January 2, 2013

పిల్లలూ..బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి



పాదయాత్రలో భాగంగా మంగళవారం శాయంపేట మండలం పెద్దకోడెపాకకు వచ్చిన చంద్రబాబు, గ్రామంలోని జెడ్పీ సెకండరీ పాఠశాలలో విద్యార్థులతో సమావేశమై ప లు అంశాలపై చర్చించారు. విద్యార్థులు, చంద్రబాబు మధ్య ఆసక్తికరంగా సాగిన సంభాషణ వివరాలు ఇలా వున్నాయి... (వేదికపైన చంద్రబాబునాయుడు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గుం డు సుధారాణి, బస్వారెడ్డి, సత్యనారాయణ తదితరులు కూర్చున్నారు)

బాబు: గుడ్‌మార్నింగ్ పిల్లలూ..

విద్యార్థులు: గుడ్‌మార్నింగ్ సార్

బాబు: ఢిల్లీలో జరిగిన సంఘటన గురించి తెలుసా.. ఏం జరిగింది..

విద్యార్థిని: బస్సులో వెళుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేశారు సార్. (అందులో నుంచి ఓ విద్యార్థిని లేచి)

బాబు: ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలి.

విద్యార్థులు: నిందితులను ఉరి తీయాలి సార్

బాబు: వెరీగుడ్. అలాంటి వారికి ఉరిశిక్ష వేసినా తప్పులేదు. ఢిల్లీ సంఘటనపై ప్రభుత్వం స్పం దించలేదు. ఇంతలో అమ్మాయి చనిపోయింది. కఠినమైన చట్టాలను చేసి అలాంటి వారికి ఉరిశిక్షే బెటర్.

బాబు: పిల్లలూ.. మీ పాఠశాలలో ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారా.. అబ్బాయిలా..

విద్యార్థులు: అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు.

బాబు: ఎంతశాతం..?

విద్యార్థులు: 60శాతానికిపైగా సార్

బాబు : ఎందుకిలా..?

విద్యార్థిని: ఆడపిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు.. అబ్బాయిలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు సార్.

బాబు: వెరీగుడ్.. చాలా బాగా చెప్పావు. తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల వివక్ష చూపిస్తున్నా రు. నేను ఆడపిల్లల పక్షపాతిని. నాకు ఒక అబ్బా యి ఉన్నప్పటికీ ఆడపిల్ల అంటేనే ఇష్టం. టీచర్ ఉద్యోగాల్లో ఆడపడుచులకు 40శాతం, చదువు ల్లో, కొలువుల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించా ను. పోలీసు, కండక్టర్ ఉద్యోగాల్లోను మహిళల ను పెట్టాను. ఆర్టీసీ డ్రైవర్‌గా పెట్టాలనుకున్నా.. కానీ ఎవరూ ముందుకు రాలేదు. విద్యార్థులకు సైకిళ్లు ఇచ్చాం. సంరక్షణ పథకం ప్రవేశపెట్టా. మీలో ఎంతమంది కుటుంబాలు వ్యవసాయం పై ఆధారపడి ఉన్నాయి. చేతులెత్తండి.

(దాదాపుగా అందరూ చేతులెత్తారు.)

బాబు: మీరు ఏం కావాలనుకుంటున్నారు..

(చాలామంది టీచర్, డాక్టర్ అని అన్నారు)

బాబు: మీరు చదువుకునేందుకు ఏమైనా ఇబ్బందులున్నాయా..?

రేవతి(7వ తరగతి విద్యార్థిని): మా తల్లిదండ్రులకు చదివించాలంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పత్తి పంట వేస్తే దిగుబడి రాలేదు. తీవ్రంగా పంట నష్టపోయాం. ఎకరా కు రూ.20వేల నుంచి రూ.25వేల నష్టం వస్తుంది.

బాబు: ఇంకా ఎవరైనా మాట్లాడాతారా..?


మరో విద్యార్థిని: ఉద్యోగాలన్ని రాజకీయ నాయకులు అమ్ముకుంటున్నారు. నిరుద్యోగులు మిగిలిపోతున్నారు సార్.

బాబు: మా హయాంలో ఇలాంటి అక్రమాలు జరగలేదు. 1994నుంచి 2004వరకు 29 డీఎస్సీలు వేశాం.1.65లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఏ ఒక్కరైనా లంచం ఇచ్చారా.. మీ స్కూల్‌లో పనిచేస్తున్న టీచర్లు కూడా నేను వేసిన డీఎస్సీలోనే ఉద్యోగాలు పొంది ఉంటారు.(పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు,ఓ టీచర్ ఇద్దరు కూ డా తాము 2000-మెగాడీఎస్సీలో ఉద్యోగం పొందామని,ఎవరికి ఎలాంటివి ఇవ్వకుండా మాటాలెంట్‌తో ఉద్యోగం వచ్చిందని చెప్పారు.)

బాబు: పిల్లలూ.. కష్టపడి చదవాలి. అందరూ ఒక్కటే ఉద్యోగం కోసం కాకుండా భవిష్యత్ ఎలా ఉంటుందో నిర్ణయించుకుని అటువైపు ఆలోచించాలి. పేద పిల్లలందరికి ఉచితంగా పీజీ వరకు చదివించి, వ్యవసాయం లాభసాటి చేసేందుకు కృషి చేస్తా.

మహిళల అభివృద్ధికి పాటు పడతా. ఢిల్లీలో జరిగిన సంఘటనకు నిరసనగానే నూతన సంవత్స ర వేడుకలు జరుపుకోవడం లేదు. ఆడపిల్లలు ఎ ప్పుడూ స్వేచ్ఛగా రోడ్డుపై తిరుగుతారో అప్పుడే మన స్వాతంత్య్రానికి సార్థకత లభిస్తుంది... అం టూ బాబు తన చర్చ ముగించారు.