January 1, 2013

చంద్రబాబుతోనే సామాజికతెలంగాణ సాధ్యం



టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోనే సామాజికతెలంగాణ సాధ్యమని టీ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఆయన విలేఖరు ల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్న 'వస్తు నా మీ కోసం' యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. తెలంగాణపై టీడీపీ స్పష్టమైన వైఖరి వెల్లడించడంతో కేయూ, ఓయూ జాక్ నేతలు, ప్రజా సంఘాల జేఏసీ నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సం ఘాల నాయకులు సాదర స్వాగతం పలుకుతున్నారన్నారు. అయితే టీఆర్ఎస్‌లోగుబులు ప్రారంభమైందన్నారు.

ఇన్నిరోజులు సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకొని కేసీఆర్ కుటుంబీకులు కోట్లా ది రూపాయలు కూడపెట్టుకున్నారని ఆరోపించారు. టీడీపీ మాత్రమే అఖిల పక్ష సమావేశానికి బీసీ, ఎస్సీ కులానికి చెందిన వారిని ప్రతినిధులుగా పంపి సామాజిక న్యాయం పాటించిందన్నా రు. కాంగ్రెస్, వైసీపీ, సీపీఎం, బీజేపీ పార్టీలు అగ్రవర్ణాలను ప్రతినిధులుగా పంపాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ప్రతినిధి బృందంలో ఆ వర్గాలకు ఎందుకు చోటు కల్పించలేదని ప్రశ్నించారు. ఇతర పార్టీలన్నీ టీడీపీ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన అహంకారంతో వ్యవహరిస్తున్నారన్నారు. జేఏసీలో మెజార్టీ వర్గం టీడీపీ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తోందన్నారు.

2008లో టీడీపీ తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదని స్పష్టంగా వెల్లడించినట్లు వివరించారు. తమ పార్టీ నిర్ణయంపై సం దేహం ఉంటే పాదయాత్రలో ఎవ్వరూ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. దమ్ముంటే తెలంగాణపై బహిరంగ చర్చకు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రాంతం లో టీఆర్ఎస్‌కు గుణపాఠం తప్పదని ఎర్రబెల్లి హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జాటోతు నెహ్రూ నాయక్, రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షుడు ఇమ్మడి లక్ష్మయ్య, టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు లింగాల వెం కటనారాయణగౌడ్, నాయకులు అనుమాండ్ల నరేందర్‌రెడ్డి, మంగళపెల్లి రామచంద్రయ్య, ఇ.శ్రీనివాసరావు, ఎస్.అంకూస్, బీకూ నాయక్, కాలు నాయక్, ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.