January 2, 2013

మా హయాంలోనే రైతులకు సాగునీరు



 
వరంగల్ జిల్లాలో కాకతీయుల కాలంలో చెరువులు నిర్మిస్తే తెలుగుదేశం ప్రభు త్వ హయాంలో కాలువలను నిర్మించామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నాలుగో రోజు పాదయాత్రలో భా గంగా బుధవారం రాత్రి దుగ్గొండి మండలం గిర్నిబావిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కాకతీయులు చెరువులు తవ్వించి ఈ ప్రాంతాన్ని ధాన్యాగారంగా మారిస్తే, టీడీపీ ప్రభుత్వం కాల్వలు తవ్వించి రైతులకు సాగునీ రు అందించిందన్నారు. 1994 నుంచి 2004 వరకు టీడీపీ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చిందన్నారు.15వందల కోట్ల రూ పాయలతో శ్రీరాంసాగర్ కాల్వలు తవ్వించి తె లంగాణ రైతులకు సాగునీరు అందిస్తే కాం గ్రెస్ ప్రభుత్వంలో చుక్కనీరు లేక ఎండిపోయి కాల్వ ల్లో పిచ్చిమొక్కలు పెరిగాయని, పిచ్చి మొక్క లు తొలగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

పాకాల సరస్సులో పందిపంపుల వాగు మళ్లీంపు ఎన్నికల నినాదంగానే మారిందన్నా రు. నల్లబెల్లి మండలంలోని రంగాయచెరువు రిజర్వాయర్ నిర్మాణం భూ సేకరణ లేక నిలిచిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దే వాదుల 3వ దఫా నిధులు లేక నిలిచిపోయిందన్నారు. కాంగ్రెస్ పాలనలో పెరిగిన ఆదాయం ఆ పార్టీ నాయకులు దోచుకోవడానికే సరిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 29 సార్లు పెట్రోల్, డీజిల్ బస్సు చార్జిలు పెరిగాయన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ది చెయడం వల్లనే ఆదాయం పెరిగిందని, భూమి విలువలు నేడు 300 రేట్లు పెరిగాయన్నారు. అయితే పెరగనిది పేదవాళ్ల ఆదాయమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్ర అభివృద్దిలో 80ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రం మనేదనని చెప్పారు. ప్రాణత్యాగాలతో తెలంగాణ సమస్య పరిష్కా రం కాదని, వారి కుటుంబాలను టీడీపీ పూర్తిగా ఆదుకుంటుందని చెప్పారు. మాకోసం కాదు, నేను మీకోసం వచ్చాను నిండు మనస్సుతో ఆశీర్వదించండి. ఇంటి పెద్దగా ఉంటాను. ఎన్నికల రోజు నాకివ్వండి. ఐదే«ళ్లు సేవకుడిగా ఉంటాను. అంటూ బాబు ప్రజలను కోరారు.

2009లో స్థానిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ సీట్లు అమ్ముకొని చెడ్డపే రు తెచ్చుకుందని ఆయన విమర్శించారు. పెత్తందార్లు, భూస్వాములు తప్ప క్యాడర్ లేని దివాలకోరు రాజకీయ పార్టీ టీఆర్ఎస్ అని అభివర్ణించారు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, అఖిల పక్షంలో పార్టీ వెల్లడించిన వైఖరిని అన్ని రాజకీయ పార్టీలు హర్షించి, అభినందిచారన్నా రు. పార్టీ మీటింగ్‌లకు వచ్చి గొడవలు చేస్తే మా పార్టీ కార్యకర్తలు కన్నెర్ర చేయాల్సి వస్తుందని ఆయన సభలో అలజడి చేసిన వారిని ఉద్దేశించి హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామాలను వదిలి పారిపోక తప్పదన్నారు.

వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రి త్వ శాఖను ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశా రు. కాంగ్రెస్‌తో పాటు వైఎస్ఆర్ సీపీ పార్టీపై కూడా చంద్రబాబు నిప్పులు చెరిగారు. టీడీపీ హయాంలోనే నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు.

ఐదేళ్ళ కాలంలో రూ.360 కోట్ల మేర అభివృద్ధి పనులు చేసినట్టు తెలిపారు. నర్సంపేట ప్రజలకు క్లోరిన్ రహిత మంచినీటిని అందచేసేందుకు నిర్మించిన డీఫ్లోరైడ్ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా మారిందన్నారు.

ఈ సభలో నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, టీ-టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బస్వారె డ్డి, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతిరా«థోడ్, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, తెలు గు యువసేన కార్యకర్తలు, ఎమ్మార్పిఎస్ నాయకులు పాల్గొన్నారు.