరం గుంటిపల్లి, మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ రాజ్యలక్ష్మీ రమేష్, శ్రీనివాస్, మల్లయ్య, బొమ్మవెంకయ్య, అయిలయ్య, యాదగిరి, స్వామి, చంద్రం, అర్జున్‌గౌడ్, స్వామి, కుమార్, కరుణాకర్‌రెడ్డి, అశోక్, రాజు, కనకయ్య తదితరులు ఇరవైమంది ప్రతాప్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో టీడీపీ వర్గల్, గజ్వేల్ మండల అధ్యక్షులు యాదగిరిగౌడ్, ఉప్పల మెట్టయ్య, నాయకులు నాగరాజు, రామకృష్ణారెడ్డి, ప్రవీణ్, అజీస్, శ్రీనివాస్‌రెడ్డి, యాదగిరిగౌడ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.