March 18, 2013

నా ఆలోచనని కాపీ కొట్టారు

రైతు బడ్జెటా..విధాన పత్రమా!
ఐనా..ఏదీ సమర్థత
రైతుకు మళ్లీ అన్యాయమే
పశ్చిమయాత్రలో చంద్రబాబు వ్యాఖ్య

ఏలూరు: "వ్యవసాయ బడ్జెట్ ఆలోచన నాదే. దాన్ని వీళ్లు కాపీ కొట్టారు. తీరా చూస్తే అది బడ్జెట్ కాదు.. విధాన పత్రం. ఇంతకంటే వీళ్లకు ఉన్న సమర్థత ఏమిటసలు? రైతులకు మళ్లీ అన్యాయమే చేశారు'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పెదవి విరిచా రు. సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్.. కాం గ్రెస్ ప్రభుత్వానికి చివరి బడ్జెట్ అని జోస్యం చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా కానూరువద్ద పాదయాత్ర ప్రారంభించారు.

మునిపల్లె, పెండ్యాల ఎక్స్‌రోడ్, కలవచర్ల, బి.ముప్పవరం, పందలపర్రు, పురుషోత్తమ పల్లె, మద్దూరు మీదుగా 16.8 కిలోమీటర్లు నడిచారు. చంద్ర వరంవద్ద రాత్రి బస చేశారు. పాదయాత్రలో చాలా చోట్ల ప్రజలు ఆధార్ కార్డులు, నగదు బదిలీ పథకం "మాకు వద్దేవద్దు'' అని నినదించారు. డబ్బులు కాదు.. బియ్యమే కావాలని మునిపల్లెలో ఓ మహిళ తెగేసి చెప్పింది. పెం డ్యాల సెంటర్‌లో రైతులు కష్టాలు వెళ్లబోసుకున్నారు.

కాగా, యాత్రలో భాగంగా ప్రజలకు ఆయన 'కోతి- మొసలి' కథ వినిపించి ఆకట్టుకున్నారు. అంతకు ముందు కానూరులో విలేకరులను కలిసినప్పుడు సాధా రణ, వ్యవసాయ బడ్జెట్‌లపై తీవ్రంగా స్పందించారు. "ఇదొక తప్పుల తడక, మొక్కుబడి బడ్జెట్. కొత్త విషయమేదీ లేదు. తప్పులు సరిదిద్దుకోవడంగానీ, సంక్షోభం నుంచి బయటపడేందుకుగానీ ప్రయత్నం జరగలేదు. ప్రభుత్వ అసమర్థతకు ప్రత్యక్ష నిదర్శనం'' అని ధ్వజమెత్తారు.

కేెటాయింపులను లెక్కల్లో చూపారు తప్ప చిత్తశుద్ధిగానీ, తగిన కసరత్తుగానీ కన్పించడం లేద న్నారు. ర్రాష్టంలో అప్పులు లక్షా 79 వేల కోట్ల రూపా యలకు చేరాయని, తమ హయాంలో ఈ మొత్తం రూ.55వేల కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. ఇదేనా కాంగ్రెస్ సమర్థత? అని ఎద్దేవా చేశారు.

"ఏడు గంటలు కరెంటు ఇస్తామని కట్టుకథలు ఇప్పుడూ చెప్పారు. అయితే మూడేళ్లలో కరెంటు సరిగ్గా లేక 30 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతింది. ఇది నిజం కాదా?'' అని ప్రశ్నించారు. జలయజ్ఞంలో కోట్లు ఖర్చుపెడుతున్నట్లు లెక్కలు చెబుతున్నారని, అదే నిజమైతే ఆయకట్టు పెరగాలిగానీ ఎందుకు క్షీణి స్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఇవే చివరి రోజులు అని వ్యాఖ్యానించారు.

టీడీపీ ఎమ్మెల్యేల వంటా వార్పు హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల భారాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు సోమవారం వంటా వార్పూ కార్యక్రమం నిర్వహించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులో శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు వారు వంట చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

అలాగే.. బియ్యం, నూనెలు, పప్పు లు, కూరగాయలు వంటి వాటితో ఒక దుకాణం ఏర్పా టు చేసి వాటి ధరలను బోర్డులతో ప్రదర్శించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కోళ్ళ లలితకుమారి, ఉమా మాధవరెడ్డి, సుమన్ రాథోడ్, కె.ఇ.ప్రభాకర్, దేవినేని ఉమామహేశ్వరరావు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కూరగాయల దండలతో అసెంబ్లీలోకి వెళ్లాలని వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.