January 1, 2013

బాబు యాత్రలో తమ్ముళ్ళ అవస్థలు



శాయంపేట మండలంలో మంగళవారం కొనసాగిన బాబు పాదయాత్రలో తెలుగు తమ్ముళ్లు అవస్థలు పడ్డారు. తమ ప్రియతమ నా యకుడిని దగ్గరనుంచి చూడాలనుకున్న తెలుగు తమ్ముళ్లు పోలీసుల తీరుతో నిరుత్సాహపడ్డారు. వివరాల్లోకి వెళితే.. వస్తున్న మీకోసం అంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర మండలంలోని పెద్దకోడెపాక, జోగంపల్లి, మైలారం, శాయంపేట, ఆరెపల్లి గ్రామాల్లో కొనసాగింది. పాదయాత్ర కొనసాగిన గ్రామాల్లో రోడ్డు ఇరుకుగా ఉండటంతో బాబు యాత్ర చేస్తున్న కాన్వాయ్‌లో వెనక, ముందు ఉన్న వాహనాలు, పోలీసుల బందోబస్తుతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో యాత్రలో నడుస్తున్న నాయకులను పోలీసులు బలవంతంగా నెట్టివేస్తుండటంతో తమ్ముళ్లు ఇరుకైన రోడ్డుపై నడవడానికి యాతన పడ్డారు. పోలీసుల ఒత్తిడితో నాయకులు రోడ్డుకు ఇరువైపుల గ ల పంట పొలాల వెంబడి నడక సాగించారు.

నిరుత్సాహం..

పాదయాత్రలో పాల్గొనేందుకు చుట్టుపక్కల గల రేగొండ, ములుగు మండలా ల నుంచి వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. కాగా, యాత్రలో బందోబస్తు దృష్ట్యా పోలీసులు ప్రవర్తించిన తీరుతో కా ర్యకర్తలు, తెలుగు తమ్ముళ్లు నిరుత్సాహానికి గురయ్యారు. పోలీసులు బాబును దగ్గర నుంచి చూడకుండా రోప్ పార్టీ సిబ్బంది, స్పెషల్ పార్టీ బలగాలు యాత్రలో నడుస్తున్న వారిని లాగేస్తూ హల్‌చల్ చేయడంతో నాయకులు నిరుత్సాహానికి గు రై వారి ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది యాత్ర వెనకవైపుకు వెళ్లిపోయారు. బా బును చూడాలని వ్యవసాయ పనులు వదులుకుని వచ్చినప్పటికి పోలీసుల తీరు తో దగ్గరగా చూడలేకపోయామని పలువురు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేశారు.