January 2, 2013

తెలంగాణకు బాబు ఆత్మీయ స్పర్శ



 తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పాదయాత్రలో తెలంగాణా వాదులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మనుసులు గెలుచుకునేందుకు తనదైన పం«థాను అనుసరిస్తున్నారు. బు ధవారం ఐదో రోజు పాదయాత్రలో ఇది స్పష్టంగా కనిపించిం ది. కాంగ్రెస్‌పై విమర్శల దాడిని మరింత పెంచారు. వైఎస్ఆర్ సీపీపై కూడా నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. మొదటి నాలుగు రోజుల పాదయాత్రలో రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించారు. వ్యవసాయ కూలీలు, గ్రామీణ మహిళలు, పేద వర్గాలు పడుతున్న ఇబ్బందులను తన ప్రసంగాల్లో ప్రధానంగా ప్రస్తావించారు. తెలుగు దేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే అన్నీ పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చారు.

తెలంగాణపై..: ప్రతీ సభలో తెలంగాణకు తాను వ్యతిరేకిని కాని ముక్తసరిగా చెప్పే చంద్రబాబు గురువారం ఒక అడుగు ముందుకు వేశారు.తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నవారి గు రించి తన ప్రసంగంలో మొదటి సారిగా ప్రస్తావించారు. ఆ త్మహత్యలు చేసుకోవద్దని అభ్యర్ధించారు. ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల వారిపై ఆధారపడిన కుటుంబాలు అండను కో ల్పోతాయని, ఇబ్బందులను ఎదుర్కొంటాయని చెప్పారు. తె లంగాణ కోసం పోరాడాలి తప్ప బలవన్మరణాలకు పాల్పడరాదని ఉద్బోధించారు. ఇదొక కొత్త పరిణామం. తెలంగాణవాదులకు దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది.

సమకాలీన సంఘటనలపై..: బాబు పాదయాద్రలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై దృష్టి సారిస్తూనే సమకాలీన పరిణామాలపై కూ డా వెంటనే స్పందిస్తున్నారు. నర్సంపేటలో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు జగన్‌కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోటి సంతకాల సేకరణను చేపట్టడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, కోర్టులపై ఒత్తిడి తీసుకురావడానికే ఇదంతా అన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడిపై పోలీసు లు కేసు పెట్టడాన్ని ఖండిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. సీఎం హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శనాస్త్రాలను సంధించారు.

కంది పంట పరిశీలన: కంది పంట పూర్తిగా దెబ్బతినండంపై ఆవేదన వ్యక్తం చేశారు. చేనులోకి వెళ్ళి స్వయంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. కరెంట్ లేక నీళ్ళు పారక పంట పూర్తిగా పాడైపోయిందని రైతులు వాపోయారు. కం ది సాగుపై రైతులు ఎంత పెట్టుబడి పెట్టింది, ఎంత నష్టపోయింది బాబు వివరంగా అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వైపరీత్రాల వల్ల పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో వ్యవసాయాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

అదే పకలరింపు: పాదయాత్రలో బాబుది అదే పలకరింపు. ఆత్మీయ స్పర్శ, ఓదార్పు. నేనున్నాన్న భరోసా. ఐదో రోజు కూడా అదే పం థాలో సాగింది. అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నారు. తనను చూడడానికి వచ్చిన వారి నుంచి అభినందనలు స్వీకరించారు. డాబాలపైకి ఎక్కి తన రాకకోసం ఎదురుచూస్తున్న వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మార్గంమధ్య లో అనేక మంది నుంచి వినతులను స్వీకరించారు. పసిపిల్లలను అప్యాయంగా ఎత్తుకున్నారు. యువకులతో కరచాలనం చేశారు.మంగళహారతులతో ఎదురేగిన మహిళలను చిరునవ్వుతో పలకరించారు. కేశవాపురంలో 20 మంది వికలాంగులకు ట్రైసైకిళ్ళను పంపిణీ చేశారు. వృద్ధులను పరామర్శించా రు.బాబుకు దారి పొడవునా టీడీపీ కార్యర్తలు పూలు చల్లారు.

16.2 కి.మీ....: కామారం నుంచి బుధవారం బయలు దేరిన చంద్రబాబు పెంచికల్‌పేట, కేశవాపురం, లక్ష్మీపురం, పొనకల్, నాచినపల్లి, గిర్నిబావి వరకు 16.2 కిమీ దూరం పాదయాత్రసాగించారు. పాదయాత్ర ప్రశాంతంగా సాగింది. కాలు నొప్పి బాధపెడుతుండడంతో బాబు నడక వేగాన్ని తగ్గించారు. మార్గం మధ్యలో అక్కడక్కడ కొద్ది సేపు కూర్చొని విశ్రాంతి తీసుకున్నారు. పెంచికల్ పేట, లక్ష్మిపురం, గిర్నిబావి గ్రామాల్లో బహిరంగ సభల్లో మాట్లాడారు. పాదయాత్రలో వేలాది మంది కార్యకర్తలు బాబు వెంట నడిచారు. గిర్నిబావి వద్ద రాత్రి బస చేశారు. పాదయాత్ర ప్రారంభం కావడానికి ముందు చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణి వచ్చి కలిసారు. వారు బస్సులోనే బాబుతో రెండు గంటల పాటు గడిపారు.