January 2, 2013

బీసీలకు రాజ్యాధికారమే ధ్యేయం

బీసీలకు రాజ్యధికారం సాధించడమే తన ధ్యేయమని టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. బీసీల కోసం ఇప్పటికే డిక్లరేషన్ ప్రకటించామని, తాము అధికారంలోకి వస్తే వారి అభివృద్ధికి రూ.10వేల కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. అసెంబ్లీలో బీసీలకు 100 సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. మంగళవారం రాత్రి ఆయన శాయంపేట, ఆత్మకూరులో జరిగిన బహిరంగసభలో ప్రజనుద్దేశించి మాట్లాడారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, వైసీపీలపై నిప్పులు కురిపించారు. పరకాల క్రాస్ రోడ్డు నుంచి పెద్దకోడెపాక, జోగంపల్లి, మైలారం, శాయంపేట, ఆరెపల్లి, తిరుమలగిరి, ఆత్మకూరు గ్రామాల మీదుగా మొత్తం 16కి.మీ. దూరం పాదయాత్ర సాగించారు. కామారంలో రాత్రి బస చేశారు.

వరంగల్ జిల్లాలో రాజకీ య పార్టీలే రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నాయని, పార్టీ కార్యాలయాల ముందే కొట్టుకుంటున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా మంగళవారం రాత్రి శాయంపేట, ఆత్మకూరు మండలకేంద్రాల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడా రు. ఇటీవల జిల్లాలో టీఆర్ఎస్, వైఎస్సార్‌సీపీలు కార్యాలయం ముందే కొ ట్లాడుకుని, రౌడీయిజం ప్రదర్శించాయ ని, అలాంటి సంస్కృతి మా పార్టీకి లేదన్నారు. మా కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చిన నా ప్రాణాలు అడ్డు పెట్టయినా కార్యకర్తలను కాపాడుకుంటాన ని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

టీఆర్ఎస్ కిరికిరి పార్టీ అని, ఓట్లు, నోట్లు, బ్లాక్ మెయిలింగ్ తప్ప ఆ పార్టీ కీ ఏమీ పట్టవని ఆరోపించారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు 40లక్షల మంది బీడీ కార్మికుల ఉపాధి కొల్లగొట్టే విధంగా బీడీ కట్టలపై పుర్రెగుర్తులు వే శారని ఆరోపించారు. గల్ఫ్ బాధితులు అవస్థలు పడుతున్న పట్టించుకోలేదని విమర్శించారు. పాదయాత్రలో మా సభల్లో వేల మంది ఉంటే ఒక్కరిద్దరు వచ్చి గోల చేయాలని చూస్తున్నారని, మా కార్యకర్తలు తలుచుకుంటే ఒక్కరు మిగలరని.. ఖబడ్దార్ టీఆర్ఎస్ నేతల్లా రా అంటూ హెచ్చరించారు.

తెలంగాణకు టీడీపీ ఏనాడూ వ్యతిరేకం కాదని, ఢిల్లీలో అఖిలపక్ష సమావేశంలో టీడీపీ ఇచ్చిన లేఖను అన్ని పార్టీ లు అభినందిస్తుంటే తమ ఉనికి ఎక్కడ కోల్పోతామోననే భయంతో టీఆర్ఎస్ టీడీపీపై తప్పుడు విమర్శలు చేస్తుంద ని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన పరిపాలనలో జిల్లాకో రౌడీని, ఊరి కో గూండాను తయారు చేసి ఇష్టారాజ్యంగా దోచుకున్నాడని ఆరోపించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్‌మోహన్‌రెడ్డి లక్షల కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. అప్ప టి పాపం పండి మంత్రులు, అధికారు లు సైతం జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

బీసీ అభివృద్ధి కోసం ప్రత్యేక డిక్లరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, రూ.10వేల కోట్లతో బీసీలను అభివృద్ధి చేస్తానని, అసెంబ్లీలో 100 సీట్లు కేటాయిస్తానని, బీసీలకు రాజ్యాధికారం ల భించే వరకు తాను నిద్రపోనని చంద్రబాబు పేర్కొన్నారు. చేనేత కార్మికుల కు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చా రు. బీడీ కార్మికులకు వెయ్యి కట్టకు రూ.100ఇస్తున్నారని, అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.150లు ఇస్తానన్నా రు. గీత కార్మికులకు చెట్లు పెంచుకునేందుకు 5ఎకరాల భూమి ఇస్తానని, గొర్రె ల కాపరులను ఆదుకుంటానని తెలిపా రు. శాయంపేటలోని చలివాగు ప్రాజె క్టు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి రై తులకు సాగునీరు అందించేందుకు కృ షి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు ని ర్మాణం కింద భూములు కోల్పోయిన బాధితులను ఆదుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2,14,291ఉద్యోగా లు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడం లేదన్నారు. ప్రతి ఏటా డీ ఎస్సీ పెట్టి ఉద్యోగాలు భర్తీ చేస్తానని, బీఈడీ అభ్యర్థులకు ఎస్‌జీటీలో అవకా శం కల్పిస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లాలో పత్తి, వరి పంటలు అత్యధికంగా సాగవుతున్నాయని, ఈ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ మిల్లు, స్పిన్నింగ్ మి ల్లులతోపాటు టెక్స్‌టైల్ నిర్మించి ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రతి పేద పిల్లలను ఉచితంగా చదివిస్తామని, అమ్మాయిలతోపాటు అబ్బాయిలకు కూడా ఉచితం గా సైకిళ్లు అందిస్తామని పేర్కొన్నారు. రూ.1.50లక్షల కోట్ల ఆదాయం ఉన్నా రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదని, కాంగ్రెస్ నాయకులు పందికొక్కుల్లా అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.

నగదు బదిలీ పథకంతో పేదప్రజల పొట్ట కొట్టేందుకు చూస్తే ఊరుకోమన్నారు. ఇందిరమ్మ ఇళ్లను పేద ప్రజల కు ఇప్పిస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు బిల్లులు స్వాహా చేశారని, తాము అధికారంలోకి వస్తే లక్ష రూపాయలు వెచ్చించి ప్రతీ పేదకు ఇల్లు నిర్మిస్తామ ని బాబు హామీ ఇచ్చారు. గ్రామాల్లో విచ్చలవిడిగా ఏర్పడిన బెల్ట్‌షాపులను రద్దు చేస్తామని, రైతులకు రుణమాఫీ, 9గంటల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృ ద్ధి చేసింది టీడీపీయేనని, ఎస్సారెస్పీ కాలువలను నిర్మించి సాగునీరు అం దించేందుకు తాము కృషి చేస్తే గత 9 ఏళ్లుగా చుక్కనీరు రాక కాలువలన్నీ కూడిపోతున్నాయని పేర్కొన్నారు. అ సమర్థ కాంగ్రెస్‌ను అంతం చేసినప్పుడే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. ప్రజ ల కష్టాలు తెలుసుకునేందుకే తాను ఈ పాదయాత్ర చేపట్టానని, ప్రజలు మద్దతు ఇచ్చి ఎన్నికల రోజు తమకు ఓటేస్తే ఐదేళ్లు సేవ చేస్తానని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీతక్క, గుండు సుధారాణి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.