January 1, 2013

వేడుకలు జగన్‌కేనా? జనానికి వద్దా?



వైసీపీ పిలుపుపై టీడీపీ ప్రశ్న

'జగన్ జైలులో ఉన్నందున రాష్ట్ర ప్రజలు కొత్త సంవత్సర వేడుకలు చేసుకోవద్దని వైసీపీ నేతలు పిలుపునివ్వడంపై తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి గాలి ముద్దుకృష్ణమ నాయుడు, మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అసెంబ్లీ ఆవరణ లో విలేకరులతో మాట్లాడారు. వారం కిందటే జగన్ జైలులో కుటుంబసభ్యులతో కలసి పుట్టిన రోజు వేడుక చేసుకున్నారని వారు గుర్తుచేశారు.

కేక్ కట్ చేయడంతోపాటు ప్రత్యేక వంటకాలు చేయించుకున్నారని పేర్కొన్నా రు. ఆయన ఏ వేడుక అయినా చేసుకోవచ్చుగానీ, జనం మాత్రం చేసుకోకూడదా?' అని ప్రశ్నించారు. జగన్ విడుదల కోరుతూ కోటి సంతకాలు సేకరించి రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించాలన్న వైసీపీ నిర్ణయం కోర్టులను బ్లాక్‌మెయిల్ చేయడానికేనని ఆరోపించారు. ఏదైనా ప్రజా సమస్య లేదా ఉద్యమంపై సంతకాల సేకరణ చూ శాం తప్ప జైల్లో ఉన్నవారి విడుదల కోరుతూ ఇలా చేయ డం విడ్డూరమని ఎద్దేవా చేశారు. జగన్‌కు బెయిల్‌పై కోర్టు నిర్ణయించాలి తప్ప రాష్ట్రపతి ఏం చేయగలరని నిలదీశారు.

కోర్టులను ప్రభావితం చేసేలా సంతకా ల సేకరణకు పిలుపు ఇచ్చిన వైసీపీ నేతలపై కేసు నమో దు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మహిళల రక్షణకు దేశవ్యాప్త ఆందోళన సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అందుకోసం సంతకాల సేకరణ చేపడితే సంతోషించేవాళ్ళమని సలహా ఇచ్చారు. ఎపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయ రెడ్డిపై ఏసీబీ దాడుల తరహాలో జగన్‌పై ఎం దుకు జరపడం లేదని ముద్దుకృష్ణమ ప్రశ్నించారు.

'రిపుంజయ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణపై దాడులు నిర్వహించారు. అదే ఆరోప ణ జగన్‌పైనా...ఆయన సహచరులపైనా ఉంది. దీని ఆ ధారాంగా దాడులు చేయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ, అలా చేస్తే ఏదో ఒకరోజు తనకూ ఆ పరిస్థితి వస్తుందని కిరణ్ భయపడుతున్నారు' అని ఆయన విమర్శించా రు. అంతేకాకుండా జగన్‌ను తమతో కలిపేసుకునే ఆలోచనతోనే మౌనం వహిస్తున్నారని ఆరోపించారు.

బాబు వైఖరికి కట్టుబడి ఉన్నాం
తెలంగాణపై తమ పార్టీ అధినేత చంద్రబాబు వైఖరికి కట్టుబడి ఉన్నామని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ముద్దుకృష్ణమ అన్నారు. అది ఏకపక్ష నిర్ణయం కాదని, రెండు ప్రాంతాల వారితో మాట్లాడాకే తీసుకున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, అధ్యక్షుడిని కలిసి మాట్లాడతానని మాత్రమే చెప్పారని పేర్కొన్నారు. అఖిలపక్షానికి కాంగ్రెస్ తరఫున వెళ్లిన ఇద్దరు నేతలు చెరో అభిప్రాయం చెబితే ఆ పార్టీ వైఖరి ఏమిటో ఎలా అర్థం చేసుకోవాలని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రశ్నించారు.