January 1, 2013

ప్రత్యర్థిపై నిప్పులు కురిపిస్తూ..



టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పాదయాత్ర దృష్టి కోణాన్ని కాస్త పక్కకు మ ళ్ళించారు. ఎప్పుడూ రైతులు, వ్యవసాయ కూ లీలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులను స్ప ర్శిస్తూ యాత్ర సాగించే ఆయన మంగళవారం పాఠశాల పిల్లలపై దృష్టి సారించారు. నూతన సంవత్సరం రోజు కావడంతో ఆటవిడుపుగా వా రితో కొద్దిసేపు ఇష్టాగోష్టి జరిపారు. ఢిల్లీ సంఘటనకు సంతాప సూచనగా కొత్త సంవత్సరం వే డుకలకు బాబు దూరంగా ఉన్నారు. ఈ సంఘటన ప్రభావం ఆడపిల్లలపై ఎలా ఉంది? వారి స్పందన ఏమిటీ?దోషులను శిక్షించే విషయంలో వారు ఏం కోరుకుంటున్నారు? తెలుసుకోగోరారు.

విద్యార్ధినులతో...

పాదయాత్రలో భాగంగా పెద్దకోడెపాక గ్రా మానికి చేరుకున్న చంద్రబాబు గ్రామంలోని జడ్‌పీపీఎస్ఎస్ పాఠశాలను సందర్శించారు. అ ప్పటికే అక్కడ సమావేశ పరిచిన విద్యార్ధినుల తో చంద్రబాబు దాదాపు 30 నిముషాల పాటు ఇష్టాగోష్ఠి జరిపారు. ఢిల్లీ సంఘటనపై విద్యార్ధినులకు ఉన్న అవగాహన, ఆ సంఘటన విషయంలో వారు స్పందిస్తున్న తీరు, వారిలో, వా రి తల్లిదండ్రుల్లో కలిగిన అభధ్రతా భావన గు రించి తెలుసుకునేందుకు గుచ్చి గుచ్చి అడిగా రు. పంటల నష్టం పిల్లల చదువుపై ఎలాంటి ప్ర భావం చూపుతుందో కూడా తెలుసుకునే ప్రయ త్నం చేశారు. ఈ కాలపు ఆడపిల్లలు ఆసలు ఏం చదువు కోవాలనుకుంటున్నారు? ఎం కావాలనుకుంటున్నారు? ప్రస్తుత ప్రభుత్వం తీరుపై వారి అభిప్రాయలు ఎలా ఉన్నాయి? కూడా వా కబు చేశారు. పెద్దలతో పాటు పిల్లలు మనోభావాలను తెలుసుకోవడం ద్వారా మొత్తంగా ప్ర స్తుత కాంగ్రెస్ పాలనలో ఆర్ధిక, సామాజిక స్థితిగతుల ప్రభావం వారిపై ఎలా ఉందో స్థూలం గా బేరీజు వేసుకునే ప్రయత్నం చేశారు.

వేడుకలకు దూరం

కొత్త ఏడాది సందర్భంగా బాబు ఎవరి నుం చి పుష్పగుచ్చాలు తీసుకోలేదు. శుభాకాంక్షలను సైతం స్వీకరించలేదు. తనను కలవడానికి రావద్దని కూడా ఆయన కోరారు. కొత్త సంవత్సరం ఆరంభం రోజును ఆయన సాదాసీదాగా ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు బస్సు నుం చి బయటకు వచ్చారు. కార్యకర్తలు తెచ్చిన కేక్ ను కూడా సున్నితంగా తిరస్కరించారు. సర్వమత ప్రార్ధనల్లో మాత్రం పాల్గొన్నారు. గ్లోబల్ అలియాన్స్ ఆఫ్ క్రిష్టియన్ లీడర్ ఆధ్వర్యంలో జి డేవిడ్ శాంతారాజ్ బృందం బాబు క్షేమాన్ని కోరుతూ ప్రార్ధనలు చేశారు.

బస ప్రాంతంలో మరో చోట చంద్రబాబు రాష్ట్ర యువసేన అధ్వర్యంలో కాటూరి శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో నిర్వహించిన సకల అభ్యుదయ హోమం, మృత్యుంజయ హోమం, నవగ్రహ పూజలో పాల్గొన్నారు. అనంతరం పాదయాత్రను ప్రారంభించారు.

16 కి.మీ. నడక


పరకాల క్రాస్ రోడ్ నుంచి యాత్ర మొదలైం ది. శాయంపేట మండలం పెద్దకోడేపాక, జో గంపల్లి, మైలారం, శాయంపేట, ఆరెపల్లి, ఆత్మకూరు మండలం తిరుమలగిరి, ఆత్మకూరు గ్రా మాల మీదుగా 16కిమీ దూరం చంద్రబాబు పా దయాత్ర సాగించారు. కామారంలో బస చేశా రు. పెద్దకోడెపాక, జోగంపల్లి, మైలారం సభల్లో ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. ఆత్మకూరు బహిరంగ సభలో మాట్లాడారు. నాలుగో రోజు కూడా యాత్ర ప్రశాంతంగా ఒడిదుడుకులు లే కుండా సాగింది. బాబు పలుచోట్ల ఆగి పత్తి, వరి చేనుల్లో పని చేస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలను పలకరించారు. వారి ఇబ్బందులను ఆడిగి తెలుసుకున్నారు. షరామామూలేగా కరెంట్ సరఫరా ఉండడం లేదని, గిట్టుబాటుధర లభించడం లేదని, ఉపాధి పనులు లభించడం లేదని, గ్రామాల్లో రోడ్లు, కాలువలు, విద్యుద్దీపాల సౌక ర్యం లేదని వివరించారు. తాను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ పరిష్కారం అవుతాయని చంద్రబాబు హామీ ఇచ్చారు.

విమర్శనాస్త్రాలు

చంద్రబాబు నాలుగవ రోజు పాదయాత్రలో కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీ పార్టీల పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ప్రతీ బహిరంగ స భలో ఈ మూడు పార్టీలనే ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు.పెదకోడెపాక, జోగంపల్లి గ్రామాల్లో బహిరంగ సభల్లో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ' ఈ ప్రభుత్వానికి బుద్ది లేదు. ఇది చేతకాని, అసమర్ధ ప్రభుత్వం. చార్జీలు, సర్‌చార్జీలు విధిస్తూ పేద ప్రజల నడ్డి విరుస్తోంది' అన్నారు.

కాంగ్రెస్ పాలనలో అప్పులపాలై న అన్నదాతలు వారు చావడం కాదు. కాంగ్రెస్ ను చంపేయాలి. ఆ పార్టీని కూకటి వేళ్ళతో పెకిలించి బం గాళ ఖాతంలో కలపాలి' అని పిలు పు నిచ్చారు. రాష్ట్రంలో అవినీతి పెచ్చు పెరిగి పోయిందన్నా రు. వైఎస్ఆర్‌సీపీపై ధ్వజమెత్తుతూ ' ఆ పార్టీ జైల్లో ఉండి రాజకీయాలు చేస్తోంది' అని ఎద్దేవ చేశారు. టీఆర్ఎస్‌పైనా విరుచుకుపడ్డారు. ' అ ఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై టీడీపీ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించింది. టీడీపీ విధానాన్ని అందరూ అభినందిస్తుంటే టీఆర్ఎస్ గుండెళ్ళలో పరుగెత్తుతున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఆ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు సీట్లు రావాలి. దానిని అ డ్డంపెట్టుకొని నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి. ఇదీ పార్టీ సిద్ధాంతం అంటూ విమర్శలు కురిపించారు. నగదు బదిలీ పథకం పేరుతో ప్ర భుత్వం పేదల పొట్టకొడితే సహించేది లేదన్నారు.