June 7, 2013

ఉద్యోగాలు కూరగాయల్లా అమ్ముకుంటున్నారు

 ఎపీపీఎస్సీలో వెలుగు చూ స్తున్న అవినీతి, అక్రమాలు చూస్తుంటే బాధేస్తోందని, అర్హులకు అందాల్సిన ఉద్యోగాలను కమిషన్‌ సభ్యులు పచ్చనోట్లకు బజారులో కూరగాయల మాదిరిగా అమ్ము కుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రభుత్వాన్ని తానింతవరకు చూడలేదన్నారు. డబ్బులున్నవారు ఉద్యోగా లను కొనుగోలు చేస్తుంటే, పేద నిరుద్యోగులు మథన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎపీపీఎస్సీపై లక్షలాదిమంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారన్నారు. అవినీతి, అక్రమాలకు నిలయమైన ఎపీపీఎస్సీని వెంటనే ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు. సభ్యుల చేత తక్ష ణమే రాజీనామా చేయించాలన్నారు.

లేకపోతే బర్తరఫ్‌ చే యాలని డిమాండ్‌ చేశారు.ఎపీపీఎస్సీ సభ్యుడు సీతా రామారాజు ఓ మహిళా దళారీ ఇంట్లో పేకాట ఆడుతూ దొరికిపోయిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. ఓ నిరుద్యోగి నుండి లంచం తీసుకోవడానికి సదరు మహిళా బ్రోకర్‌ కమిషన్‌ సభ్యుడు సీతారామారాజును ఆధారంగా చూపించిందన్నారు. ఇంతజరిగినా ముఖ్యమంత్రి స్పంది ంచకమేమిటని ప్రశ్నించారు. ఎపీపీఎస్సీలో తప్పు జరి గిందని తెలిసిన కూడా సమీక్షా సమావేశాన్ని నిర్వహించక పోవడం ఏమిటన్నారు. యువకుల జీవితాలతో, వారి భవి ష్యత్తుతో ఆడుకుంటారా? అంటూ సీఎంను చంద్రబాబు నిలదీశారు.శుక్రవారం ఎన్టీఆర్‌భవన్‌లో చంద్రబాబు విలే కరుల సమావేశంలో మాట్లాడుతూ ఎపీపీఎస్సీ సభ్యుల పర్యవేక్షణలో ఇప్పటివరకు జరిగిన ఇంటర్వ్యూలను త ణమే నిలిపివేసి, ఉద్యోగ నియామకాలను ఆపివేయా లన్నారు. వారం, పది రోజుల్లో అర్హులైన నూతన కమిషన్‌ సభ్యులను నియమించిఇంటర్వ్యూలు నిర్వహించి.

ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఎపీపీఎస్సీ స భ్యులుగా కొనసాగుతున్న ఆరుమంది కాంగ్రెస్‌ కార్య కర్తలేనని చంద్రబాబు అన్నారు. వారంతా డిగ్రీ చదువు కున్నవారనని పేర్కొన్నారు. డిగ్రీ విద్యార్హత కలిగిన కమి షన్‌ సభ్యులు ఉన్నత విద్యావంతులైన అభ్యర్థులను ఎలా ఇంటర్వ్యూ చేస్తారని ప్రశ్నించారు. కమిషన్‌ సభ్యులుగా నియమించబడిన ఆరుమంది తమ దరఖాస్తులో పొందు పర్చిన వివరాలను చంద్రబాబువిలేకరులకు చదివి విని పించారు. వైఎస్‌ అనుచరుడిగా కొనసాగుతూ, నంద్యాల మాజీ మున్సిపల్‌ చైర్మన్‌గా వ్యవహరించి ఎండీ నౌమన్‌, మహిళా కాంగ్రెస్‌ నేత మాలిక్‌, కేంద్రమంత్రి ఆశీస్సులతో సభ్యునిగా నియమిడుడైన ప్రొఫెసర్‌ పద్దయ్య పరీక్షలు ప్రారంభమైన గంట సేపటి తరువాత తొమ్మిది మంది అభ్యర్థులను పరీక్షలకు అనుమతించారన్నారు.

ఆదిలాబా ద్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు పీ.రవీం దర్‌రావు, సత్తెనపల్లి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించి విఫలమైన గుబ్బా చంద్రశేఖర్‌, చాంద్రాయణగుట్ట అసెం బ్లీకి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సీతారామారాజు ఇలా.. కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఎపీపీఎస్సీని రాజకీయ పు నారవాసంగా మార్చారని ధ్వజమెత్తారు.వైఎస్‌ అంగ రక్షకుడు సూరీడు సిఫార్సుతో నియమించబడిన ఎల్‌ఐసీ గ్రేడ్‌-2 ఆఫీసర్‌ రిపుంజయరెడ్డి అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించిన విషయం తెలిసిందేనన్నారు. కమిషన్‌ సభ్యుడు కాకముందు ఆయనకు సొంత ఇళ్లు కూడా లేదని, సభ్యునిగా నియమిడైన తరువాత కోట్లకు పడుగలెత్తారన్నారు.

గవర్నర్‌ స్పందించాలి లేకపోతే టీడీపీ ఆందోళన ఉధృతం
ఎపీపీఎస్సీ అక్రమాలపై గవర్నర్‌ స్పందించాలని చంద్ర బాబు డిమాండ్‌ చేశారు. ఎపీపీఎస్సీని ప్రక్షాళన చేయ పోతే టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. శనివారం తమ పార్టీ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి ఎపీపీఎస్సీ అక్రమాలపై వినతిపత్రం సమర్పిం చనున్నట్లు, అలాగే గవర్నర్‌కు వినతిపత్రాన్ని అందజేయ నున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఈ అంశాన్ని లేవదీయను న్నట్లు చెప్పారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.ఎపీపీఎస్సీని వైఎస్‌ భ్రష్ఠు పట్టి ంచారని మండిపడ్డారు. అనర్హులను తెచ్చి కమిషన్‌ సభ్యు లుగా నియమించారన్నారు.

అదే వైఖరి రోశయ్య, కిరణ్‌ కొనసాగిస్తున్నారన్నారు.రోశయ్య హయాంలో చంద్రశేఖర్‌ నియామకం జరిగినతీరే అందుకు ఉదాహరణ అంటూ వివరించారు. కమిషన్‌ సభ్యునిగా చంద్రశేఖర్‌ 2009 డిసెంబర్‌ 18వ తేదీ ఆయన దరఖాస్తు చేసుకుంటే, 19వ తేదీ ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్య గవర్నర్‌కు సిపార్సు చేయడం జరిగిందన్నారు. 21న గవర్నర్‌ అమోదించగా 23న ఆయన్ని కమిషన్‌ సభ్యునిగా నియమించారన్నారు. ఇటువంటి అనర్హులను సభ్యులుగా నియమించకుండా గవర్నర్‌ ఎందుకు అడ్డుకోలేకపోయారో ప్రజలకు సమా దానం చెప్పాలన్నారు. అర్హులైన నిరుద్యోగ యువకులకు కాంగ్రెస్‌పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీఏ కమిషనర్ల నియామకాల్లో ఇదేతీరులో వ్యవ హరించారని మండిపడ్డారు. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు ఆనా డే అనుమతిచ్చి ఉండాల్సిందన్నారు.

పక్కనే ఉన్న కర్నా టకలో మంత్రిగా ఉన్న గాలి జనార్ధన్‌రెడ్డి ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.కళంకిత మంత్రులను సీబీఐ ఎప్పుడో జ్యుడిషియల్‌ కస్టడీకి కోరాల్సిందన్నారు. కాకపోతే ఇప్పుడు కోరిందని వ్యాఖ్యానించారు. డీఎల్‌, టీడీపీతో ఒప్పందం కుదుర్చు కుని కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారన్న కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలు ఆయన దృష్టికి తీసుకురాగా, ప్రతిది టీడీపీపైకి నెట్టడం అలవాటుగా మారిపోయిందని ధ్వజమెత్తారు. తల్లి, పిల్ల కాంగ్రెస్‌ నేతలకు టీడీపీ కుట్ర చేసిందని చెప్పడం పరిపాటయిందన్నారు.